గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు దాన బస్తాలను భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన బుర్ర శ్రీనివాస్ గౌడ్ కుమారుడు బుర్ర వినోద్ గౌడ్ మంగళవారం ఆలయానికి దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలను అందజేసిన శ్రీనివాస్ గౌడ్ వినోద్ గౌడ్ లకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఈ కార్యక్రమంలో యాంసాని రాజు హనుమాన్ మాల ధారణ భక్తులు పాల్గొన్నారు