తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మునిగల రాజు ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేద ప్రజల వైద్యం చేసుకోలేని నిరుపేదలకు వైద్యం అందించి ప్రభుత్వ సహాయ నిధి నుండి చెక్కులు అందజేయడం పాటు ప్రజలకు సేవ చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అండదండగా ఉంటున్నాడని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించకుండా పేద ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగుల కోసం పనిచేస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారం పల్లిగ్రామంలో ఇమ్మినేని లింగారావుకు 60000 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి చెక్కు రావడానికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల రాములు మానవా హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ మండల అధ్యక్షుడు తిరుపతి గుండి పరశురాములు ఎండి హనీ ఫ్ జింక ఆనందం గడ్డమీద శ్రీనివాస్ సంచుల కిషన్ గుగ్గిల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు