ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మరియు వైస్ చైర్మన్ పొతిపెద్ది రమణారెడ్డి లపై కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస నోటీసులు సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు 9 మంది డైరెక్టర్లు నోటీసులను అందజేశారు. 13 డైరెక్టర్ లకు గాను 9 మంది డైరెక్టర్ లు అవిశ్వాసానికి సంతకాలు చేసి సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు అవిశ్వాస తీర్మానాన్ని డైరెక్టర్ లు అందజేశారు. డైరెక్టర్ లు అల్లడి యాదగిరి రావు, గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, కొంకటి మల్లన్న, మద్దెల వెంకటలక్ష్మీ, నాయిని పార్వతమ్మ, సముద్రాల వాణి, ముడుసు ఓదెలు, అల్లం గోవర్ధన్ సబ్ రిజిస్టర్కు నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పూదారి సర్వేష్, మాజీ జడ్పీటీసీ లు చొప్పరి సదానందం, నాగినేని జగన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ నాయకులు గుజ్జ లింగారావు, రామగిరి మహేందర్, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, నల్లాల శ్రీను, గాదం శ్రీనివాస్ డైరెక్టర్ లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.