కొనరావుపేట, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. చెన్నమనేని వికాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ, మన దేశాన్ని, మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మోదీ అని, తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో జరిగిందనీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి, మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం, గోపాడి సురేందర్ రావు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.