ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
నేడు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఎంతోమంది అర్హత కలిగిన ఉద్యోగులు ఉన్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు. ఎక్స్టెర్నల్ నోటిఫికేషన్ రద్దుచేసి ఇంటర్నల్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా మైనింగ్ సర్దార్లు ప్రమోషన్ లేకుండా ఉన్నారని, వారికి వెంటనే ఓవర్మెన్లుగా పదోన్నతులు కల్పిం చాలన్నారు. సింగరేణిలో షార్ట్ ఫైరర్ల కొరత ఉందన్నారు. కారణ్యనియామకం ద్వార ఎంపికైన యువ కార్మికుల్లో ఎంతో మంది డిప్లొమా పూర్తిచేశారని, వారిలో అర్హులను గుర్తించి సర్దార్, షార్ట్ ఫైరర్లుగా ప్రమోట్ చుమాలన్నారు. ఒక సంవత్సరంలో 60మస్టర్లు ఆఫ్సెంట్ ఉంటే వారికి క్యాడర్ స్కీమ్ వర్తించడంలేదన్నారు. అలాంటి షరతులను తొలగించాలని డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం. హెడ్ ఆఫీస్ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని యామాన్నాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోటపలుకుల రవేష్ సుధాకర్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.