తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ఆఫీసు నుండి రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించలేదని రైతు రుణమాఫీ చేయలేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులు అవుతున్న ఆరోగ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం అలాగే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని పొడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట అసెంబ్లీ ఎర్ర మహేష్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్న మా నేని శ్రీధర్ రావు కిషన్ మోర్చా అధ్యక్షులు జంగం కిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రాజేందర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య తంగళ్ళపల్లి మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఆసాని రామలింగారెడ్డి తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి కలికోట చరణ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు భవిత ఎస్సి మోర్చా అధ్యక్షులు ప్రశాంత్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రవి బీజేవైఎం మండల మాజీ అధ్యక్షులు వినయ్ మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు రాజు మహేందర్ సీనియర్ నాయకులు అనిల్ అరుణ్ శ్రీనివాస్ రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు