పరకాల యంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
21 పిబ్రవరి నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మందిగా తరలివచ్చి సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునే భక్తులు అవసరం నిమిత్తం వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు వినియోగించి అక్కడ వదిలి వెళ్లడం వలన చాలా వరకు పర్యావరణం దెబ్బ తింటుందని అటవీ జంతులకు,గ్రామస్థులకు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఒక ఆలోచన విధానంతో ప్రభుత్వం ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించినందున మేడారం జాతర లో ప్లాస్టిక్ కవర్లు,ప్లేట్లు,గ్లాసులు అమ్మడం లేదని కాబట్టి జాతరకు వెళ్లే భక్తులు గుడ్డ సంచులు,స్టీల్ గ్లాసులు,ప్లేట్లు ఇతరాత్ర ప్లాస్టిక్ విరోధ వస్తువులను వెంట తీసుకుని వెళ్లాలని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు కోరారు.