చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ,ప్రాథమిక పాఠశాల దగ్గరలో ఏర్పాటుచేసిన బుద్ధుడు విగ్రహం ధ్వంసానికి గురైంది, గతంలో కూడా ధ్వంసం కాగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. మళ్లీ మంగళవారం ఉదయం స్థానికులు చూసేసరికి గౌతమ బుద్ధుడి రెండు చేతులు ధ్వంసానికి గురై నాయి. ఇది ఆకతాయిల పనా లేక కావాలని ఎవరైనా చేశారా అని గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇది ఎవరు చేశారో తెలుసుకొని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి వారికి తగిన శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నాను.