ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 8
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి, ముల్కలపల్లి, పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్లకర్తి, కాసులపాడు, మెట్టుపల్లి, గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఆయనకు ఆయా గ్రామాల మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున కోలాటాలతో డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారతులతో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల సంక్షేమమే ఎజెండాగా పెట్టుకొని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా ప్రజలు చూడాలంటే, నిస్వార్థ సేవకుడిగా పని చేస్తూ..భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్, సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత- సంజీవరెడ్డి, మొగుళ్లపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న, పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, మొట్లపల్లి సర్పంచ్ నరహరి పద్మ-వెంకటట్ రెడ్డి, ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.