అనంత పద్మనాభుని చుట్టూ అంతు చిక్కని రహస్యాలు

రాశుల కొద్ది బంగారానికి పాముల కాపలా

ఆరోగది ముందు కాలనాగుల బుసలు

ఆ తలుపులను తెరిచే ధైర్యం ఉందా..?

ఎక్కడైనా మిస్టరీ ఉందంటే చాలు దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొందరికైతే తెలుసుకునేవరకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఈ డోర్లు మూసి చాలా ఏళ్లు అవుతున్నా.. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నా ఎవరూ వాటిని తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు. వాటిని తెరిస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో.. ఏ ప్రళయం మీద పడుతుందో అనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. ఆ మిస్టీరియస్‌‌ డోర్ల కథేంటి చూద్దాం.

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో ఆరు రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్రవైడ్యుర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయ వెనక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊ ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్ల భాగవతం పేర్కోటోంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనులు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్ధిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్యపూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్ కోర్ రాజకుంటుబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది.

స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.

2011లో ఆలయ పాలకమండలి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ఏ, బీ, సీ గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి.

ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డీ, ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్ది లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచానా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంత కాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు. వెల కట్టనేలని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version