వనపర్తి నెటీదాత్రి :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ రిటైర్డ్ తహసిల్దార్ మరణం తీరనిలోటు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ గా ఉంటూ ఎనలేని సేవలు అందించిన ఖాజా కుతుబుద్దీన్ సేవలు మరువనివి. సామాజిక సేవలో విశ్రాంతి సమయంలో కూడా వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడుతూ,అందర్నీ కలుపుకుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలను, సామాజిక సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ద్వారా ముందుకు తీసుకు వెళుతూ ప్రశంసలు పొందారు. సామాజిక సేవలో వారు చురుకుగా పనిచేశారు