ఐఎన్టియుసి నాయకులు
రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 07, నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఉద్దేశించి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని రామకృష్ణాపూర్ ఉపరతల గని ఐఎన్టియుసి నాయకులు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని వద్ద ఐ ఎన్ టి యు సి నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ ఎన్నికల్లో ఓటమికి గురై విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి పై చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధించిన గెలుపును బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం జీర్ణించుకోవడంలేదు అని అన్నారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ పాలనను బిఆర్ఎస్ నాయకత్వంతో పాటు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు అని అన్నారు. సీఎం ను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే భేషరతుగా వెనక్కి తీసుకోవాలని,లేనిపక్షంలో బాల్క సుమన్ కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఫిట్ సెక్రటరీ సిహెచ్ రమేష్ , యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.