రేవంత్‌ పిలుపే ప్రభంజనం

`రెండేళ్లలో అద్భుతమైన తెలంగాణ చూస్తారు

`పట్టుదలకు మారు పేరు రేవంత్‌ రెడ్డి.

అద్భుతమైన పాలనకు ముఖ్యమంత్రి ‘‘రేవంత్‌ రెడ్డి’’ పుట్టిన రోజు సందర్భంగా ఆయన దార్శనికత భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని చెప్పడంలో సందేహం లేదంటున్న ‘‘డిసిసి’’ ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌) అధ్యక్షులు ‘‘రోహిన్‌ రెడ్డి’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తి కరమైన అంశాలు.. ఆయన మాటల్లోనే..

`ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూసే ప్రసక్తి వుండదు.

`ప్రతిపక్షంలో వున్నప్పుడే ప్రజల మనసు గెలుచుకున్నాడు.

`పాలకుడిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు.

`చెదిరిపోయిన తెలంగాణను చక్కదిద్దుతున్నారు.

`పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.

`నిరుద్యోగుల గోడు పట్టించుకోలేదు.

`డిఎస్సీ వేయలేదు.

`గ్రూప్‌ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేరు.

`పది నెలల్లోనే ఉపాధ్యాయుల నియామకం జరిగింది.

`ఇప్పటికే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.

`త్వరలో పరీక్షలు అనేక ఉద్యోగాలకు జరగనున్నాయి.

`మళ్ళీ టెట్‌ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. 

`ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ను మరిపించేలా ఇంటిగ్రేటెడ్‌ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం జరుగుతోంది.

`స్కిల్‌ యూనివర్సిటీ మొదలైంది.

`ఇవి బాలారిష్టాలు కాదు..బిఆర్‌ఎస్‌ పెట్డిన కుంపట్లు ఆర్పుకుంటూ పోవాల్సి వస్తోంది.

`అటు అప్పులు..ఇటు జనం తిప్పలు..సరిదిద్దే పనిలో వున్నారు.

`రేవంత్‌ రెడ్డి పాలన ఫలాలు త్వరలోనే అందుతాయి.

`తెలంగాణలో ఇల్లు లేని పేదలు లేకుండా చేయడమే లక్ష్యం.

`మూసి ఎంత అందంగా తయారౌతుందో రెండుమూడేళ్లలో చూస్తాం.

`బీఆర్‌ఎస్‌ చేస్తున్న గాయి, గాయిని ప్రజలు పట్టించుకోవడం లేదు.

`రెండు లక్షల రుణమాఫీ సామాన్యమైన విషయం కాదు.

`అంత పెద్ద లక్ష్యమే పూర్తి చేసిన సిఎం ఎన్నికల హామీలన్నీ పూర్తి చేస్తారు.

`గతంలో చెరబట్టిన చెరువులను రక్షిస్తున్నారు.

`విధ్వంసమైన ప్రకృతి కి పూర్వ వైభవాన్ని తెస్తారు.

`ఆ నమ్మకం ప్రజలకు బలంగా వుంది.

`మూసీ నిర్వాసితులను కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటారు.

`రెండు సంవత్సరాలలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుంది.

`అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్‌ నిలుస్తుంది.

`అవినీతి రహిత నిర్మాణం జరుగుతోంది.

`ప్రభుత్వ కార్యాలయాలలో పనులు వేగంగా జరుగుతున్నాయి.

`అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది.

`కరంటు మీద దుష్ప్రచారాన్ని చేశారు.

`రైతులను బీఆర్‌ఎస్‌ తప్పుదోవ పట్టించాలని చూసింది.

`బీఆర్‌ఎస్‌ మాటలు ఇక చెల్లవు.

`తెలంగాణ లో వాళ్ల మాటలు పట్టించుకోరు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలన సాగుతోంది. ప్రజలు మెచ్చిన పాలన సాగుతోంది. ప్రజలు కోరుకున్న పాలన అధ్భుతంగా జరగుతోంది. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన పది నెలల్లో అధ్భుతమైన ప్రగతి రాష్ట్రంలో కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారు. ఆనందంగా రేవంత్‌రెడ్డి పాలనను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి ప్రజల కోసం రాజకీయాలు చేసిన నాయకుడు. ప్రజా హితం కోరి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. ప్రజల మేలు కోరుకునే నాయకుడు. పేద వర్గాలను ఉన్నత స్ధాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న పాలకుడు. తెలంగాణను అధ్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఆత్రమెక్కువ. ప్రజలు దించేశారన్న కోపం కన్నా, రేవంత్‌రెడ్డిని ఎదుర్కొలేకపోయామన్న ఆందోళన వారిలో ఎక్కువైంది. మళ్లీ రేవంత్‌రెడ్డిని ఓడిరచడం తమ వల్ల కాదని తెలిసినా, ప్రజలను మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి తలకిందుల తపస్సు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నిత్యం ఆందోళనలే. నిత్యం అరాచకాలే. నిత్యం వేధింపులే. నిత్యం దోపిడీ పనులే..కాని ఇప్పుడు ప్రశాంత తెలంగాణను చూసి బిఆర్‌ఎస్‌ ఓర్చుకోలేకపోతోంది. ప్రజలను ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వుండాలని బిఆర్‌ఎస్‌ కోరుకుంటుంది. అందుకే బిఆర్‌ఎస్‌ పాలించినంత కాలం ప్రజల దృష్టిమళ్లించే రాజకీయాలు చేస్తూ వచ్చారు. పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ ప్రజల వద్దకు వెళ్లింది. ప్రజలను కలిసింది లేదు. వారి సమస్యలు విన్నది లేదు. వారి సమస్యలు వినే తీరిక కూడా చేసుకున్నది లేదు. కమీషన్ల పాలన సాగించారు. తెలంగాణను భ్రష్టుపట్టించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సాగిస్తున్న ప్రజాపాలనలో అధ్భుతాలు జరుగుతుంటే చూస్తూ భరించలేకపోతున్నారు. ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజలు బాగుపడితే ఇక తమను నమ్మరని భయపడుతున్నారు. అందుకే లేని పోని సమస్యలు సృష్టించాలని చూస్తున్నారు. అయినా ప్రజలు ఇక బిఆర్‌ఎస్‌ను నమ్మడం అనేది కలలో కూడా జరగదు. బిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. నిందిస్తున్నారు. పదేళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అయినా వారికి కనువిప్పు కలగడం లేదు. మేమెందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలా పాలన సాగించలేకపోయామన్న ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి పాలన ఒక చరిత్రగా కీర్తినందుకుంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ భవిష్యత్తుకు దార్శనికుడిగా రేవంత్‌ రెడ్డి రెండేళ్లలో ఒక చరిత్ర సృస్తాడంటున్న ఖైరతాబాద్‌ డిసిసి, హైదరాబాద్‌ సెంట్రల్‌ ప్రెసిడెంటు రోహిన్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు.. ఆయన మాటల్లోనే..

ఎవరి ఊహలకు అందనంత గొప్ప పాలన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతోంది. రేవంత్‌రెడ్డి పట్టుదలకు మారుపేరు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే పట్టువదలని విక్రమార్కుడు. అందుకే రాజకీయాల్లో తన శకాన్ని సృష్టించున్నాడు. తెలంగాణలో ఎవరికీ సాద్యం కాని రాజకీయాన్ని ఆవిష్కరించారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందు అహర్నిషలు పని చేశారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలు చవి చూశారు. మానసిక క్షభను గురయ్యాడు. అడుగుడగునా ఎదురౌతున్న అడ్డంకులన్నీ చేధించుకుంటూ ముందుకు సాగారు. ప్రజా సేవ కోసం, తెలంగాణ ప్రగతి కోసం, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయంగా రాటు దేలి నిలబడ్డాడు. ప్రజల గుండెల్లో స్దానం సంపాదించుకున్నారు. సవాలు చేసి మరీ బిఆర్‌ఎస్‌ను ఓడిరచి, ఆ పార్టీ పునాదులు కదిలించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పరిపాలనలో తెలంగాను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు. చెదిరిపోయిన తెలంగాణను చక్కదిద్దుతున్నారు. బిఆర్‌ఎస్‌ చెడగొట్టిన వ్యవస్ధలన్నీంటినీ గాడిలో పెడుతున్నాడు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌ లైన్‌తో తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమంలో అప్పుడప్పుడూ కనిపించి, అంతా నేనే చేశానని నమ్మించి, గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి కేసిఆర్‌ తెలంగాణను ఆగం చేశాడు. నీళ్ల పేరు చెప్పి, ప్రాజెక్టు నిర్మాణం అని నమ్మించి ప్రజా దనాన్ని నీళ్లలా ఖర్చు చేశారు. అయినా నీళ్లిచ్చారా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్దితి ఏమిటో ప్రజలందరికీ తెలుసు. నిర్మాణం చేసిన మూడేళ్లకే పగళ్లు వచ్చి పనికి రాకుండాపోయింది. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని అబద్దాలు చెప్పి, లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. నిధులు మాత్రం మాయం చేశారు. ఇక ఉద్యోగాల కల్పన చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. పదేళ్ల కాలంలో ఒక్క డిఎస్సీ వేయలేదు. తెలంగాణలో కేసిఆర్‌ 5వేల పాఠశాలలను మూసేంచారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అదికారంలోకి రాగానే ముందుగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారు. పది నెలల్లోనే ఆరు వేల ఉపాద్యాయ పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు మళ్లీ టెట్‌ కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత మరో ఐదు వేల ఉపాద్యాయ పోస్టులు త్వరలో భర్తీకి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ముప్పై వేలమందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది. గతంలో కనీసం పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహించక, నిరుద్యోగ యువత జీవితాలను చిన్నా భిన్నం చేసిన పాలన కేసిఆర్‌ది. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో పరీక్షలు పారదర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించి తన మార్కు పరిపాలన చూపిస్తున్నారు. తెలంగాణలో ఇంటర్‌ నేషనల్‌ సూళ్లతో పోటీ పడే విధంగా పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందుబాటులోకి వచ్చేందుకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. తెలంగాణ విద్యావ్యవస్ధను ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ హస్టళ్లలో చదువుకునే పేద విద్యార్ధులకు మెస్‌ చార్జీలు ఇటీవలే పెంచారు. వారికి నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రెండేళ్లలో అధ్భుతమైన పరిస్తితులు చూస్తారు. అత్యద్భుతమైన తెలగాణను చూస్తారు. గత పాలకులు చేసిన అప్పులు తీర్చుకుంటూ, వాళ్లు పెట్టిన కుంపట్లు ఆర్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని అప్పుల భారం నుంచి ఉపశమనం కల్పించారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణ రైతు కలను నెరవేర్చారు. వారికి భారం దించారు. ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేకాదని బిఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేయాలని చూసింది. కాని ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. రైతులకు వున్న రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతు బంధువు రేవంత్‌రెడ్డి అని నిరూపించుకున్నారు. సాధ్యం కాదని మాయ మాటలు చెప్పిన బిఆర్‌ఎస్‌ నోర్లు మూయించారు. తన చిత్తశుద్ది ఎంత గొప్పదో రేవంత్‌రెడ్డి నిరూపించారు. రైతులను రుణవిముక్తిగావించారు. వారి కళ్లలో ఆనందం నింపారు. ఇక రాష్ట్రంలో ప్రజలు ఎదురుచూస్తున్న మరో ముఖ్యమైన అంశం ఇందిరమ్మ ఇండ్లు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ అర్హులైన పేదలందరకీ డబుల్‌ బెడ్‌రూంలు ఇస్తామన్నారు. కాని ఏ ఒక్కఊరిలో ఒక్క ఇల్లు కూడా ఇచ్చింది లేదు. పదేళ్ల పాలనలో మాటలు తప్ప ఒక్క ఇల్లు కట్టింది లేదు. ఇలా ప్రజలను మోసం చేసి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కాని మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని ప్రారంభించాం. నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. ఏటా 5లక్షల ఇందరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎట్టిపరిస్ధితుల్లో వచ్చే నాలుగేళ్ల కాలంలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తాం. మరో పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనే సాగుతుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. సందేహం అసలేలేదు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి, ప్రజల గుండెల్లో రేవంత్‌రెడ్డి శాశ్వతస్ధానం సంపాదిస్తారన్న నమ్మకం నాకు బలంగా వుంది. ఐదేళ్లలో ఇచ్చిన హమీలన్నీ పూర్తి చేస్తాం. రెండేళ్లలో ఆరు గ్యారెంటీలు మొత్తం అమలు చేసి చూపిస్తాం. రేవంత్‌ రెడ్డి పాలన ఆదర్శంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరించేలా రోల్‌ మోడలౌతాం. మరోసారి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్‌రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!