కాటారం, నేటి ధాత్రి
కాటారం మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మండల ప్రత్యేక అధికారి డి సంజీవరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసిల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలు వారిగా ప్రత్యేక అధికారులను నియమించింది.. ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలలో వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఆర్ ఉపేంద్రయ్య, సీనియర్ అసిస్టెంట్ విద్యనాథ్, టైపిస్ట్ రవిశంకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
