జాకారం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి సిపిఎం పార్టీ మద్దతు
ములుగు టౌన్ నేటి ధాత్రి
ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాకారం గ్రామ శాఖ కమిటీ సమావేశం శాఖ సభ్యులు పల్ల కొండ పవన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఇన్చార్జి బాధ్యులు రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ జాకారం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) CPIM సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలియజేశారు
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్టల సుజాత మధుసూదన్ గారి కుటుంబానికి గ్రామ అభివృద్ధిలో ముందుంటారని ఉద్దేశంతో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(ఎం) జాకారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థికి ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పార్టీ సభ్యులు మరియు సానుభూతిపరులు ప్రజలు అందరు కూడా ఓటు వేసి గెలిపించుకొని గ్రామ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చంటి పవన్ సురేందర్ ప్రశాంత్ రవీందర్ కార్తీక్ భాస్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు
