దూసుకు వెళ్తున్న సిపిఎం అభ్యర్థి ప్రచారం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో సిపిఎం పార్టీ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థి బొచ్చు విజయ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మంగళవారం వార్డులో నిర్వహించారు.ఈ ప్రచారానికి
సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 2వార్డు అభివృద్ధి లక్ష్యంగా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రతి గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యమని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.బొచ్చు రాజు,మడికొండ ప్రశాంత్,బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్,చుక్క శాంతి కుమార్,మహిళలు పాల్గొన్నారు.
