*ఆర్థిక సహాయం అందజేసిన
* బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రెగుల సాయిలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు శనివారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్ షాక్ తో పూర్తిగా కలిపోయి భారీగా ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి తక్షణ సహాయం కింద 20,000 అందించారు. మరియు స్థానిక సర్పంచ్ జోగినిపెల్లి ప్రేమ్ సాగర్ రావు గారు10 వేల రూపాయలు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపెల్లి అజిత్ రావు, గారు 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.