“హెచ్ఎంఎస్ డిమాండ్”
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలం లో సింగరేణి పవర్ ప్లాంట్ కోసం 2012లో పరిసర ప్రాంతాలనుండి రైతుల దగ్గరినుండి భూమిని లాక్కొని భూనిర్వాసితులకు ఉద్యోగం కలిపిస్తాము అని అన్యాము చేసినారు, పవర్ ప్లాంటూ లో వేరే రాష్ట్రాల నుండి వచ్చినవారికి,ప్రాధాన్యత కలిపిస్తూ, వారికే ఎక్కువ జీతాలు ఇస్తు పదోన్నతులు కలిపిస్తున్నారు.తెలంగాణ లో భద్రాద్రి పవర్ ప్లాంట్, సెల్పూర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులకు, పర్మినెంట్ చేసినప్పటికి, స్థానిక ఎమ్మెల్యే భాల్క సుమన్ ఏనాడూ కూడా ఎస్ టి పి పి లో చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల గురించి పట్టించుకోలేదు. ఏ రోజు కూడా పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలాని ప్రభుత్వం దృషి కి తీసుకుపోయినా పాపాన పోలేదు కాబట్టి రాబోయే రోజులలో ఏర్పాటు చేసే ప్రభుత్వాలు, మరియు స్థానిక ఎమ్మెల్యే ఎవరు గెలిచినా పవర్ ప్లాంట్ కాంట్రక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ రెండు రోజులలో హెచ్ఎంఎస్ యూనియన్ ఎవరికి మద్దతు ఇస్తాము. అనేది ప్రకటిస్తాము ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విక్రమ్, వర్కింగ్ ప్రసిడెంట్ ప్రదీప్ రెడ్డి,సెక్రటరీ సాయి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్,సంపత్, రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లేష్ పాల్గొన్నారు.