నిరంతర విద్యాదాత… వెలుగులు నింపిన మహర్షి
పంజాల లింగమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ
మహబూబాబాద్/ నేటి ధాత్రి
పంజాల లింగమూర్తి గత 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి చేసి ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుంది, వీరు జ్ఞానాన్ని పంచడమే కాకుండా ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహర్షి” నిరంతర విద్యాదాత అని వీరు వృత్తి నుండి విరమణ పొందిన విద్యార్థుల గుండెల్లో వీరు ఎప్పటికీ గురువు గానే ఉండిపోతారని ఈ సందర్భంగా రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ కొనియాడారు.
ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఉన్నతమైన విలువలను పెంపొందిస్తుందని. రిటైర్ అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు అందకపోవడం వలన ఇప్పటివరకు 93 మంది రిపేరు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణించడం జరిగిందని. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించవలసి వస్తుందని అన్నారు. 2024 మార్చి నుండి ఇప్పటివరకు 20,500 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అయ్యి బెనిఫిట్స్ రాకా చాలామంది మనోవేదనతో హాస్పిటల్ పాలైనారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇకమీదట ఎవరు కూడా చనిపోకుండా ఉండడానికి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు, ఏప్రిల్ 23న జరిగిన క్యాబినెట్ సమావేశంలో 100 రోజుల్లో ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేస్తామని తీర్మానించడం జరిగిందని, ప్రభుత్వం మాట నిలబెట్టుకుని పదవి విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందరికీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
మే 1న ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చలలో ప్రభుత్వం స్పందించి నెల రోజుల్లోపు రిటైర్డ్ అయిన అందరి బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నామని. మేము దాచుకున్న డబ్బులను ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం ప్రభుత్వ దివాలా పోరు తనానికి నిదర్శనంగా భావించవలసి వస్తుందని. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేవా జిల్లా గౌరవాధ్యక్షులు సోమ గోవర్ధన్, టి. మురళీధర్ స్వామి, దొనికేన .అశోక్, జట్టి వెంకన్న, మాలోత్ .వెంకన్న మొదలగు వారు పాల్గొన్నారు.
