# దొంతి మాధవరెడ్డి చిల్లరగా దిగజారడం అత్యంత శోచనీయం.
# సర్వేలు మొత్తం బిఅర్ఎస్ వైపే మొగ్గు..
# ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బిఅర్ఎస్ పై కుట్రలు..
# నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని అలాగే ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిందని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్ద కాలాలుగా పాలించిన ప్రతిపక్ష నాయకులు విజ్ఞతలేని ఆలోచనలు వ్యవహరిస్తున్నారని వారికి నీతి మాలిన పనులు తప్పా, మరొక ఆలోచనే లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేయడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సంపేట నియోజకవర్గ ప్రజల కలలను సహకారం చేసిన నాపై ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
సీనియర్ నాయకులుగా ఉంటూ చిల్లరగా దిగజారడం అత్యంత శోచనీయం అని ఆరోపించారు.గృహలక్ష్మీ పథకం ద్వారా వచ్చే డబ్బులను అలాగే గత ఐదు సంవత్సరాలుగా అమలవుతున్న పథకాలతో పాటు వచ్చే నవంబర్ నెలలో విడుదలయ్యే రైతుబంధు డబ్బులు సుమారు 66 లక్షల పైబడి మంది రైతుల ఖాతాల్లో సైతం ఆపాలని ఎన్నికల కమిషన్ కు కోరడం ప్రజల సంతోషాలను ఓర్వలేని తనం కాంగ్రెస్ పార్టీది అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్రలు పండిన కాంగ్రెస్ పార్టీని నిరసిస్తూ ఆ వైఖరిని తిప్పి కోట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉన్నదని ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి అక్రమాల పునాదులు వేయక తప్పదని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలను గమనించాలని అలాగే రాబోయే ఎన్నికల్లో మరో సారి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పూర్తి స్థాయిలో అభివృధ్ధి సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే,బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ,కౌన్సిలర్ దార్ల రమాదేవి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,నాగిషెట్టి ప్రసాద్,కమాండ్ల గోపాల్ రెడ్డి, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.