మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థ ఏరియాలో ఈ అండ్ ఎం పర్చేస్ విభాగంలో ఏజిఎం గా విధులు నిర్వహిస్తూ అక్టోబర్ 31న పదవి విరమణ పొందబోతున్న ఏజిఎం సురేష్ ను ఏరియా జిఎం కార్యాలయంలో గురువారం టెండర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, ఈ అండ్ ఎం ఏజిఎం నాగరాజు, ఎఫ్ అండ్ ఏ డిజిఎం ఆర్విఎస్ఆర్ ప్రసాద్, డివైఎస్ఇ నరేష్, ఏరియా స్టోర్స్ ఎస్ఇ పైడిశ్వర్, గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.