చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన కొమ్ము రవి కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆకునూరు గ్రామంలో కొమ్ము రవి ని గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎండీ. హైమద్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైమద్ మాట్లాడుతూ.. ఆకునూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కొమ్ము రవి నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంచలంచలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. ఆయన ఎన్నికకు కృషి చేసిన జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు చెవిటి లింగం, ముస్త్యాల తార-యాదగిరి, కాంగ్రెస్ ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్, మెంటే ఉపేందర్, నీలం సన్ని, ఘనపురం వెంకటేష్, రాజు, శ్రీనివాస్, కృష్ణ, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.