చేర్యాల నేటిధాత్రి
చేర్యాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులు భారతదేశ మొట్టమొదటి సంఘసంస్కర్తలని పేర్కొన్నారు. ఈ దేశపు మూలవాసులను బానిసలుగా చేసిన విధానాన్ని మహాత్మ జ్యోతిరావు ఫూలే గారు తూర్పారాబట్టారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు గారు చేసిన పోరాటం చేసిన విధానాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్తాల నాగేశ్వరరావు,జి. బాబు, మల్లిగాడు శ్రీనివాస్.మల్లిగారి బాబు.లింగం, రామగళ్ళ నాగరాజు భూమిగారి దామోదర్ , నవ జీవన్. కర్రొల విజయ్.నరేష్ ఎర్రోళ్ల రమేష్ , చుంచు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.