*బండి సంజయ్ ని ఒక్క మాటన్నా ఊరుకొము.
-బీజేపీ మండల అధ్యక్షుడు పొంచెట్టి రాకేష్.
చందుర్తి, నేటిధాత్రి:
బీజేపీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గురించి కాంగ్రెస్ నాయకులు అనుచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ బీజేపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ..
“కాంగ్రెస్ పార్టీ మతరాజకీయలు చేయడం ఇప్పటికైనా మార్చుకోవాలని, బండి సంజయ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి కనబడకుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి, రామయ్య అక్షింతలు రేషన్ బియ్యం అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ని అడ్డుకోడం మీ తాత తరం కూడా కాదని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతకుంట గంగాధర్, అంబాల శ్రీకాంత్, అయోధ్య పర్శరాములు, ముప్పిడి సత్తయ్య, బోరుగాయ తిరుపతి, చింతకుంట సాగర్,మెంగని శ్రీనివాస్, పేరుక రంజిత్, సిరికొండ తిరుపతి, మెడిశెట్టి శ్రీహరి, చిలుముల ప్రేమ్ చారి తదితరులు పాల్గొన్నారు.
