నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూరు, సర్వాపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
మృతుల వివరాలు
కంఠాత్మకూర్ గ్రామం
తడక స్వామి,సాధు కొమురయ్య,పల్లెబోయిన ఉపేంద్ర.
సర్వాపుర్ గ్రామం
బోగి కొమురమల్లు
చర్లపల్లి గ్రామం
శీలం సారమ్మ.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.