హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సి సి కెమెరాలను శుక్రవారం రాత్రి హసన్ పర్తి సి ఐ జె సురేష్ ప్రారంభించారు. వివిధ అసాంఘిక కార్యకలాపాలు మరియు అసాంఘిక చర్యలను ఎప్పటికప్పుడు నిఘా నేత్రంలో బంధింప పడటం ద్వారా సమాజం లో శాంతి భద్రతలను పెంపొందించడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఎస్సై ఎం సురేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.