—డిబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్!
—బాధిత కుటుంబానికి 10 కొట్ల పరిహారం అందించాలి.
—డిబీఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శ.
హసన్ పర్తి / నేటి ధాత్రి
అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ జితేందర్ రెడ్డి మరియు నలుగురు కానిస్టేబుల్ లను ఉద్యోగం నుండి శాశ్వతంగా తోలగించి, హత్యా నేరం నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి,చట్ట ప్రకారం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు.
శనివారం నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని డిబిఎఫ్ ఆద్వర్యంలో పరమార్శించారు.
ఎస్ఐ శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం చుంచు రాజేందర్ మాట్లాడుతూ ఉన్నతమైన పోలీసు శాఖలో కూడా కుల వివక్షత ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.
కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది కొట్ల నష్ట పరిహారం అందించి,
కుటుంబంలో ఉద్యోగం, పిల్లల చదువును రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలన్నారు.
సిఐ, నలుగురు కానిస్టేబుల్ లను వెంటనే ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.
పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదాసి సురేష్, ఎబిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కలకొటి మహేందర్,డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, హెల్ఎచ్ పియస్ నాయకులు అజ్మీరా వెంకట్, రవి, ప్రసంగి, మల్లేశం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.