నర్సంపేట టౌన్, నేటిధాత్రి :
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వద్ద చిత్తు బొత్తు ఆడుతున్న 14 మంది ఆటగాళ్లను అరెస్టు చేసినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వివరాలు వెల్లడిస్తూ నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో అక్రమంగా నిషేధిత చిత్తు బొత్తు ఆటను డబ్బులతో పందెం కడుతూ ఆడుతుండగా పక్కా సమాచారం మేరకు ఆ స్థావరంపై దాడి చేయగా రూ.16 వందల తోపాటు ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.చిత్తుబొట్టు ఆడుతున్న వారిలో గండ్ల శ్రీను,పంబి రమేష్, సంఘపు దేవేందర్, మలిశెట్టి ధర్మేంద్ర, కాసరబడ రవీందర్, గందె చంద్రమౌళి,నూనె సతీష్, గడ్డం వెంకన్న, ఎర్రబెల్లి రాజు, వేణు,జీవన్, రాకేష్ దొంగల సురేష్ లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ రమణ మూర్తి వెల్లడించారు.