ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలి..

ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలి

సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్

భవిత కేంద్రాల్లో ప్రత్యేక పిల్లల నమోదు కార్యక్రమం

ప్రాథమిక పాఠశాల నుంచి ఎంఆర్సీ వరకు అవగాహన ర్యాలీ, తల్లిదండ్రులకు సూచనలు

నర్సంపేట, నేటిధాత్రి:

 

ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలని సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చెన్నరావుపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల నుంచి ఎంఆర్సీ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పిల్లలను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతరం ఎంఆర్సీలో జరిగిన సమావేశానికి సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి ప్రత్యేక పిల్లవాడిని గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్య అందరికీ హక్కు అని పేర్కొన్నారు.ఎంఈఓ పాపమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక విద్యా కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐఈఆర్పీ రాము పిల్లల గుర్తింపు, నమోదు విధానం, సేవలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించారు.ఈకార్యక్రమంలో 10 మంది తల్లిదండ్రులు, దివ్యాంగ విద్యార్థులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక పిల్లల పట్ల అవగాహన పెరిగి వారి విద్యా అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version