నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) మండల వ్యాప్తంగా హిందూ హృదయ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో ఛత్రపతి విగ్రహానికి మండల క్షత్రియ సంఘం ఆధ్వర్యములో నాయకులు పూలమాలకృతం చేసి,కేకు కట్ చేసి నివాళి అర్పించారు.
మర్రిపల్లిగూడెంలో గ్రామ యువకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. హిందూ సామ్రాజ్య పరిరక్షకుని జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ… జయంతి రోజున సెలవు ప్రకటించాలని అంతేకాకుండా ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.