జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల ప్రజలు, నాయకులు,యువకులు నూతన సంవత్సర వేడుకలను కుంటుంబ సభ్యులతో ఇళ్లల్లో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.రామగుండం సిపి శ్రీనివాస్,ఏసీపీ వెంకటేశ్వర్లు,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ 31న పోలీస్ సిబ్బందితో రాత్రి వేళలో తనిఖీలు చేపడతామని,నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని సూచించారు.అర్ధరాత్రి ఒంటిగంటలోపు వేడుకలను ముగించుకోవాలని,వేడుకల పేరిట ఎవరికైనా ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,మద్యం సేవించి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మీ పైనే ఆధారపడ్డ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని,అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే గ్రీటింగ్ పోస్టులతో సైబర్ మోసగాళ్లు చీటింగ్ కి పాల్పడే అవకాశం ఉంటుందని,సైబర్ మోసగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.