చిట్యాల ,నేటి ధాత్రి ;
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫ్రీ స్కూల్లో వస్తు సామాగ్రిని సిడిపిఓ అవంతి ప్రారంభించడం జరిగింది, 15 రకాల వస్తువులు ఎల్ఈడి టీవీ ఉయ్యాల స్టోరేజ్ డ్రంబు కుక్కర్ ఆట వస్తువులు బ్లాక్ బోర్డు కేంద్రంలో ఫ్రీ స్కూల్ పిల్లల సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ముఖ్య ఉద్దేశం గూర్చి సిడిపిఓ గారు తల్లులకు వివరించారు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు ప్రైవేట్ స్కూల్ కి వెళ్లకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని అప్పుడే పిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆటపాటల ద్వారా మంచి క్రమశిక్షణతో మంచి అలవాట్లతో నేటి బాలలే రేపటి పౌరులు గా ఎదగాలన్నీ అందుకోసం జిల్లా కలెక్టర్ గారు మండలంలోని నాలుగు సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు ఈ సామాగ్రిని పంపించడం ఆట బొమ్మల ద్వారా టీవీలో కూడా ఇంటిలో లాగా సీరియల్స్ సినిమాలు కాకుండా పిల్లలకు సంబంధించిన ఆటపాట కధ సృజనాత్మక కార్యక్రమాల లాంటివి చూపించుట తో ఎల్కేజీ యూకేజీ నర్సరీ నేర్పించి ఒకటో తరగతి వెళ్ళుటకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలందరిని సంసిద్ధులుగాతయారు చేయడం, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇందులో భాగంగా పిల్లలు తల్లుల బరువులు తీసి ఆహార ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ , సెక్రెటరీ అనిత హెల్త్ సూపర్వైజర్ ,ఏ ఎన్ ఎం సుగుణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద, గ్రామ పెద్దలు శంకర్,అంగన్వాడి టీచర్ ఉమాదేవి తదితరులు హాజరైనారు.