kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1బి దళితులకు ఉన్నా, వీరే సర్వహక్కులు కలిగి ఉన్నా, కేవలం ఓ బయానపత్రం, ఆర్‌ఓఆర్‌లను దస్తావేజులుగా చూపుతూ కొంతమంది కబ్జాదారులు బయలుదేరారు. భూమిని కబ్జా చేశారు. దళితులు లబోదిబోమన్నారు. భూకబ్జాదారుతోపాటు ఓ మహిళ సీఐ వేధింపులు భూయజమానులైన దళితులకు రోజురోజుకు పెరిగిపోయాయి. అన్ని హక్కులు, కావల్సిన దస్తావేజులు, కోర్టు ఆర్డర్లు ఉన్నా కబ్జాదారులకే ఆ మహిళా సీఐ వంత పాడుతోంది. కబ్జాదారులు అక్రమంగా భూమిలోకి ప్రవేశిస్తే సీఐ దగ్గరుండి రక్షణ కలిపిస్తోంది. దళితులను రాత్రి వరకు ఆడ, మగా తేడా లేకుండా స్టేషన్‌లో నిర్బందించి బూతులు తిడుతూ నానాహంగామా సృష్టించిందట. కోర్టు ఆర్డర్లు, భూమి దస్తావేజులతో తనకు పని లేదు. తాను చెప్పిందే వేదం. తాను చెప్పిందే తీర్పు. తానే కోర్టు అన్నట్లుగా భూమి వదిలివెళ్లండని దళితులకు ఆ మహిళా సీఐ హుకుం జారీ చేస్తోందట.

పూర్తి వివరాలు రేపటి సంచికలో…

vallyball kit panpini, వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాజేడు గ్రామ యూత్‌కు వాలీబాల్‌ కిట్‌ను ఆ గ్రామ ఆదివాసీ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు, బోదెబోయిన పరమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడలో రాణించి వాజేడు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా క్రీడల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు గ్రామ యూత్‌ సభ్యులు ఆలం శివ, బంధం రాంబాబు, బొడ్డు కృష్ణ, తోలెం దినేష్‌, జాక ప్రవీణ్‌, చిడెం రవికుమార్‌, చిడెం నాగేంద్ర, ఆలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం

విద్యార్థికి సన్మానం

పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్‌-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలపడంతో ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విద్యార్థికి నగదుతోపాటు శాలువాతో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తండాల నుండి ఉత్తీర్ణత సాధిస్తే సన్మానించనున్నట్లు వైద్యుడు భరత్‌రెడ్డి తెలిపారు.

chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని తెలిపారు. రెండుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అదేవిధంగా దేశవిదేశాల్లో 500పైగా వికలాంగ రంగస్థల ప్రదర్శనలు, 200పైగా కచేరీలు చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగులను సంఘటితం చేసిన ఘనత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుని, రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న దివ్యాంగురాలు పద్మావతికే ఈసారి వికలాంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ని, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ని కలిసి అన్ని సంఘాల నాయకులు కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌, మదర్‌పాషా, ఆలీ, మంజురి ఇలాహి, రాజయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

saibaba mahimalu…mayamaina piasalu, ‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు

‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు
వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్‌ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్‌ చేసుకున్నారని చెబుతున్నారు.
– బాయ్స్‌ పేరిట దొంగపేర్లకు డబ్బులు జమ
పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో పనిచేయని వారికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును కాజేయాలన్న ఉద్దేశ్యమేనని అర్థమౌతున్నది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందే ఈ దొంగ పేర్లను సేకరించారు. వారికి తెలిసిన సన్నిహితులతోపాటు బంధువుల పేర్లతో దొంగలెక్కలు రాసి చెక్కుల ద్వారా వారివారి అకౌంట్లలో వేశారు. కార్యాలయ సిబ్బందినే ఈ దొంగ పేర్లను బిల్లులు తయారుచేసే ఉద్యోగికి అందించారని పక్కా సమాచారం.
– కళ్లు మూసుకుని డిఐఈవో సంతకాలు..
కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, అకౌంటెంట్‌తో చేతులు కలిపి ఈ అవినీతికి పాల్పడ్డారని, వీరు చేసిన నిర్వాకం చూస్తే అర్ధమౌతున్నది. ఇలా దొంగదారిలో తయారుచేసిన బిల్లులపై కార్యాలయ డిఐఈవో కనీసం వాటిని పరిశీలించకుండానే కళ్లు మూసుకుని సంతకాలు చేయడంతో డిఐఈవో పాత్ర కూడా ఉందన్న అనుమానం రేకెత్తుతున్నది. ఇవే కాకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ విషయంలో కూడా ఇంటర్‌బోర్డ్‌కు పంపిన ప్రపోజల్‌ అమౌంట్‌ వేరు, వచ్చిన మొత్తం డబ్బులు వేరు, స్క్వాడ్స్‌కు చెల్లించింది మాత్రం అంతంత మాత్రమే. ఇక మిగిలిన డబ్బును వీరు నొక్కేశారని కొంతమంది సీనియర్‌ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
                                                                                    (అధికారి లీలలు….అవినీతి జాడలు త్వరలో…)

tera venuka suthradarulevaru…,తెర వెనుక సూత్రధారులెవరు…?

తెర వెనుక సూత్రధారులెవరు…?

– ఐనవోలు వెంచర్‌ వెనుక అదృశ్యశక్తులెవరు

– ఎవరి అండతో రియల్టర్లు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు

– అనుమతులు లేవంటున్న ‘కుడా’ చైర్మన్‌

– స్మశానంలో రియలెస్టేట్‌ ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు

– ‘స్మశానంలో రియలెస్టేట్‌’ విషయంలో ఆరా తీస్తున్న ఇంటలీజెన్స్‌

నేటిధాత్రి బ్యూరో : ఐనవోలు మండలకేంద్రంలో స్మశానంలో వెంచర్‌ నిర్వహిస్తూ, కుడా అనుమతులు ఉన్నామంటూ ప్లాట్లు అమ్మకం పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అధికారులు, కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు రియలెస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్మశానంలో వెంచర్‌ నిర్వహించడానికి ఓ కార్పొరేటర్‌ భర్త, అధికార పార్టీ ప్రజాప్రతినిధి హస్తం ఉందని వెనకల ఉండి వీరే ఆ తతంగం అంతా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరు మాత్రం తమకేం సంబంధం లేదని అంటున్నారు.

‘నేటిధాత్రి’కి బెదిరింపులు

ఐనవోలు మండలకేంద్రంలో ‘స్మశానంలో రియలెస్టేట్‌’ పేరుతో కథనం వెలువడగానే అందులో ఎవరి పేర్లు లేకున్నా 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ బానోతు కల్పన భర్త సింగ్‌లాల్‌ ‘నేటిధాత్రి’కి ఫోన్‌ చేసి భూకబ్జాల విషయం ప్రభుత్వం చూసుకోవాలని ఉపదేశమిచ్చారు. తన పేరుపై గజం భూమి లేదంటూనే వార్త రాసే ముందు తన వివరణ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సంబంధం లేని అట్రాసిటి కేసు విషయం తీసుకువచ్చి కులం కార్డు వాడుతూ మీపై అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. తమ పేరు రాయనపుడు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నిస్తే తన పరువు పోయిందంటూ బాధపడిపోయారు. ఐనవోలు వెంచర్‌తో సంబంధం లేనపుడు ఎందుకు పరువుపోయిందని బాధపడాలో అర్థం కాని విషయం.

ఎవరి బలం చూసుకుని…

వర్థన్నపేట ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ ఎవరిని లెక్క చేయని తనంతోనే బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే అండ చూసుకుని ఏం చేసిన చెల్లుతుందనే ధీమాతో ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియలెస్టేట్‌ వ్యాపారాన్ని వృత్తిగా చేసుకుని ముందుకు వెళుతున్న సింగ్‌లాల్‌ ఎమ్మెల్యే పేరుతో అధికార పార్టీలోని కొందరిని సైతం లెక్క చేయకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా కేవలం ఎమ్మెల్యే అండతోనేనని పలువురు ఆరోపిస్తున్నారు.

అనుమతులు ఇవ్వలేదు…తప్పుడు ప్రకటనలు నమ్మెద్దూ

కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి

ఐనవోలు మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌కు సంబంధించి కుడా నుండి ఎలాంటి అధికారిక అనుమతి లభించలేదని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తెలిపారు. నిర్వాహాకులు ఇస్తున్న ప్రకటనలు తప్పుగా మేము ధ్రువీకరిస్తున్నామని చెప్పారు.

లేఅవుట్‌ నిర్వహించడానికి ప్రజలు వ్యతిరేకం

కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్‌

మండలంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ నిర్వహణ కొరకు స్థానిక స్మశాన వాటికలు తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకమైనప్పటికీ సంబంధిత అధికారులు చేస్తున్న ప్రయత్నాలు రియలేస్టేట్‌ దారులకు లాభదాయకంగా ఉండడం భాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

cameralu bandh…dieo hastham unda…,కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….?

కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….?

– సీసీ కెమెరాలను నిలిపివేసిందెవరు..!

– కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర

– డిఐఈవో ఏం చేస్తున్నట్టు

– ప్రశ్నిస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాలు

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలను నిలిపివేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాన్ని చదివిన ప్రజలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అవినీతి లీలలు అలుముకున్నాయని గత ఐదు రోజులుగా వరుసగా ‘నేటిధాత్రి’లో కథనాలు వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపధ్యంలో సీసీ కెమెరాలను నిలిపివేసి ఈ తతంగమంతా చేసివుంటారన్న అనుమానం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతున్నది.

-డిఐఈవో ఏం చేస్తున్నట్టు

కార్యాలయంలో సీసీ కెమెరాలు గత ఏప్రిల్‌ నెల నుండి నిలిపివేసిన విషయం డిఐఈవోకు తెలియకుండా వుంటుందా? కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని ఒక్కసారి కూడా కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు..తన చాంబర్‌లో టీవి మానిటర్‌ను నెలలో ఒక్కసారి కూడా ఎందుకు ఓపెన్‌ చేయలేదు..కావాలనే డిఐఈవో నిలిపివేశాడా..కార్యాలయంలోని ఉద్యోగులు నిలిపివేశారా? అన్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తిస్తున్నది. ఇంత జరుగుతున్నా డిఐఈవో అటు వైపు దృష్టి సారించకపోడంలో ఆంతర్యం ఏమిటని పలు విద్యార్థి, ప్రజాసంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

-కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర

కార్యాలయంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల పేపర్‌ వాల్యుయేషన్‌ అనంతరం లెక్కకు మించి బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. బిల్లులు తయారుచేసే సమయంలో తమ అవినీతి ఎవరికి చిక్కకుండా దొరకకుండా కెమెరాలను నిలిపివేసి వుంటారని ప్రజలు భావిస్తున్నారు. ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉపన్యాసాలిచ్చే డిఐఈవో తన కార్యాలయంలో మాత్రం సీసీ కెమెరాలను ఎందుకు నిలిపివేశారో..ఎవరు నిలిపివేశారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

online ganjaye muta gutturattu, ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు

ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు

– 30లక్షల విలువ చేసే 150కిలోల గంజాయి స్వాధీనం

– రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు కూడా…

– వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను శనివారం ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠాసభ్యుల నుండి సుమారు 30లక్షల విలువగల 150కిలోల శుద్దిచేసిన గంజాయితోపాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోనగాని భిక్షపతి, వరంగల్‌ ఆర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌ గ్రామానికి చెందిన తీగల రాజు ఆలియాస్‌ చిన్నరాజు, హన్మకోండ వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జెల్లి యాకయ్య, జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన మాసారపు భూపతిరావు ఉన్నారు. అదేవిధంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోమటిపల్లి విష్ణుపురి కాలనీలో నివాసం ఉంటున్న బానోత్‌ వీరన్న ఆలియాస్‌ వినోద్‌, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ పట్టణానికి చెందిన నాయుడు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోత్తవాడకు చెందిన దేశిని రమేష్‌, జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా గోరుకోత్తపల్లి గ్రామానికి చెందిన శంకర్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల్లో ఒకడైన బోనగాని భిక్షపతి, పరారీలో ఉన్న వినోద్‌, నాయుడు ముగ్గురు మిత్రులని పేర్కొన్నారు. గతంలో వీరు చోరీలు పాల్పడడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. ఈ ముగ్గురు నిందితులు దొంగతనాలకు స్వస్తి పలికి సులువుగా డబ్బు సంపాదించాలనే అలోచనతో ఆన్‌లైన్‌లో గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పారు. నిందితులు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అంద్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గంజాయిని సెల్‌ఫోన్‌లో ఆర్డర్లు తీసుకోనేవారని, ఆర్డర్లు స్వీకరించిన నిందితులు మరో ఆరుగురు నిందితులను తమ ముఠాలో నియమించుకుని వారి ద్వారా నాయుడుకు తెలిసిన వ్యక్తుల ద్వారా విశాఖపట్టణం జిల్లా నుండి గంజాయిని బోలేరో వాహనాల్లో తాత్కాలిక రహాస్య ప్రదేశంలో పెట్టి వరంగల్‌ నగరానికి చేరవేసేవారన్నారు. అనంతరం ప్రధాన నిందితులు వినోద్‌, నాయుడు ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తులకు గంజాయి సిద్దంగా వుందని, తమ బ్యాంక్‌ ఖాతాకు డబ్బు జమ చేయాలని సెల్‌ఫోన్‌లో సమాచారం ఇచ్చేవారన్నారని తెలిపారు. ఆర్డర్‌ చేసిన వ్యక్తుల నుండి ఖాతాలో డబ్బు జమ కాగానే నిందితులు గంజాయిని కార్లలో మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అంద్రప్రదేశ్‌లకు ముఠాసభ్యులతో తరలించేవారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన బానోత్‌ వీరన్నపై గతంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జఫర్‌గడ్‌, పాలకుర్తి పోలీస్‌స్టేషన్ల పరిదిలోó బందిపోటు దొంగతనాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని అన్నారు. మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా సంబంధించి పలు కేసులు నమోదు కాగా, బోనగాని బిక్షపతిపై ఇంతజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనంతోపాటు అంధ్రప్రదేశ్‌లో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరో నిందితుడు నాయుడుపై అంధ్రప్రదేశ్‌లో గంజాయి రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని వివరించారు. పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారాన్ని గుర్తించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఎ.సి.పి చక్రవర్తి, ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌, ఎల్కతుర్తి సబ్‌-ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, సూరి, ఉపేందర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య, కానిస్టేబుళ్లు రాజు, కిరణ్‌లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందించారు.

autonu deekottina tractor, ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌

– నలుగురికి తీవ్రగాయాలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద కూలీలతో వరంగల్‌కు వెళుతున్న ఆటోను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు గాయాలు కాగా నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కూలీలు వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందినవారు.

nidithudipia pd act, నిందితుడిపై పీడీ యాక్ట్‌

నిందితుడిపై పీడీ యాక్ట్‌

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థినిని హతమార్చిన నిందితుడిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. హన్మకొండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి అనే విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన నిందితుడు వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేష్‌పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంపత్‌రావు కేంద్రకారాగారంలో నిందితుడికి జైలర్‌ సమక్షంలో పీ.డీ యాక్ట్‌ నిర్బంధ ఉత్తర్వులను అందజేశారు. నిందితుడు పెండ్యాల సాయి అన్వేష్‌ హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహనికి అంగకరించలేదని సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదిన విధ్యార్థిని తోపుచర్ల రవళిపై పెట్రోల్‌పోసి నిప్పంటించడంతో బాధితురాలు రవళి మార్చి 4వ తేదిన హైదరాబాద్‌ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంఘటనపై నిందితుడిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇలాంటి నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి చేసుకుంటానే సాకుతో వేధింపులకు గురవుతున్న విధ్యార్థినులు మౌనంగా ఉండకుండా తమ సమస్యను పోలీస్‌ అధికారులు, తమ తల్లిదండ్రుల దష్టికి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారిపై చట్టపరిధిలో కఠినచర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ పేర్కోన్నారు.

mla dasyam maji pa arrest, ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌

ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ మాజీ పీఏ బిల్లా అశోక్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోపాలపురంలోని 27గుంటల భూమికి నకిలీపత్రాలు సష్టించి అసలు హక్కుదారులను బెదిరించి కబ్జాకు యత్నించడంతో ఎమ్మెల్యే మాజీ పీఏ అశోక్‌రెడ్డితో పాటు రేపాల సురేష్‌, మందపల్లి స్వామి, విజయకుమార్‌లను అరెస్ట్‌ చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు వీరిని వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. నగరంలో ఎవరు భూకబ్జాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.

avinithiki…suthradari..,అవినీతికి… సూత్రధారి…?

అవినీతికి… సూత్రధారి…?

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ కార్యాలయంలో అవినీతి భాగోతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ‘నేటిధాత్రి’లో గత నాలుగురోజులుగా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి లీలలపై వరుసగా కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. కార్యాలయంలో తీగ లాగితే ఢొంక కదిలిన చందంగా మరిన్ని విషయాలు బయటికొస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల అనంతరం మార్చి-ఏప్రిల్‌ నెలలో నిర్వహించిన పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది. ఇదంతా కార్యాలయంలో ఓ సీనియర్‌ ఉద్యోగితో పాటు మరికొంత మంది కలిసి చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.

అపరిచితుల అకౌంట్లలో డబ్బులు జమ

పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో పేపర్‌ కట్టల మూటలు మోయడానికి, వాటిని అందించడానికి రోజువారి కూలీలను నియమించుకుంటారు. వీరు పనిచేసినట్లుగా సంతకాలు చేయడం కోసం ఓ ప్రత్యేక రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో ప్రతిరోజు సంతకాలు పెట్టాల్సి వుంటుంది. వీటి ప్రకారమే ఎన్ని రోజులు పనిచేశారో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. దీంతో ఎవరెన్ని రోజులు పని చేశారు, ఎవరికెంత చెల్లించాలనేది తెలిసిపోతుంది. కాని ఇందుకు భిన్నంగా క్యాంపు ఆఫీస్‌లో పనిచేసిన వారికంటే ఎక్కువమంది పనిచేసినట్లుగా (ఉదా: 206మంది పనిచేస్తే 296మంది చేశారని చూపడం) తప్పుడు లెక్కలు రాసి డబ్బులు నొక్కేశారని క్యాంపు కార్యాలయంలో ప్రచారం జరుగుతున్నది.

లెక్కకు మించి బిల్లులు పెట్టిన వైనం

పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన లెక్చరర్స్‌ విషయంలో కూడా పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన వారికటే ఎక్కువమంది చేసినట్లు బిల్లులు తయారుచేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కో టేబుల్‌లో ఉన్న వారికంటే ఎక్కువమందిని చూపెట్టారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా క్యాంపు ఆఫీస్‌ అధికారుల సంతకాలు లేకుండానే ఈ బిల్లులు తయారుచేశారని పలువురు గుసగుసలాడుతున్నారు.

కార్యాలయంలో సీసీ కెమెరాల నిలిపివేత

ఇదిలా ఉండగా డిఐఈవో కార్యాలయంలో బిల్లులు తయారుచేసే సమయంలో సీసీ కెమెరాలను కార్యాలయంలోని కొంతమంది నిలిపివేసినట్లు తెలుస్తున్నది. సీసీ కెమరాలను గతనెల ఏప్రిల్‌ నుండి నిలిపివేయడంతో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది.

(సూత్రధారి ఎవరు, పాత్రదారులు ఎవరు…వివరాలు త్వరలో)

chaduvuthopatu kridallo raninchali, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

– చింతగట్టు గ్రామాభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని చింతగట్టు గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం అన్నారు. 55వ డివిజన్‌ పరిధిలోని చింతగట్టులో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేసవి క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, దాతగా హాజరై వాలీబాల్‌ క్రీడలు ప్రారంభించారు. తాను పుట్టిన గ్రామంలోని విద్యార్థులకు తన సొంత ఖర్చుతో వాలీబాల్‌ , నెట్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాంనర్సయ్య, పాపయ్య, ఆడెపు సుదర్శన్‌, శ్యామ్‌, బాలవికాస ప్రతినిధులు నద్దునూరి బాబురావు, రాజకొమురయ్య, వాలీబాల్‌ కోచ్‌ రాణప్రతాప్‌, శ్రావణ్‌, చింటూ, విద్యార్థులు పాల్గొన్నారు.

mandava paramarsha, మండవ పరామర్శ

మండవ పరామర్శ

అనారోగ్యంతో కిమ్స్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘వేడిగాలి’ పత్రిక ఎడిటర్‌ జమాల్పూర్‌ విఠల్‌ వ్యాస్‌ను శనివారం మధ్యాహ్నం టిఆర్‌ఎస్‌ ముఖ్య నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో వాకబు చేశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని కిమ్స్‌ ఆసపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సాంబశివరావును కోరారు. సకాలంలో వైద్యసేవలు అందచేయడంలో చొరవ చూపిన ఎంపీ కవితను మండవ అభినందించారు. ఈ సందర్భంగా మండవ వ్యాస్‌ కుటుంబసభ్యులు, డాక్టర్‌ రాజశేఖర్‌, నాగోజి, ఈశ్వర్‌, మేఘన, గణేష్‌లకు భరోసా ఇచ్చారు. వ్యాస్‌ కోలుకునే వరకు అవసరమైన వైద్యం కోసం బాసటగా నిలుస్తానని వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. అదేరోజు హైదరాబాద్లో ఇంటిలిజెన్స్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌ కూడా వ్యాస్‌ను పరామర్శించారు. డాక్టర్లని కలిసి వ్యాస్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

nakili vithanalu vikraisthe pd act namodu cheyandi, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు పీడీయాక్ట్‌ కింద కేసులను నమోదు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అధికారులను అదేశించారు. రాబోవు వర్షాకాలంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభంకానుండటంతో వ్యవసాయదారుల సంక్షేమాన్ని దష్టిలో వుంచుకోని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ రైతులకు మేలు కలిగించే రీతీలో పోలీస్‌ అధికారులు నకిలీ విత్తనాలతోపాటు, నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన భాధ్యత పోలీస్‌ అధికారులపై వుందని అన్నారు. నకిలీ విత్తన అమ్మకాల కొరకు గ్రామాలకు వచ్చే ఏజెంట్లు, దళారీలతోపాటు విత్తనాల విక్రయాల కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చి లాడ్జ్‌ల్లో బసచేసే వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీసులు సేకరించాలని తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతోపాటు వారిపై గట్టి నిఘా కొనసాగించాల్సి వుంటుందని, ఇందుకోసం స్థానిక పోలీసులతోపాటు, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రత్యేక దష్టి పెట్టాలని అన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలను గుర్తించడంపై స్థానిక పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతోపాటు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుకు సంబంధించిన రశీదు పోందే విధంగా రైతులను ప్రోత్సహించాల్సి వుంటుందని చెప్పారు. ఇదే సమయంలో గడువు తీరిన విత్తనాలను అమ్మకాలపై అధికారులు దష్టిపెట్టాలని, నకిలీ విత్తనాల నియంత్రణకు అధికారులు స్థానిక వ్యవసాయ విభాగం అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాబోవు 15రోజుల లక్ష్యంగా నకిలీ విత్తనరహిత పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు తీసుకరావడంలో పోలీస్‌ అధికారులు పూర్తిస్థాయిలో కషి చేసి రైతులు నష్టపోకుండా, రైతులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.

repu narada jayanthi..,రేపు నారద జయంతి….

రేపు నారద జయంతి….

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు…నారద మహర్షి..మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోకసంచారం చేస్తాడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ విదియ. ఈ తిథినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుతారు. నారదుడు త్రిలోక సంచారి. ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్రను పోషిస్తుంటాడు. ‘నార’ అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ‘ద’ అనగా ఇచ్చేవాడని అర్థం ఉంది. నారదుడి జన్మ వత్తాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రళయం తర్వాత కాలంలో పునఃసష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుని నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ…మరీ చి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజాపతులను సష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు. మానవాళి శ్రేయస్సు కోసం నారదుడు ఎన్నో మంచి పనులు చేశాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పాత్రికేయలందరికీ మహర్షి నారదుడి జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినంగా నిర్వహిస్తూ..ఆ రోజున పాత్రికేయ వత్తికి న్యాయం చేకూరుస్తున్న కొంతమంది పాత్రికేయులను ప్రతి సంవత్సరం సంచారభారతి సన్మానిస్తున్నది. పాత్రికేయులు అంతా మహర్షి నారదుని బాటలో నడిచి ప్రజల కష్టాలను దూరం చేసినప్పుడే ధర్మమార్గంలో నడిచే సమాజం వెల్లివిరుస్తుంది. ఈ సందర్భంగా 19వ తేదీ ఆదివారం ఉదయం పదిన్నరకు బాలసముద్రంలోని సామాజికం మోహన్‌రెడ్డి స్మారక భవనంలోని ఏసీ సెమినార్‌ హాల్లో నారద జయంతి సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులను సమాచార భారతి సన్మానిస్తున్నది. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్‌, భారతీయ ప్రజ్ఞ సంపాదకులు మామిడి గిరిధర్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు దాసరి కష్ణారెడ్డి, పిన్న శివకుమార్‌లను సత్కరిస్తున్నారు.

ftl bumulu mingestunnaru, ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…!

ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…!

భద్రకాళి చెరువు శిఖం భూములపై కబ్జాకోరుల కన్ను

ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా నిర్మాణాలు

ఎఫ్‌టీఎల్‌ కాదని దవీకరిస్తూ కబ్జాకు సహకరిస్తున్న ఓ ప్రభుత్వ ఇంజనీర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చుకొని నిర్మాణాలు చేస్తున్న కొందరు వ్యక్తులు

నగరంలో ఓ కొత్త కబ్జాకు కొందరు తెర లేపారు. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో పాగా వేసి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. హంటర్‌ రోడ్‌ ప్రాంతంలోని భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా కుడా నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌లు తెచ్చుకొని మరి నిర్మాణాలు చేస్తున్నారు. కుడా అనుమతులు ఇవ్వడానికి కావల్సిన ఎన్‌ఓసి సర్టిఫికేట్‌ను ఓ ప్రభుత్వ ఇంజనీర్‌ డబ్బులు దండుకొని ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎఫ్‌టీఎల్‌ భూముల్లో కబ్జాదారులు దర్జా వెలగబెడుతున్నారు.

‘ఎఫ్‌టీఎల్‌’ భూముల కబ్జాపై సమగ్ర కథనం త్వరలో……

professorpia thappudu pracharalanu vyethirekinchandi, ప్రొఫెసర్‌పై తప్పుడు ప్రచారాలను వ్యతిరేకించండి

ప్రొఫెసర్‌పై తప్పుడు ప్రచారాలను వ్యతిరేకించండి

శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతపై చేస్తున్న తప్పడు ప్రచారాలను వ్యతిరేకించాలని ప్రజాతంత్రవిద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) నాయకులు, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్టు-లెనినిస్టు) యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్‌ సుజాత దళితులపక్షాన నిలిచి, అడుగడుగున దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ, పీడిత దళిత ప్రజలను చైతన్యవంతం గావిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళిత మహిళలకు భరోసాను ఇస్తున్నదని, తమ అధికార పార్టీలకు దాసోహం చేయటంలేదనే అక్కసుతో దేశభవిష్యత్‌ అయిన విశ్వవిద్యాలయం విద్యార్థులపై తమ బ్రాహ్మణీయ, మనువాద భావజాలాన్ని రుద్దడానికి వ్యతిరేఖంగా నిలబడుతూ విద్యార్థుల్లో శాస్త్రియ అవగాహన కల్పిస్తూ, మార్క్స్‌, పూలే, అంబేద్కర్‌ల ఆలోచనలను ప్రచారం కావిస్తూ, భూస్వామ్య అవశేషభమైన అగ్రకుల ఉన్మాదాన్ని, తమ ఉపన్యాసాలతో ఎదిరిస్తూ, ఎదిరించేలా విద్యార్థులను తయారు చేస్తున్నదని అన్నారు. ఎలాగైనా అణిచివేయాలనే దురుద్దేషంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దాని అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపితో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. అంతేగాక ఎడ్యుకేషన్‌ టూర్‌లకని తీసుకెళ్ళి విద్యార్థులను మావోయిస్టులతో కలిపిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక ఫాసిస్టు నిర్బంధపూరిత విధానాలను ఎండగడుతున్నందున తమను వ్యతిరేకించే వారెవ్వురూ ఉండకూడదని మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఇటువంటి పాలకవర్గాల (కేంద్ర, రాష్ట ప్రభుత్వాల) కుటిలనీతిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్‌ సుజాతపై దాడులకు పూనుకుంటున్న వారు ఎవరో విద్యార్థులు, వివిధ రంగాల ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు మాని వాస్తవాలపై ఆధారపడి మాట్లాడాలే తప్ప అవాస్తవాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ భావపరంగా దాడులు చేస్తూ మేధావులను, విద్యార్థులను అణిచివేయచూడడాన్ని అన్ని రంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకులు అర్శం అశోక్‌, శరణ్‌, పథ్వి, తిరుపతీ, ఎం.అనిల్‌కుమార్‌, యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం ఉన్నారు.

smashanallo realeastate, స్మశానాల్లో రియలెస్టేట్‌

స్మశానాల్లో రియలెస్టేట్‌

భూకబ్జాలు, ఇండ్ల కబ్జాలు, చెరువులు, కుంటల కబ్జాల గురించి తరచు మనం వింటూనే ఉన్నాం. ఇటీవల ఇవి మరి ఎక్కువైపోయాయి. నూతన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి స్థానికంగా భూములకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్ళ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసి భూములు లాక్కోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కబ్జాల్లో ఓ కొత్తరకం కబ్జాకు తెర తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…వర్థన్నపేట నియోజకవర్గంలో ఉన్న ఐనవోలు నూతన మండలంగా ఏర్పడిన తర్వాత కొందరు రియాల్టర్లు మండలకేంద్రానికి ముందుభాగంలో కొంతభూమిని కొనుగోలు చేసి ప్లాట్లను చేసి అమ్మకానికి ఉంచారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే వారు కోనుగోలు చేసిన భూమికి ముందు, పక్కన గ్రామానికి సంబంధించిన స్మశానవాటికలు ఉన్నాయి. దీంతో ఇండ్లస్థలాల కొరకు ఏర్పాటు చేసిన వెంచర్‌లో స్మశనాలు ఉంటే ఎవరు కోనుగోలు చేయడానికి ముందుకు రారనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేతల అండదండలతో కలిసి గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశానవాటికను అభివృద్ధి పేరుతో ఎత్తివేసేందుకు కొంతమంది పథకం రచించారు. తరతరాలుగా స్మశానవాటిక కోసం ప్రజలు వినియోగించుకుంటున్న స్థలాన్ని మార్చేందుకు రియాల్టర్లు విఫలయత్నం చేస్తున్నారు.

రియల్టర్‌ వ్యాపారం కోసం…

భూముల వ్యాపారం చేసుకుంటే దానికి ఎవరు అడ్డు చెప్పరు. అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్లు నిర్వహించుకోవచ్చు. కాని అనువు గాని చోటని తెలిసి కూడా అక్రమంగా స్థలాన్ని కొనుగోలు చేసి, ప్లాట్లు చేసి అమ్ముకొని కోట్లు గడించడానికి రియల్టర్లు చేస్తున్న ప్రయత్నంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అప్పన్నంగా సంపాదించేందుకు రియల్టర్లకు సహకరిస్తున్న కొంతమంది నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు.

అధికారపార్టీ నేత,కార్పోరేటర్‌ భర్త నయాదందా

ఇటీవలే అధికార పార్టీ నుండి కీలక నాయకుడిగా ఎదిగి స్థానిక శాసనసభ్యునికి అత్యంత నమ్మిన బంటుగా ఉంటున్న ఓ కార్పోరేటర్‌ భర్తకి సంబంధించిన ఈ లేఅవుట్‌ కోరకు స్థానిక నాయకులు స్మశానవాటికలను అప్పగించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కార్పొరేటర్‌ భర్త, ఓ అధికార పార్టీ నాయకుడి చేష్టలతో జనం అసహించుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజలకు సంబంధించిన స్మశాన స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లు వేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండలకేంద్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ఇంత జరుగుతున్నా స్థానిక నాయకులుగానీ, ఎమ్మెల్యేగానీ ఈ విషయంపై ఎంతమాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావీస్తోంది. కార్పొరేటర్‌ భర్త మరో అధికార పార్టీ నాయకుడిని కలుపుకుని స్మశనాల్లోనే లేఅవుట్లు చేసి ఇంత బహిరంగంగా ప్లాట్లను అమ్మకానికి పెట్టినా ఇటు అధికారులుగానీ, అటు అధికార పార్టీ నాయకులుగానీ ఎంత మాత్రం నోరుమెదపకపోవడంపై దీని వెనకాల వీరి హస్తం కూడా ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని తమకున్న కబ్జా తెలివితో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తరతరాలుగా ఉంటున్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు రాక ముందు తప్పుడు ప్రకటనలు…

మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు కుడా నుండి ఇంకా ఎలాంటి అనుమతి రాకముందే కోనుగొలుదారులు ఆకర్షించి ప్లాట్లను అమ్ముకోవాలని నిర్వహకులు చేస్తున్న తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. లేఅవుట్‌ ముందు వెంచర్‌ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌లు నిర్మించబోతున్నట్లు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు బాగోతం చాటున వారికి స్థానిక పాలకులు,ముఖ్య నాయకుల అండదండల ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇకనైనా అధికారులు, అధికార పార్టీ నాయకులు స్పందించి స్మశానాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

bujalu thadumukovadamenduku, భుజాలు తడుముకోవడమేందుకు…

భుజాలు తడుముకోవడమేందుకు…
– దుమారం రేపుతున్న ‘నేటిధాత్రి’ కథనాలు
– నాపైనే అంటూ…ఉక్కిరిబిక్కిరి
– ‘నేటిధాత్రి’పై అక్కసు వెళ్లగక్కుతున్న కొందరు సిబ్బంది
– ‘అస్త్రం’ ఎవరిదీ అంటూ ఆరా…
– విచారణకు ఆదేశించనున్న ఇంటర్‌ బోర్డు…?
– అవినీతి లీలలపై రోడ్డెక్కనున్న విద్యార్థి, ప్రజాసంఘాలు
గత రెండురోజులుగా ‘నేటిధాత్రి’ దినపత్రికలో ‘డిఐఈఓ కార్యాలయంలో…అవినీతి లీలలు’, ‘కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి’ అనే శీర్షికలతో వెలువడిన వరుస కథనాలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ‘గుమ్మడికాయ దొంగ ఎవరని అంటే…భుజాలు తడుముకున్న’ చందంగా కొందరు సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతటితో ఆగకుండా ‘నేటిధాత్రి’ కథనాలపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని సమాచారం.
                                                                                     వివరాలు త్వరలో…
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version