vidudala cheyali, విడుదల చేయాలి

విడుదల చేయాలి

పౌరహక్కుల సంఘం, టివివి విద్యార్థి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం నాయకులు, డిఎస్‌ఓ రాష్ట్ర నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేసారని, వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 49 వేలకుపైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మిస్తామని, కోటిఎకరాలకు నీటిని అందిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మించకపోగా భారీ ఖర్చుతో కూడిన భారీ ప్రాజెక్టులకు పూనుకున్నారన్నారు. అందులో భాగమే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారని, దానివలన అనేకమంది రైతులు, కూలీలు, పేద ప్రజలు నిర్వాసితులవుతున్నారని విమర్శించారు. నిర్వాసితులవుతున్న రైతులు, కూలీలు, పేదప్రజలు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా వారిని కలిసి పోరాటానికి సంఘీభావం తెలిపివస్తున్న పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మన్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సంయుక్త కార్యదర్శి రఘునాథ్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు భూపతి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌తో సహా 10మందిని తోగుట్టస్టేషన్‌ వద్ద అక్రమంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. అలాగే ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులను దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన హక్కుల కార్యకర్తలను, ఆదివాసీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని, బీమా కోరేగావ్‌ కేసును రద్దు చేయాలని క్రూరమైన నిర్బంధపూరిత ‘ఉపా’ చట్టాన్ని వెంటనే ఎత్తిచేయాలని చెప్పారు. వరంగల్‌లో రాజ్య నిర్బంధ వ్యతిరేక యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్న టివివి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘం నేతలను, వరంగల్‌లో టివివి విద్యార్థి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకుడు అర్షం అశోక్‌, ఎం.అనిల్‌కుమార్‌ ఉన్నారు.

vidyarthi jivithamtho urbane college chelagatam, విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

నగరంలో ప్రైవేట్‌ కాలేజీలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కాలేజీలు నడుపుతూ ధనార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారం చేస్తున్నారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపి కోట్లు దండుకుంటున్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. హన్మకొండ నగరంలో సర్య్కూట్‌ గెస్ట్‌హౌజ్‌ రోడ్డులో ఉన్న అర్బెన్‌ జూనియర్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థి జీవితం ఆగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే…హన్మకొండ కెఎల్‌ఎన్‌రెడ్డి ప్రాంతానికి చెందిన బి.వరుణ్‌ 2017లో ఎంపీసీ గ్రూపులో అడ్మిషన్‌ పొందాడు. 2017-18 మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు కూడా రాయడం జరిగింది. రెండవ సంవత్సరంలో విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంతో ఇంటర్‌బోర్డులో 2018-19 రెండవ సంవత్సర వార్షిక పరీక్ష ఫీజును కాలేజీ యాజమాన్యం చెల్లించలేదు. దీని ఫలితంగా విద్యార్థికి ఇంటర్‌ బోర్డు నుండి హాల్‌టికెట్‌ రాకపోవడంతో పరీక్షలు రాయలేకపోయాడు. దీనికంతటికి కారణం కళాశాల యాజమాన్యం ఫీజుల మీదు ఉన్న మోజు విద్యార్థి జీవితంపై లేకపోవడమేనని విద్యార్థి వరుణ్‌ ఆరోపిస్తున్నాడు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజును కళాశాలే విద్యార్థి పేరున కట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను వారు ఉల్లంఘించి విద్యార్థి జీవితాన్ని నాశనం చేశారు. ఫీజు పేరుతో తన తల్లిని కాలేజీకి పిలిపించి అనేకసార్లు మానసికంగా మాటలతో హింసించేవారని విద్యార్థి వాపోయాడు. గత కొన్ని రోజుల క్రితం ఫీజు విషయంపై మీతో మాట్లాడేది ఉందంటూ మమ్మల్ని పిలిపించి దొంగను నిల్చోబెట్టిన విధంగా నిల్చోబెట్టి 10మందికిపైగా అధ్యాపకులు గుమిగూడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోపోమ్మని బెదిరించారని బాధితుడు తెలిపాడు.

ప్రిన్సిపాళ్ల మార్పుతో విద్యార్థుల ఇక్కట్లు

అర్బెన్‌ జూనియర్‌ కాలేజీని వరుసగా ప్రిన్సిపాళ్ల మార్పుతో కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రామకృష్ణ కళాశాల నుంచి వెళ్లిన అనంతరం మరో ప్రిన్సిపాల్‌గా అపర్ణ వచ్చారని, ఆమె తరువాత ప్రస్తుతం శైలజా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతోంది. ప్రిన్సిపాళ్లు ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు మారడం వలన విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపాళ్లు ఆ ఫీజుతో మాకు సంబంధం లేదంటూ కళాశాల మొత్తం ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిఐఈఓకు ఫిర్యాదు

ఇంటర్మీడియట్‌ బోర్డు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పర్యవేక్షణాధికారికి విద్యార్థి బి.వరుణ్‌ తనకు జరిగిన అన్యాయంపై అర్బెన్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశానని, అయినా ఎలాంటి ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పై విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కళాశాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విద్యార్థి వరుణ్‌ వేడుకుంటున్నాడు.

నాకు న్యాయం చేయాలి

కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంగా నా పరీక్ష ఫీజును కళాశాల ప్రిన్సిపాల్‌ చెల్లించకపోవడంతో నాకు హాల్‌టికెట్‌ రాలేదు. దీని వల్ల పరీక్షలు రాసే అర్హతను కోల్పోయాను. విద్యాహక్కుచట్టం ప్రకారం, ఇంటర్‌బోర్డు నిబంధనల ప్రకారం కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజు కట్టలన్నా నిబంధనలను పాటించకుండా సంవత్సర కాలం వృథా చేశారని, దీనికి అర్బెన్‌ కళాశాలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నాకు జరిగిన అన్యాయంపై ఇంటర్‌బోర్డు డిఐఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితుడు రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రిన్సిపాల్‌ శైలజా వివరణ

ప్రిన్సిపాల్‌ శైలజాను వివరణ కోరగా నాకు ఆ విషయం గురించి తెలియదు. నేను ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకుని నెలరోజులే అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారం కోసం మాజీ ప్రిన్సిపాల్‌ కృపాకర్‌ను 8328315859 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించాలని సలహా ఇచ్చింది. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా అతను అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌, కులుమనాలిలో ఉన్నాను…ఇప్పుడేం మాట్లాడలేను అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

warangal prajanikaniki abinandanalu, వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు

వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు
సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌
మూడు విడతలలో జరిగిన పరిషత్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రజలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందనలు తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో మూడు విడతల్లో మొత్తం 36 మండలాల్లోని 36 జడ్పీటిసీ ఎన్నికలతోపాటు, 413ఎంపిటిసిలకు మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోలింగ్‌ నిర్వహించిన అన్ని గ్రామాల్లోను ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సజావు నిర్వహించేందుకు నాలుగు అంచెల భద్రతతో పోలీసు అధికారులు విధులు నిర్వహించడంతోపాటు, హోంగార్డ్‌ స్థాయి పోలీస్‌ అధికారి నుండి డిసిపి స్థాయి అధికారి వరకు అందరు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. ముఖ్యంగా మంగళవారం నిర్వహించిన పోలింగ్‌ను సజావు నిర్వహించేందుకు ప్రతి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
పోలింగ్‌ కేంద్ర సందర్శన
మూడవ విడత పరిషత్‌ ఎన్నికల సందర్బంగా గీసుగోండ మండలంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సందర్శించి పోలింగ్‌ కేంద్రంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలింగ్‌ సజావుగా కొనసాగేందుకు పోలీసు అధికారులు తీసుకున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ఈస్ట్‌జోన్‌ డిసిపి నాగరాజు, మామూనూర్‌ ఏసిపి శ్యాంసుందర్‌, గీసుగోండ ఇన్‌స్పెక్టర్‌ సంజీవరావుతో కలసి పరిశీలించారు.

strong roomlanu parishilinchina sp, స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన ఎస్పీ

స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల మొదటి, రెండవ విడత బ్యాలెట్‌ బాక్సులను బద్దెనపల్లి మోడల్‌ స్కూల్‌లోని స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గార్డు సిబ్బంది, సీసీ కెమెరాలు ఏర్పాటు, చుట్టూ ఏర్పాటుచేసిన లైటింగ్‌ తదితర భద్రతా ఏర్పాట్లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని భద్రతా సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ వెంకటరమణ, సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌, తంగళ్లపల్లి ఎస్సై శేఖర్‌ ఉన్నారు.

pranam thisina buthagada, ప్రాణం తీసిన భూతగాదా

ప్రాణం తీసిన భూతగాదా

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం బలరావుపేట గ్రామంలో భూతగాదాలతో పెట్టం శంకరయ్య అనే వ్యక్తిని అల్లంల బాలయ్య అనే వ్యక్తి గొడ్డలితో నరికాడు. దీంతో పెట్టం శంకరయ్యకు తీవ్రరక్తస్రావం జరిగి అక్కడికక్కడే మతిచెందాడు.

raithilanu sadvinyogam chesukovali, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

– ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక రకాల రాయితీలను కల్పిస్తుందని, రైతులు ప్రభుత్వం కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌ రావు ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగ విత్తనాలను ప్రభుత్వం 65శాతం రాయితీ ఇస్తుందని, కిలో జీలుగ విత్తనాలను 18రూపాయలకే అందజేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 51రూపాయలు ఉన్న కిలో జీలుగ విత్తనాలకు ప్రభుత్వమే 33రూపాయలు చెల్లిస్తోందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ ప్రతులను ఆగ్రోస్‌ సంస్థలో ఇచ్చి విత్తనాలను సబ్సిడీ ధ్వారా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి అడుప కవిత, సర్పంచ్‌లు జన్ను కుమారస్వామి, ఆడెపు దయాకర్‌, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ మజ్జిగ జయపాల్‌, ఉపసర్పంచ్‌లు అడ్డగూడి సతీష్‌, కొట్టం రాజు, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్‌, సీనియర్‌ నేతలు తండా వెంకన్న, బొల్లపల్లి పరమేశ్వర్‌, పెండ్లి మల్లారెడ్డి, పెండ్లి ఆగారెడ్డి, అమరవాది రవికుమార్‌, డబ్బా శ్రీనివాస్‌, గూడ లింగారెడ్డి, బుర్ర సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

kasulapia preethi…ideam rithi, కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…

కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…
వరంగల్‌ అర్బన్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో అవినీతి ఛాయలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇక్కడా…అక్కడా అనే తేడా లేకుండా అందినకాడికల్లా దోచుకోవడమే తమ ద్యేయమన్నట్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రతి యేటా కాలేజీలు అనుమతులు తీసుకోవడం, రెన్యువల్స్‌ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కాలేజీ అఫ్లియేషన్లు చేయాలన్నా, రెన్యువల్‌ కావాలన్నా కళాశాలల యజమాన్యాలు వీరి చేయి తడిపితేనే పనులు చకాచకా జరుగుతాయని లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ఛందంగా ఆయా ఫైళ్లు మూలనపడుతాయని పలు కాలేజిల యాజమన్యాలు ఆరోపిస్తున్నాయి.
ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకుంటున్న వైనం
కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అవినీతి ఆటలకు కార్యాలయంలోని ఓ అధికారి అండదండలు అందిస్తుండటం మూలంగానే ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కో కాలేజి నుండి వేలకువేలు వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ఇంటర్మీడియట్‌ బోర్డు హైదరాబాద్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమంగా దండుకున్న డబ్బులను ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాంపు పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగమయినట్లు కార్యాలయంలో పెద్దఎత్తున ప్రచారం కొనసాగుతున్నది. క్యాంపు కార్యాలయంలో పనిచేయని వారి అకౌంట్లల్లో డబ్బులు జమ చేసినట్లు కార్యాలయ సిబ్బందితోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
                                                                    – ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి వంతపాడుతున్న ఓ అధికారి….
                                                                              వివరాలు రేపటి సంచికలో

congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తన భర్త రాములు ఏడేళ్లు టీఆర్‌ఎస్‌లో పనిచేసినా ఆ పార్టీ మోసం చేసిందని దుర్గ ఆరోపించారు. ఎంపీటీసీ అభ్యర్థిగా ఇంటిపెండెంట్‌గా బరిలోకి దిగిన తన భర్తకు కాంగ్రెస్‌ బి-ఫారమ్‌ ఇచ్చిందని అన్నారు. పలువురు సూటీపోటీ మాటలకు తోడు అప్పులపాలయ్యామన్న బాధతో పురుగులమందు తాగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం

బావి తవ్వకం ప్రారంభం

వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్‌ గోడిశాల మమత సదానందంగౌడ్‌ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్‌ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆముదాల రమేష్‌, కొప్పు రాందాస్‌, గోడిశాల శ్రీనివాస్‌, గ్రామ నాయకులు మాటూరి రవీంద్రాచారి, ఏడ రమేష్‌, ఆవారి కన్నయ్య, మార్థ నవీన్‌, వేముల వేణు, బొడుసు స్వామి, నామాల రామయ్య, మచ్చిక రాజులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

mruthula kutumbalaku bima sahayam, మతుల కుటుంబాలకు భీమా సహాయం

మతుల కుటుంబాలకు భీమా సహాయం

నర్సంపేట మండలం కమ్మపల్లి మండలంలోని నేతాజీ పురుషుల పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంటూ ఇటీవల మతిచెందిన దామెర స్వామి, గడ్డం అశోక్‌ల నామినీలు (కుటుంబసభ్యులకు) అభయ నిధి పథకం, సామూహిక నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి 55వేల రూపాయల చొప్పున ఆ సంఘ అధ్యక్షుడు సాంబరాతి రమేష్‌ ఆధ్వర్యంలో, దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు నీలా రవీందర్‌ చేతుల మీదుగా బీమా పథకాల డబ్బులను వారికి మంగళవారం సంఘ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు పెండ్యాల మల్లేశం, రాము, రాజు, లింగారెడ్డి, రవి, శ్రీనివాస్‌రెడ్డి, సాంబయ్యలతోపాటు సంఘ గణకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

vidyardulaku andaga youth for swach duggondi, విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి

విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటామని యూత్‌ ఫర్‌ స్వచ్చదుగ్గొండి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల దుగ్గొండి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్‌తోపాటు వివిధ రకాలుగా సహాయం అందించిన సందర్భంగా వాటిని ఉపయోగించుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ కోసం ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని, త్వరలో ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అధ్యాపక బందాలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బాలకష్ణ, మోడెం విద్యాసాగర్‌గౌడ్‌, శివ, ప్రతాప్‌, రమేష్‌, కిషోర్‌, రాజేందర్‌, వేణు, యాదగిరి సుధాకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

taskforce headconistable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోగా హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తరలించారు. మ్యాక్స్‌కేర్‌ వైద్యుల సలహా మేరకు కరాటే శ్రీనును మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో కరాటే శ్రీనుకు చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లలో సైతం విధులు నిర్వహించారు. వీరు 1992బ్యాచ్‌కు చెందినవారు. వీరి తోటి బ్యాచ్‌ మెంట్స్‌, తోటి సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

taskforce headconstable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోయారు. దీంతో కరాటే శ్రీనును హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని, చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ పరమపదించారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లలో సైతం విధులు నిర్వహించారు. వీరు 1992బ్యాచ్‌కు చెందినవారు. వీరి తోటి బ్యాచ్‌ మెంట్స్‌, తోటి సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

ajancy mandala toperga gayatri, ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి

ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బాలసాని నరేంద్ర కుమార్తె బాలసాని గాయత్రి పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచింది. సోమవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటాపురం మండలంలోని భారతి విద్యానికేతన్‌ స్కూల్‌కు చెందిన గాయత్రీ 9.8జిపిఎతో ఏజెన్సీ మండల టాపర్‌గా నిలిచింది.

vanda shatham uthirnatha, వందశాతం ఉత్తీర్ణత

వందశాతం ఉత్తీర్ణత

నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులు మొట్టమొదటిసారిగా వందశాతం ఉత్తీర్ణత సాధించి రికార్డును సష్టించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 36మంది విద్యార్థినులు విద్యాభ్యాసం అభ్యసించి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ 36మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో వందశాతం ఉత్తీర్ణత సాధించారని, జెట్టీ నిహారిక అనే విద్యార్థిని 9.3 జిపిఎ సాధించి మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు, సహకరించిన అధ్యాపక బందానికి అభినందనలు తెలిపారు.

mathisthimitham leni vyakthi hulchul, మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్‌

మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్‌

రద్దీగా ఉండే హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. దిల్‌సుఖ్‌ నగర్‌ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలకు అడ్డుపడుతూ నానా హంగామా చేశాడు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఫైర్‌ ఇంజన్‌పై రాళ్లు వేయసాగాడు. అటుగా వెళ్లే పాదచారులను కర్రతో వెంబడించాడు. దాంతో వాహనదారులు, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రి నుంచి ఆ మతిలేని వ్యక్తి పారిపోయి వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తీ విసిరే రాళ్లదాడి నుంచి వాహనదారులు, పాదాచారులు పరుగులు తీశారు. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో, రాళ్లతో చెలరేగిపోయాడు. ఆ మతిలేని వ్యక్తి బారి నుంచి తప్పించుకునేందుకు జనం రోడ్లపై పరుగులు తీశారు.

 

intulo chori, ఇంట్లో చోరీ

ఇంట్లో చోరీ

– 35తులాల బంగారం అపహరణ

హన్మకొండ సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎక్సైజ్‌ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ పాల్పడగా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న 35 తులాల బంగారం అపహరించారని చెప్పారు.

maramathullu,  మరమ్మత్తులు

మరమ్మత్తులు

వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి డివిజన్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులను పునరుద్దరించడానికి కృషి చేస్తున్నామని 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వరంగల్‌లోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులు కార్పొరేషన్‌ సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తూ వారి పనితీరును పరిశీలించారు. కొద్దిరోజులలో ప్రతి ఇంటికి మంచినీరు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మిషన్‌ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. పైప్‌లైన్లు లేని ఏరియాలను గుర్తించారు. త్వరలో ఆయా ప్రాంతాలలో మంచినీటి పైపులు వేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మరుపల్ల రవి, సిబ్బంది లింగయ్య, ప్రకాష్‌, మరుపల్ల గీత, కళ్యాణపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

paruvuthisuthunna private palu, పరువుతీస్తున్న ప్రైవేట్‌ పిఎలు

పరువుతీస్తున్న ప్రైవేట్‌ పిఎలు

ఓ ప్రభుత్వ కార్యాలయం వెళ్లాలంటే అధికారి కంటే ముందు అక్కడ పనిచేస్తున్న అటెండర్‌ను ప్రసన్నం చేసుకోవాలి. అలా అయితేనే పని జరుగుతుంది లేదంటే అంతే సంగతులు. ఆ కార్యాలయంలో ఏ వ్యవహారం గూర్చి సమాచారం. కావాలన్న వారే సమస్తం. ఇది ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. మరీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తే అచ్చం ప్రభుత్వ కార్యాలయాలలాగే ఉంది. ఇక్కడ మాత్రం సూటు…బూటు వేసుకుని చేతిలో రెండు, మూడు సెల్‌ఫోన్లు, ఓ డైరీ, ఏవో కాగితాలు పట్టుకుని ఎమ్మెల్యేల వెనకాలో, మంత్రుల వెనకాలో అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు వీరి కంటే ఎక్కువ గర్వంతో దర్పం ఒలకబోసే పిఎలను ప్రసన్నం చేసుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే మీకు ఏ పని కావాలన్న వీరిని మచ్చిక చేసుకోవాలి. వీరు ఏ స్థాయి వరకు ఎదిగిపోయారంటే కొన్ని సందర్భాల్లో తాము పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను బ్లాక్‌మెయిల్‌ చేసే స్థాయికి ఎదిగిపోయారని ప్రచారం జరుగుతోంది. అందిన కాడికి దండుకునే స్థాయికి ఎదిగిపోయిన ఈ ప్రైవేట్‌ పిఎలు ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్న కొందరికీ వీరిని వదులుకోవడానికి మనసు రావడం లేదట. తమ వ్యక్తిగత రహాస్యాలు ఎక్కడ బయటపడతాయనో కొందరు వీరిని భరిస్తుంటే, తమ వ్యక్తిగత దందాలు చేసేవారు ఎవరు ఉండరని కొందరు భరిస్తూ వస్తున్నారట. ఇంకొందరు ప్రజాప్రతినిధులైతే నా పదవి, పరపతి ఉపయోగించి ఏదైనా చేయండి మేం చూసుకుంటాం ఫిఫ్టీ…ఫిఫ్టీ అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో ఈ ప్రైవేట్‌ పిఎలకు అడ్డూ…అదుపు లేకుండా పోయింది. అవసరమైతే ఉద్యోగం పోతుంది. ఇంతకుమించి అయ్యోదేముంది…? సంపాదనే ధ్యేయంగా పనిచేస్తే సరిపోతుందని ఇష్టారీతిన వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సీఎం కట్టడి చేసినా…!

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతరుల పిఎల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కట్టడి చేసే ప్రయత్నం చేసినా ప్రజాప్రతినిధులు మాత్రం వినడం లేదు. పిఎల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని చెప్పినా విన్నట్లే విని వారికి తోచిన వారిని పిఎలుగా నియమించుకుని తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా కొంత సిబ్బందిని కేటాయించిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలైతే అదనంగా నలుగురు, ఐదుగురిని తమ పిఎలుగా నియమించుకున్నారు. వీరు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్నామని అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది.

పిఎ షరతుకు తలొగ్గిన సీనియర్‌ మంత్రి…?

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా కొనసాగుతూ శాఖ మారిన రెండోసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ సీనియర్‌ మంత్రి తన వద్ద గతంలో పనిచేసిన పిఎ షరతుకు తలొగ్గి మరోమారు పిఎగా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పనిచేసినప్పుడు ఈ పిఎ ఎన్నికల సమయంలో సీనియర్‌ మంత్రికి మూడున్నర కోట్ల రూపాయల ఎన్నికల లెక్క చూపలేదట. దీంతో కోపం వచ్చిన సీనియర్‌ మంత్రి రెండోసారి పిఎగా తీసుకోవడానికి ససేమిరా అన్నాడట. అయితే గతంలో ఓ మంత్రి వద్ద పిఎగా పనిచేసిన వ్యక్తితో కలిసి సీనియర్‌ మంత్రిని కలిసి తమరి వ్యక్తిగత పనులు, డబ్బుల వ్యవహారం, భూముల వ్యవహారం, సెటిల్‌మెంట్లు అన్ని తామే చూసుకుంటామని, తమరి చేతికి మట్టి అంటకుండా పనిచేసి పెట్టి ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉంచుదామని నమ్మబలకడంతో ఈ ఇద్దరిని సీనియర్‌ మంత్రి పిఎలుగా నియమించుకుని వ్యవహారం నడిపిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. సీనియర్‌ మంత్రికి సంబంధించిన సంపాదన, ఆర్థిక విషయాల్లో వీరు జోక్యం చేసుకుని పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు పిఎల్లో ఓ పిఎ గతంలో ప్రముఖ మీడియా చానల్లో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆ పరిచయాలతో తనకు భారీ లాభం చేకూర్చుతాడని తన జోక్యం లేకున్నా బద్నాం కాకుండా వెనకేయవచ్చని సీనియర్‌ మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రైవేట్‌ పిఎల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో తలదూర్చి సర్వం తామే అన్నట్లు వ్యవహారించే ఈ పిఎల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధిని కలవడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో వీరి చేతివాటం విమర్శలకు గురి అవుతుంది. ఎంతైనా ప్రభుత్వం వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

bukabzadarulapia pd act, భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌

భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమున్న, వేగంగా వద్ధి చెందుతూ స్మార్ట్‌ సిటీగా ఎంపికైన కరీంనగర్‌ పట్టణంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని సామాన్యులు కలలు కనడం సహజం. ఈ కారణంగా, ఇటీవల కరీంనగర్‌ పట్టణంలో, శివారు ప్రాంతాల్లో భూమి విలువ అమాంతంగా పెరగడం వల్ల ఆ డిమాండ్‌ను తమకు లాభాలుగా మార్చుకోవాలని స్వార్థంతో, దురుద్దేశంతో భూకబ్జాదారుల కన్ను భూములపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు తమ పిల్లల భవిష్యత్తు, చదువులు, పెళ్లిళ్ల కోసం ఉపయోగపడుతుందని ఎంతో కొంత భూమి కొనుగోలు చేసి భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుకోగా ఆ భూములపై కన్నేసిన కొంతమంది భూకబ్జాదారులు తమకు ఉన్న పరిచయాలు, అనుభవంతో తప్పుడు కాగితాలు సష్టించి, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ భూములను కబ్జాలకు ప్రయత్నిస్తూ, నిజాయితీగా భూమి కొనుగోలు చేసిన యజమానులను, భూకబ్జాదారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల పోలీసుల దష్టికి వచ్చింది. సామాన్య ప్రజానీకానికి నిజమైన యజమానుదారులకు ఇబ్బందులు కలుగజేస్తూ భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని వారి ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నడుం బిగించారు. ఏప్రిల్‌ 25వ తేదీన కరీంనగర్‌ పట్టణంలోని రామచంద్రాపూర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 965లో కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 2010లో రెండు గంటల స్థలాన్ని కొనుగోలు చేసినాడు. ఆ భూమిని అప్పటినుండి తన స్వాధీనంలోనే ఉండగా అతను 25 ఏప్రిల్‌ 2019 రోజున ఉదయం గహ నిర్మాణం కోసం శ్రీనివాస్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణ పనులు చేసే ప్రయత్నం చేస్తుండగా ఆ భూమిపై కన్నేసిన భూమాఫియాకు చెందిన భూకబ్జాదారులు 1) సర్దార్‌ రాజ్‌బీర్‌సింగ్‌ 2) రాపల శంకర్‌ 3) సర్దార్‌ యశ్పాల్‌సింగ్‌ 4) బొంతల ప్రవీణ్‌కుమార్‌లు దాడిచేసి అతడిని తీవ్రంగా గాయపరచడమే కాకుండా అడ్డువచ్చిన కుటుంబసభ్యులపై కూడా దాడిచేశారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్‌ కమీషనర్‌ ఇటువంటి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి భూమిని కబ్జా చేయడమే కాకుండా బాధితులపై దాడి చేసినందుకు భూమాఫియా సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. భూబాధితులను బెదిరిస్తూ అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కళ్లెం వేసేందుకు కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహారించి సామాన్యులకు, భూబాధితులకు భరోసా కలిగించాలనే లక్ష్యంతో పోలీసులు ముందుకు నడుస్తున్నారు. అందులో భాగంగానే చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అంతేకాకుండా భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్న భూ మాఫియాదారులు, భూకబ్జాదారుల వివరాలను సేకరించి వారితో ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమీషనర్‌ కమలాసన్‌రెడ్డి భవిష్యత్తులో భూ ఆక్రమణలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version