పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా

విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తులో తరగతులు నిర్వహిస్తూ గాలిలో దీపం పెట్టిన చందంగా విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేట్‌ పాఠశాలలు చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాశాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని విద్యార్థులు, తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతులు ఇవ్వటంలో సంబంధిత శాఖలు విఫలమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదని విద్యార్థులు, మేథావులు భావిస్తున్నారు.

నిద్రమత్తులో సంబంధిత శాఖ అధికారులు

ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులను ఇచ్చే ముందు పర్యవేక్షణాధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించి, సానిటేషన్‌, ఫైర్‌, బిల్డింగ్‌ ఫిట్‌నెస్‌, క్రీడా మైదానం, లైబ్రరీ, మూత్రశాలలు, పార్కింగ్‌, విశాలమైన తరగతిగదులు ఉంటేనే అనుమతులు ఇవ్వవలసిన అధికారులు ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధానంగా బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో అగ్నిప్రమాదాలు జరిగితే, కనీసం ఫైర్‌ ఇంజన్‌ ప్రాంగణం చుట్టూ తిరగలేని విధంగా పాఠశాలల ఆవరణం, గోడలు ఉంటున్నా అధికారులు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారుల ఒక వైపు, ధనార్జనే ద్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్న యజమానులు మరోవైపు. ఈ ఇరువురి మధ్యన అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తుండటం, వాటికి ప్రహారీగోడలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు పైనుండి కిందికి చూసే క్రమంలో, అటు, ఇటు వెళ్లే క్రమంలో అదుపు తప్పి భవనంపై నుండి కింద పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కాశిబుగ్గ పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలపై నుండి పడి చనిపోయిన విషయం నగర ప్రజలకు, విద్యాశాఖ అధికారులకు, యాజమాన్యాలకు తెలిసిందే. అయినా ప్రైవేట్‌ యాజమాన్యాలు కేవలం డబ్బే లక్ష్యంగా పిల్లల ప్రాణాలను లెక్కచేయకుండా విద్యార్థులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అడ్డగోలు భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బరువుకు మించిన పుస్తకాల బ్యాగులను తమ వీపుపై మోసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కి పోయేవి మా పిల్లల ప్రాణాలా…మా విద్యావ్యాపారం వర్థిల్లితే చాలు అనే విధంగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును నగర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.

 

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట

మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, అంగన్‌వాడీ టీచర్‌ సడాలమ, వార్డు మెంబరు రమేష్‌, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం

ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు మీ ఇంటికి వస్తాడా అని శివాలెత్తాడు. ట్యాంకర్‌ నీళ్లు ఎందుకు…తంతా లం…కొడుకా ఎవడనుకుని మాట్లాడుతున్నావ్‌ అంటూ బూతు పంచాంగం విప్పాడు. నీళ్లు కావాలని అడిగినంందుకు బూతులతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే…గ్రేటర్‌ వరంగల్‌లోని 19వ డివిజన్‌లో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో స్థానికులందరు కార్పొరేటర్‌ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలనుకున్నారు. దీంతో స్థానికుడైన బత్తుల సంపత్‌కుమార్‌ కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజుకు ఫోన్‌ చేశాడు. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య గూర్చి వివరించి పరిష్కరించాలన్నాడు. అవసరమైతే డివిజన్‌లోని తమ ప్రాంతానికి వచ్చి నీటికొరత ఎలా ఉందో చూడవచ్చు అన్నాడు. అంతే తన కుమారుడిని సంపత్‌కుమార్‌ ఇంటికి రమ్మన్నాడని కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజు తండ్రి దిడ్డి నరేందర్‌ చిందులు తొక్కాడు. సంపత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి నానాబూతులు తిట్టాడు. నువ్వు ఎంతటివాడవురా నా కొడుకునే ఇంటికి రమ్మని అంటావా, ట్యాంకర్లు పంపుతున్నా సరిపోవడం లేదా అని నానా దుర్బాషలాడాడు. తెల్లవారేసరికి లేపేస్తా, నరికేస్తా అంటూ సభ్యత, సంస్కారం మరచి వయస్సును మరిచి ఫోన్‌లోనే తీవ్రస్థాయిలో వార్నింగ్‌ ఇచ్చాడు. సంపత్‌కుమార్‌ సతీమణి రమ సార్‌…సార్‌ అంటూ ఫోన్లో మర్యాదగా మాట్లాడిన కార్పొరేటర్‌ తండ్రి ఎంతమాత్రం తగ్గలేదు. వాడు…వీడు…చంపేస్తాం…నరికేస్తాం అంటూ అవే డైలాగ్‌లు వినిపించాడు. ఓ ప్రజాప్రతినిధి జనం సమస్యలు చూడడానికి జనం పిలిస్తే వెళ్లకుండా ఏంచేస్తాడో ఇంగిత జ్తానం లేకుండా మీరు పిలిస్తే నా కొడుకు వస్తాడా…? అంటూ కార్పొరేటర్‌ అయిన తన పుత్రరత్నం తరపున వకాల్తా పుచ్చుకుని మతిపోయినట్లుగా మాట్లాడాడు. స్థానికులందరు కలిసి నీటి సమస్య గూర్చి చర్చిస్తుండగానే కార్పొరేటర్‌ తండ్రి ఫోన్‌లో తన బూతు బాగోతాన్ని కొనసాగించాడు. ఇతగాడి వార్నింగ్‌లు, బూతు బాగోతంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపిస్తే తిట్టు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత

వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి

నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే ప్రదేశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దుకాణాల్లో ఎస్టబ్లమెంట్‌ యాక్ట్‌ అమలుకావడం లేదని ఒక్క కార్మికుడికి ఎస్‌ ఫాములు లేవని లేబర్‌ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యాజమాన్య సంఘాలతో లేబర్‌ అధికారులు జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేసి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేసే విధంగా చూడాలని, లేనిపక్షంలో టిఆర్‌ఎస్‌ కెవి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలడుగుల రమేష్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేయాలని, 5సంవత్సరాలకు పైబడి ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అంగన్‌వాడీ టీచర్లు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన హసన్‌పర్తి మండల జడ్పీటిసి రేణికుంట్ల సునీత, జయగిరి సర్పంచ్‌ రాణి, ఆశవర్కర్లు శారద, టీచర్లు సింగయ్య, ఇంద్ర, రేణిగుంట్ల ఆమని పాల్గొన్నారు.

 

పోతరాజు విగ్రహం ధ్వంసం

పోతరాజు విగ్రహం ధ్వంసం

మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘము నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారినుండి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్‌ సెంటర్‌లోని శ్రీరామ సంతోష్‌లాడ్జ్‌లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్‌ సెంటర్‌లోని టీ స్టాల్‌ యజమాని నాగరబోయిన కనకరాజు(50)ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో గురువారం నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని న్యూవిజన్‌ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రావడంతో ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామసర్పంచ్‌, పంచాయతీ వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో హంగులు, ఆర్భాటాలు మాత్రమే ఉంటాయని, ఇక నుండి మా ఊరిలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకూడదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, నాణ్యమైన బోధన అందించి విద్యార్థులను ఉన్నతస్థాయి స్థితిలో చేర్చే బాధ్యత తమదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…,

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐనవోలు మండలం ఏర్పాటైన నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు కాలేదంటూ ఒకరి తరువాత ఒకరుగా బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్డీవోకి మొరపెట్టుకున్న పనులు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు కాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు.

తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్‌ 3750 నంబర్‌ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను ఒకవైపునకు మళ్లించారు. కారు రాంగ్‌ రూట్లో వేగంగా రావడంతో బస్సును పక్కన ఉన్న కంకర కుప్పలోకి డ్రైవర్‌ మళ్లించాడు. దీంతో బస్సును కంకర కుప్ప ఆపింది. డ్రైవర్‌ చాకచక్యంగా బస్సు నడపడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసి అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులను మరో బస్సులో తరలించారు. కంకర కుప్ప లేకపోతే బస్సు బోల్తా పడేదని ప్రయాణీకులు తెలిపారు.

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్‌.జగన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్‌.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు పదవీ బాధ్యతలు స్వీకరించి జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తానని తెలిపారు.

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

వరంగల్‌ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్‌ స్టాల్‌ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల నగరంలోని దేశాయిపేట రోడ్‌లో నిర్వహిస్తున్న ఉమా బుక్‌స్టాల్‌పై సొమవారం తూనికలు, కొలతల అధికారలు దాడులు నిర్వహించి బుక్‌స్టాల్‌ నిర్వాహకులు అమ్ముతున్న నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వాటిపై ఉన్న రేట్లను క్షణ్ణంగా పరిశీలించారు. ఎమార్పి రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల అధికారలు హెచ్చరించారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలు కొన్ని బుక్‌స్టాల్‌ వారితో కుమ్మక్కయి అక్రమ దందా నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారని అధిక ధరలకు పుస్లకాలను అమ్ముతున్నారని, కొన్నింటిపైనా ఎమ్మార్పి రేటు లేకుండానే నిర్వాహకులు ఎంత చెబితే అంత ఇచ్చి కొనాల్సిందేనని, పుస్తకాల భారం మోయలేకుండా ఉన్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు సొమవారం చేపట్టిన తనిఖీల్లో ఎమ్మార్పి లేకుండా విక్రయిస్తున్న పుస్తకాలు, నోట్‌బుక్‌లు కొన్ని లభ్యమయినట్లు తెలుస్తున్నది. ఈ దాడులు నగరమంతా నిర్వహించి ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మినా, ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కై వ్యాపారం నిర్వహించినా కఠిచర్యలు తీసుకుంటామని, మరో రెండురోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తామని అధికారలు తెలిపారు.

యదార్థవాది లోక విరోధి…!

యదార్థవాది లోక విరోధి…!

నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు

రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్‌ లు

వసూళ్ల కోసం ప్రోత్సహిస్తున్న పెద్ద పత్రికల్లోని స్వయం ప్రకటిత మేధావులు

పొట్టచీరితే అక్షరం ముక్కరాదు జర్నలిజాన్ని మొత్తంగా వారే మోస్తున్నట్లు బిల్డప్‌

నిజాలు రాస్తున్న నేటిధాత్రిపై నోరు పారేసుకుంటున్న ఎర్నలిస్టులు

సంపాదనే ద్యేయంగా తెలివిమీరిపోతున్న కొందరు జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్ట్‌లపై సంచలన కథనం త్వరలో….

తక్షణం పరిష్కరించండి

తక్షణం పరిష్కరించండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై శాఖలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కారమార్గం చూపెట్టాలని, అపరిష్కతంగా ఉంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి బాధ్యలవుతారని స్పష్టం చేశారు. పెండింగ్‌ ఫిర్యాదులపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ వస్తున్నందున రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయాశాఖల అధికారులకు పంపించినప్పుడు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారు, మిగిలినవి ఎందుకు పరిష్కరించలేకపోయారో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, సంబంధిత నివేదికలను అందజేయాలని సంయుక్త కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసినందున ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దష్టిపెట్టాలని సంయుక్త కలెక్టర్‌ జిల్లా అధికారులకు తెలిపారు. పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజావాణికి వచ్చిన వారి నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, డీఆర్వో ఎన్‌. ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రవీందర్‌, డిడేంలంమ సరస్వతి , డిసిఓ మహమ్మద్‌ అలీ, ఈఈలు విగ్నేశ్వర్‌రెడ్డి, కనకరత్నం, డిటిఓ కొండల్‌ రావు , సిపిఓ రాజారామ్‌, డిఎస్‌సిడిఓ రాజేశ్వరి, బిసిడిఓ సువర్ణ కిరీటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి జన తాకిడి…కిక్కిరిసిన కలెక్టరేట్‌

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ప్రజవాణిని తిరిగి ప్రారంభించడంతో పెద్దఎత్తున ప్రజలు కల్లెక్టరేట్‌కు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు తెలిపారు. మొత్తం 163 దరఖాస్తులు రాగా వాటిలో పెన్షన్‌ సంబంధిత దరఖాస్తులు 82 కాగా, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు కోరుతూ 31, రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ 50 దరఖాస్తులు అందాయి.

14 nunchi badibaata, 14 నుంచి బడిబాట

14 నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామస్థులు, పజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రోజువారీగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ నిర్వహించనుంది.

డిజిటల్‌ తరగతుల బోధన…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం బడిబాట పేరిట ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో వేసవి సెలవుల్లోనూ నిర్వహించినా, ఆ దిశగా కొంత మేర సఫలీకతం అయ్యింది..దీంతో ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటూ అయిదేళ్లు నిండిన విద్యార్థులతోపాటు గ్రామాల్లో బడిఈడు పిల్లలను చేర్పించాలని భావిస్తోంది. గతేడాది చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆంగ్ల మాధ్యమాలను ప్రవేశపెట్టింది. దీంతో కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో విద్యార్థుల నమోదు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూలత కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పక తప్పదు. మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ తరగతులు, ఆంగ్ల మాధ్యమం ఉచితం, సమరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వివిధ రకాల ఉపకార వేతనాలు అందుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఐదురోజుల పాటు..

జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఐదురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు ఒక్కోరోజు ఒక్కో విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. బడిబాట మొదటిరోజున ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11గంటల వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ….

సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా

ఐదు సంవత్సరాలు నిండిన బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట అవగాహన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేటు పాటశాలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో వసతులు, నాణ్యమైన విద్య విషయం తదితర అన్ని విషయాలలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖలు పర్యటించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. టార్గెట్‌ బేస్డ్‌ అప్రోచ్‌ తో అధికారులు ముందుకు సాగలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. మధ్యలో బడి మానివేసిన విద్యార్థులను కూడా గుర్తించి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు ర్యాలీలు నిర్వహించి నమోదును పెంచేందుకు కషి చేయాలన్నారు. విద్యార్థుల నమోదు వివరాలను విధిగా ప్రతీరోజు ఎంఈవో కార్యాలయానికి పంపాలన్నారు. బడి మానివేసిన విద్యార్థుల వివరాలను సేకరించి..అందరూ బడిలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలన్నారు. బడిబాట నిర్వహించే సమయంలో ప్రతిరోజు ఎంతమంది విద్యార్ధులను పాఠశాలల్లో చేర్పించారో పారదర్శకంగా తెలిపేలా పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో బడిబాట డెస్క్‌ను తప్పక ఏర్పాటుచేసి ఒక బాధ్యున్ని నియమించాలని ఆదేశాలు అందాయన్నారు. బడిబాట విజయవంతానికి అధికారులు పాటుపడాలన్నారు.

బడిఈడు పిల్లలను గుర్తిస్తాం…

– ధనాలకోట రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల

బడిఈడు, బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా అధికారులకు సూచించాం. ఉపాధ్యాయులతో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నాం. అంగన్‌వాడీలో ఐదేళ్లు నిండిన పిల్లలను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేలా కషి చేస్తాం. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సైతం పాల్గొనేలా ఉద్యోగులకు వివరించాం.

14 nunchi certificatela parishilana, 14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన 1,02,048మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 12వ తేదీ ఉదయం 8గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మండలి తెలిపింది.

anganvadi kendralathone chinnarula abhivruddi, అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్‌వాడీ కార్యకర్త నల్ల భారతి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో ఏఎల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వాసం కవిత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లా భారతి మాట్లాడుతూ 3 నుండి 5సంవత్సరాల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్‌వాడి కేంద్రాలలో పోషకాలతో కూడిన భోజన వసతులు పాలు, కోడిగుడ్డు అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఎదగడం కోసం ఆటలు, పాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి.గౌసియాబేగం, సునీత, కమిటీ సభ్యులు రవళి, కవిత, సనాతోపాటు చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

majjiga packetla papini, మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్‌ మర్రిచెట్టు సర్కిల్‌ వద్ద విఆర్‌4యు సంస్థ సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్త ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌, పర్యావరణ పరిరక్షణ, అనాథ పిల్లలకు చేయూత వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు మజ్జిగ పంపిణీని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దిలీప్‌ థక్కడ్‌, సభ్యులు డాక్టర్‌ ప్రభావతి, సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

harithaharaniki siddamina nursary, హరితహారానికి సిద్దమైన నర్సరీ

హరితహారానికి సిద్దమైన నర్సరీ

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో నర్సరీలోని మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి రెండుమొక్కలు నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు. టేకు, దానిమ్మ, సీతాఫలల చెట్లు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు రాబోయే తరం వారికి కూడా ఉపయోగపడేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు-ప్రగతికి మొట్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొండ రాజ్‌కుమార్‌, టిఎ సృజన సుదర్శన్‌, అశోక్‌, గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version