majjiga packetla papini, మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్‌ మర్రిచెట్టు సర్కిల్‌ వద్ద విఆర్‌4యు సంస్థ సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్త ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌, పర్యావరణ పరిరక్షణ, అనాథ పిల్లలకు చేయూత వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు మజ్జిగ పంపిణీని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దిలీప్‌ థక్కడ్‌, సభ్యులు డాక్టర్‌ ప్రభావతి, సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

harithaharaniki siddamina nursary, హరితహారానికి సిద్దమైన నర్సరీ

హరితహారానికి సిద్దమైన నర్సరీ

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో నర్సరీలోని మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి రెండుమొక్కలు నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు. టేకు, దానిమ్మ, సీతాఫలల చెట్లు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు రాబోయే తరం వారికి కూడా ఉపయోగపడేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు-ప్రగతికి మొట్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొండ రాజ్‌కుమార్‌, టిఎ సృజన సుదర్శన్‌, అశోక్‌, గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

anganvadi teacherla badibata, అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలబాలికలు ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీకి పంపాలని, ఐదేళ్లు దాటిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గ్రామగ్రామాన ర్యాలీలు చేపడుతున్నారు. 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ ఎ.రాధిక, సర్పంచ్‌ జెన్నయ్య, ఉపసర్పంచ్‌ గట్టు శివకుమార్‌, తరగం సునీత, ఆయా రజియా, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌కె.లాల్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

kakisthara…thappisthara…?, కక్కిస్తారా…తప్పిస్తారా…?

కక్కిస్తారా…తప్పిస్తారా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో క్యాంపు పేరిట లక్షల రూపాయలను అక్రమంగా మెక్కేశారని, దొంగల పేర్లతో దొంగ అకౌంట్లు సేకరించి క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టు దొంగతనంగా పేర్లను రాసి లక్షల రూపాయలల్లో అవినీతికి పాల్పడినారని, అవినీతి జరిగిన తీరుపై వెంటనే విచారణ కమిటిని వేసి బాధ్యులను గుర్తించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘంలు డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటి వరకు కమిటినీ వేయకుండా కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

క్యాంపు పేరుతో లక్షల రూపాయలు మాయం

ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపు కార్యాలయంలో దొంగబిల్లులు పెట్టి, భాయ్స్‌గా పనిచేయకున్నా పనిచేసినట్టుగా దొంగపేర్లను రాసి డబ్బులు నొక్కేశారని తెలుస్తోంది. డిఐఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అకౌంట్లలో, అందులోనే పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలో, పింగిళి మహిళ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సంబందించిన వారి అకౌంట్లలో దొంగదారిన డబ్బులు జమచేశారని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వొడపెల్లి మురళి ఆరోపించారు. అక్రమంగా సుమారుగా 90 మంది అకౌంట్లలో వేశారని ఒక్కో అకౌంట్లో రూ.8.540 నుండి రూ.16.653 వరకు వేశారని, వీటిని తిరిగి సూపరింటెండెంట్‌ సాయబాబా కలెక్ట్‌ చేసుకొని ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేశారని, నొక్కేసిన డబ్బులను కలిసి పంచుకున్నారని ఆరోపించారు.కేవలం సుతిల్‌ దారాలకు 50వేల రూపాయలు అయినట్లు బిల్లులు పెట్టారంటే ఇంకా స్టేషనరీ పేరుతో ఎంతెంత నొక్కేసి వుంటారో అర్ధం చేసుకోవచ్చని సంఘాల నాయకులు అంటున్నారు.

కార్యాలయ సిబ్బంది ఆఫీస్‌ భాయ్స్‌ ఎలా అవుతారు?

డిఐఈవో కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలలో కూడా క్యాంపు ఆఫీసులో మూటలు మోశారని, పేపర్‌ బండిల్స్‌లు అందించారని ఆఫీస్‌ భాయ్స్‌గా పనిచేశారని వారి అకౌంట్లలలో డబ్బులు వేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజువారి కూలీలు ఎలా అవుతారో? డిఐఈవో లింగయ్య, సూపరింటెండెంట్‌ సాయిబాబాలే ప్రజలకు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్యాలయంలో అటెండర్‌ నుండి ప్రభుత్వ ఉద్యోగి వరకు ఎవరిని వదలకుండా అందరి అకౌంట్లలో రోజువారి కూలీల మాదిరిగా, క్యాంపుభాయ్స్‌ పేరిట అకౌంట్లలో డబ్బులు చెక్కుల ద్వారా వివిద బ్యాంక్‌లల్లో జమ చేశారు. అవకతవకలపై, అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటిని వేసి ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

hanthakulanu katinaga shikshinchali, హంతకులను కఠినంగా శిక్షించాలి

హంతకులను కఠినంగా శిక్షించాలి

బక్కి శ్రీను హంతకులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌వర్గం రాష్ట్ర నాయకుడు గడ్డం సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్కి శ్రీను హంతకులను కూడా శ్రీనును చంపిన విధంగానే ఉరితాడుకు వేలాడేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని జెఎసికి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బక్కి శ్రీను హంతకులను శిక్షించాలని ఆందోళన చేస్తూ పోరాటం చేస్తున్న జెఎసికి సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా బక్కి శ్రీను సంస్మరణ సభ సందర్భంగా శ్రీను కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.

16na sanmana karyakramam, 16న సన్మాన కార్యక్రమం

16న సన్మాన కార్యక్రమం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మేదరి ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో మేదర విద్యార్థులు, ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి ప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ దండుగుడుము ఉపేందర్‌ తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లలో అధికమార్కులు సాధించిన మేదరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ పొందిన వారికి ఈనెల 16వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమం వరంగల్‌ జెమిని టాకీస్‌ సమీపంలోని పోతన విజ్ఞాన పీఠంలో జరుగుతుందని, అర్హత కలిగిన విద్యార్థులు తమ మార్కుల జాబితాలను అందజేయాలని తెలిపారు. ప్రోత్సాహాక కమిటీ ద్వారా వారి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా ఆహ్వానం తెలుపుతామని అన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కూచనపల్లి శ్యామ్‌సుందర్‌, ఉపాధ్యక్షులు ప్రతాపగిరి సత్యదేవ్‌, దీకొండ సరిత, లీగల్‌ అడ్వైజర్‌ కూచనపల్లి వెంకటేశ్వర్లు, చీఫ్‌ అడ్వైజర్‌ సిలువేరు మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

upadihami panula zoru, ఉపాధిహామీ పనుల జోరు

ఉపాధిహామీ పనుల జోరు

హసన్‌పర్తి మండలంలోని సీతానాగారం గ్రామంలో వర్షాకాలం రావడంతో కూలీలు భారీసంఖ్యలో ఉపాధిహామీ పనులకు వస్తున్నారని ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. కాలం రావడంతో ఎవరి పొలంలో వారు మట్టి కొట్టుకపోకుండా కూలీలు అధికసంఖ్యలో పాల్గొన్నారన్నారు. మబ్బులు చల్లపడటంతో కూలీలు సంతోషంగా పనులు చేస్తున్నారన్నారు. రైతులు వారివారి పొలాల్లో మట్టిని పోసుకుంటున్నారని, ఉపాదిహామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటంతోపాటు వారి అవసరాలను తెలుసుకున్నానని చెప్పారు. ఇంతమంది కూలీలు వందరోజుల పనిని వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అయిలయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రవీందర్‌, టిఎ సృజన తదితరులు పాల్గొన్నారు.

avirbava dinostavanni jayapradam cheyali, ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు పుట్ట రవి అన్నారు. శుక్రవారం హసన్‌పర్తి మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుట్ట రవి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంద కృష్ణమాదిగ పర్యటన సందర్భంగా ఉదయం 7గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలకేంద్రంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉదయం 11గంటలకు, ములుగు జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2గంటలకు, జనగామ జిల్లాలో 5గంటలకు మంద కృష్ణమాదిగ పర్యటన అన్ని జిల్లాలలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఈమామూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 25లక్షల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 25సంవత్సరాల ఉద్యమస్ఫూర్తి అట్టడుగు పేదల స్ఫూర్తిదాయంగా ఎమ్మార్పీఎస్‌ నిలిచిందని అన్నారు. ఇంటికి ఇద్దరు, పల్లెకు 2వాహనాల చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారపు బిక్షపతి, మండల అధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్‌, నాయకులు రామంచ సంపత్‌, కేతపాక సదానందం, పలనాటి రవీందర్‌, రాజు, జనార్థన్‌, ప్రసాద్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

vyardalatho niduthunna peddacheruvu, వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పాడవేసిన చెత్తతో దుగ్గొండి పెద్దచెరువు వ్యర్థాలతో నిండిపోతున్నదని బహుజన సమాజ్‌వాది పార్టీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జి దయాకర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్ర పెద్దచెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోయి చెత్త, జంతు కళేభరాలు, వివిధ రకాల వ్యర్థలతో నిండి వున్నాయని, రాబోయే వర్షాకాలంలో చెరువు నిండి ఆ వ్యర్ధాలతో తాగునీటి బావిలో కలిసి తాగునీరు కూడా కలుషితం అయ్యి ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే గ్రామంలోని జంతువులు చెరువులో నీటిని ఎల్లప్పుడు తాగుతూ ఉంటాయని, అవి కూడా రోగాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యల పట్ల సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వాతావరణ కాలుష్య నివారణను అరికట్టాలని దయాకర్‌ కోరారు.

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆటోడ్రైవర్‌ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్‌ వరకు..

ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్‌ నేడు జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఆనాటి నుండి టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో జడ్పిటిసిగా ఎన్నికైనారు.

ఉద్యమరాలుగా మొదలై జడ్పి ఫ్లోర్‌లీడర్‌గా….

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విభాగంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ది స్వప్న అనేక పోరాటాలలో పాల్గొన్నది. అనేకమార్లు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలో లాఠీదెబ్బలకు బలై, జైలు జీవితం అనుభవించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు రాజకీయంలో క్రియాశీలకంగా మారాలని పిలుపుతో నేడు నల్లబెల్లి మండలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొంది వరంగల్‌ రూరల్‌ జిల్లా జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికైనారు.

ఆనాడు భర్త…ఈనాడు భార్య….

తెలంగాణ ఉద్యమ పోరాటం గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరే విధంగా ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ గళాన్ని వినిపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు జరిగిన జడ్పీటిసి ఎన్నికల్లో నల్లబెల్లి మండలం నుండి జెడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికైనా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికై తన సత్తాను చాటారు. నేడు అదేబాటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పెద్ది స్వప్న నేడు నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికై వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దుగ్గొండి, నల్లబెల్లి మండల ప్రజల హర్షం వ్యక్తం

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల దుగ్గొండి, నల్లబెల్లి మండలాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

bandedu baram…private chaduvu, బండెడు భారం…ప్రైవేటు చదువు

బండెడు భారం…ప్రైవేటు చదువు

వరంగల్‌ నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పాఠశాలలో, పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విక్రయించాలి లేదంటే అంతే సంగతులు. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పత్తాలేకుండా పోతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా కొన్ని వందలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నా, నాణ్యమైన విద్యను అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పత్తా లేని విద్యాశాఖ అధికారులు

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు గుంజుతున్న కానీ విద్యాశాఖ అధికారులకు పట్టింపే లేకుండా పోతుంది. జిల్లావ్యాప్తంగా వందల ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్న నాణ్యమైన విద్యను అందించడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలని పడుతున్న ఆరాటాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడడమే దీనంతటికీ కారణమని తెలుస్తుంది. కాని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుల ధరలను చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

పాఠశాలల్లోనే విక్రయాలు

దాదాపు నగరంలో పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థికి అవసరమైన సామాగ్రి విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విద్యార్థికి కావాల్సిన సామాగ్రి, పుస్తకాలు కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. విద్యాశాఖ అధికారుల నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి పాఠశాలలో నోటీసు బోర్టుపై తరగతుల వారిగా ఫీజుల వివరాలను నమోదు చేయాల్సి ఉన్నా అది ఎక్కడ కూడా నమోదు చేయడం లేదు. జీవో నం1 ప్రకారం తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. కానీ ఆ పరిస్ధితులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం అధికారుల కొరతతో ప్రైవేట్‌ యాజమాన్యం ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండానే పోతుంది. ప్రైవేట్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన కమిటీల సిఫార్సు ప్రకారమే ఫీజుల ధరలను నిర్ణయించాలి. దీనికోసం 2010లో ప్రభుత్వం జీవో నెం42ను తీసుకొచ్చింది. జీవో నెం42ను వ్యతిరేకిస్తూ 2014లో పాఠశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. జీవో నెం42 రద్దు చేయాలని ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. అప్పటినుంచి యాజమాన్యాలు అడ్డుఅదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాల యాజమన్యాలు యూనియన్లుగా ఏర్పడి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో అధికారులు అమలుచేయడం లేదు. చట్టప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25శాతం సీట్లను దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు అందించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాల ఉచితంగా సీటును వదులుకోవడం లేదు. అలాగే చట్టప్రకారం అవసరం మేరకు పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందించాలి. ప్రజలకు పాలన సమీపంలో ఉన్న నేపథ్యంలోనైనా కలెక్టర్‌ దష్టి సారిస్తే కొంతమేరకైనా ఫీజుల భారం తగ్గుతుందని పలువురు అంటున్నారు.

కనీస వసతులు ప్రమాణాలు లేక పాఠశాల నిర్మాణాలు

పాఠ్యపుస్తకాల విక్రయదారులతో పాఠశాల యాజమాన్యాలు అనుసంధానంగా పుస్తకాల వ్యాపారం నడుస్తుంది. వరంగల్‌ నగరంలో ప్రధానంగా కొన్ని పుస్తక ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని పాఠశాలలను ఎంచుకొని వారికి కొంత నగదు ముందే సమర్పించుకుంటారు. పాఠశాల విద్యార్ధులని బట్టి ముందే డబ్బులు అందచేస్తారు. అక్కడ నుండి మొదలవుతుంది వ్యాపారం. వ్యాపారంలో 40శాతం వరకు పాఠశాల యాజమాన్యాలకు అందచేస్తున్నట్టు సమాచారం. వీరి స్వలాభం కొరకు విద్యార్థుల తల్లితండ్రులపై విపరీతమైన భారం పడుతుందని చెప్పొచ్చు. ఇలా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా కానీ నాణ్యమైన విద్యని అందిస్తారని నమ్మకం కూడా తల్లితండ్రులు కోల్పోతున్నారు అని చెప్పొచ్చు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు ఆటస్థలాలు లేకుండా బహుళ అంతస్తులో తరగతులు నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటంలో మతలబు ఏంటని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఏదైనా అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే బహుళ అంతస్తులో ఉన్న విద్యార్థులు ఏదైనా ప్రమాదానికి గురైతే భాద్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం అగ్నిమాపక వాహనం పాఠశాల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో పాఠశాల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తున్నారు అని విద్యాశాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలు దోపిడీ….!

ఒకటవ తరగతి పుస్తకాల ఖరీదు 4,800రూపాయలు

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఫీజుల భారంతోపాటు పాఠ్యపుస్తకాల కొనుగోలు భారాన్ని మోపుతున్నారు. దీంతో తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు. వరంగల్‌ నగరంలోని ఓయాస్సిస్‌ అనే పాఠశాల ఉమ బుక్‌స్టాల్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కమిషన్‌లు దండుకుంటూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ధరను చూస్తే గుండెలు గుభేలుమంటాయి. ఒకటవ తరగతికి వీరు అక్షరాల నాలుగువేల ఎనిమిదివందల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇదేంటని తల్లితండ్రులు నిలదీస్తే ఇది ఇంతే. మా దగ్గర తప్ప ఈ పుస్తకాలు ఎక్కడ దొరకవు అంటూ నిర్లక్షపు సమాధానం ఇస్తున్నారట. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.

vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో వితంతువు మహిళలకు సమానస్థానం కల్పించాలని, వితంతువులపై వివక్షత విడనాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రంజిత్‌కుమార్‌గౌడ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గ సబ్యులు కాందారి రమేష్‌, బాలరాజు, చీర రాజమణి రమేష్‌, సంధ్య శ్రీధర్‌, బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌, కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

gananga hazrath hazi baba utsavalu, ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు

ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు

ఉర్సు బొడ్రాయిలో గల హజ్రత్‌ హాజి కలందర్‌ బాబా ఉత్సవాలు ఘనంగా జరిగాయని దర్గా అధ్యక్షుడు మహ్మద్‌ మషూక్‌ తెలిపారు. శుక్రవారం అల్లాకు సందల్‌ను ఆయన నెత్తిన పెట్టుకుని విన్యాసాలతో అల్లాకు చాదర్‌ను సమర్పించానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజీ కలందర్‌ బాబా ఉత్సవాలలో ముస్లీంలతోపాటు హిందువులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారన్నారు. అనేకమంది భక్తులు తమ కోరికలను బాబా నెరవేరుస్తాడనే నమ్మకంతోనే చాలామంది బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాలను ముస్లీం మతగురువు ఉబేర్‌బాబా ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేడల పద్మ, 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మరుపల్ల రవి, ముస్లీం నాయకులు యాకుబ్‌పాషా, అక్బర్‌, తాజ్‌బాబా, రఫీక్‌, ఫకీర్‌, హైమద్‌ఖాజీ, మరుపల్ల గౌతమ్‌, బైరి వినయ్‌ పాల్గొన్నారు.

private degree collegelapia cheryalu thisukovali, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

పట్టణంలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇంచార్జ్‌ మంద శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్‌ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్‌కు 6నుండి 7వేల రూపాయలు ఇస్తూ అక్రమంగా అడ్మిషన్లు కొంటూ విద్యవ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతుంటే వారికి డబ్బుల ఆశ చూపి కాలేజీలకు లాక్కుంటున్నారన్నారు. దీని వలన పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఈ కాలేజీలపై వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, ఎగ్జిమినేషన్‌ కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్‌, గణేష్‌స్వామి, బరత్‌, ప్రభాస్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

cheruvu matti mayamavuthondi, చెరువు మట్టి మాయమవుతోంది…!

చెరువు మట్టి మాయమవుతోంది…!

వరంగల్‌ నగర శివారులో చెరువు మట్టి మాయమైపోతుంది. మట్టి మాఫియాలు రెచ్చిపోతుండడంతో లక్షల్లో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరశివార్లలోని చెరువుల్లో మట్టిని అడ్డగోలుగా, ఇష్టారీతిన తవ్వుతున్నారు. చెరువు మధ్యలో జెసిబిలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ టిప్పర్ల కొద్ది మట్టిని దొంగచాటున తరలించుకుపోతున్నారు. మిషన్‌ కాకతీయ పేరుతో ఈ మట్టి దొంగరవాణకు కాంట్రాక్టర్లు తెగబడుతున్నారు.

దొంగచాటు రవాణా…

ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారులో దాదాపు 15మందికిపైగా కాంట్రాక్టర్లు చెరువుల్లో మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు. రాత్రివేళల్లో ఈ మట్టి తవ్వకాన్ని కొనసాగిస్తున్న వీరు చెరువులకు సమీప ప్రాంతంలోనే డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఇటుక బట్టీలకు మట్టిని రవాణా చేస్తున్నారు. ఒక టిప్పర్‌ లోడ్‌కు వేల రూపాయల్లో వసూలు చేస్తున్న మట్టి కాంట్రాక్టర్లు లక్షల్లో దండుకుంటున్నారు.

కళ్లు మూసుకున్న రెవెన్యూశాఖ

వరంగల్‌ అర్బన్‌ శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలను కొనసాగిస్తూ దొంగచాటుగా రవాణా చేస్తున్న అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు, పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మట్టి అక్రమరవాణా గూర్చి ప్రశ్నిస్తే మట్టి తవ్వెటప్పుడు తమకు సమాచారం అందించండని గ్రామస్తులకు ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలిసింది. రాత్రివేళల్లో తవ్వి డంప్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తవ్వే సమయంలో తప్ప, డంప్‌ చేసేటప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదని స్థానిక విఆర్వోలు రూల్స్‌ వల్లె వేస్తున్నారట. రెవెన్యూ అధికారుల తతంగం అంతా చూస్తుంటే కాంట్రాక్టర్లు వీరిని ఎప్పుడో ప్రసన్నం చేసుకుని ఉంటారని నగరశివారు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

బాసే తన భర్తంటున్న భామ

బాసే తన భర్తంటున్న భామ

అవును…మీరు రాసిన ‘భామ’తో..బాస్‌…అనే శీర్షికలో ఆ బాస్‌ నా భర్తే…ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆఫీసులో కూడా అందరికి తెలుసు..బాస్‌ వాళ్ల భార్యకు, పిల్లలకు కూడా తెలుసు…మీరు ఎలా రాస్తారు..మా అన్న ఓ మంత్రి దగ్గర ఉంటాడు…అంటూ పరోక్షంగా హెచ్చరించిన భామ…

(ఎవరా…బాస్‌..ఎక్కడా ఆ ఆఫీస్‌) త్వరలో…

badi baata, బడిబాట

బడిబాట

మండలంలోని పాత్రపురం గ్రామంలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రపురం గ్రామ పంచాయితీలో శుక్రవారం అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ‘ప్రైవేటు బడి వద్దు…అంగన్‌వాడీ ముద్దు’, ఇంటింటికి అంగన్‌వాడీ అనే నినాదంతో పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని, ఉచితవిద్య, పోషకాహారంతోపాటు ఆరోగ్యంగా పిల్లల ఎదుగుదల ఉంటుందని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తులలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కష్ణార్జున్‌రావు, వార్డుమెంబరు కారం వెంకటలక్షి, సూపర్‌వైజర్‌ రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు విజయ శుషంతల, చుక్కమ రామకష్ణ, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

hotel sharanyalo agnipramadam, హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించవచ్చునని పలువురు భావిస్తున్నారు. హూటల్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా చూశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో భారీ ఆస్తినష్టం సంభవించే అవకాశాలు ఉండేవని హూటల్‌ సిబ్బందితోపాటు పలువురు భావిస్తున్నారు.

antharjathiya sadasuku doctor rajkumar, అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

దుగ్గొండి మండల ప్రశాంతి మహిళా సమాఖ్య ఏపీఎం డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌ అంతర్జాతీయ యువత సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుండి వచ్చే నెల 1తేదీ వరకు బ్యాంకాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో జరిగే అంతర్జాతీయ యువత సదస్సుకు భారతదేశ ప్రతినిధిగా హాజరవుతున్నట్లు తెలిపారు. యువత నిర్మాణ పాత్ర, యువత రాజకీయం, యువత నాయకత్వ లక్షణాలు, రాబోయే తరాలకు యువత ఇచ్చే సందేశాలు, సామాజిక బాధ్యతలు తదితర అంశాలపై ఈ సదస్సులలో మాట్లాడనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 12దేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఘనత తనకే దక్కిందని గుర్తుచేశారు. బ్యాంకాక్‌ దేశం నుండి 2వ సారి ఆహ్వానం అందిందని, గత 25సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. భారతదేశ ప్రభుత్వం నుండి 4 జాతీయస్థాయి పురస్కారాలు, అలాగే ప్రపంచ దేశాలల్లో 5సార్లు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నట్లు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. బాలవికాస గత 25సంవత్సరాల నుండి సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తూ అవగాహన కల్పిస్తూ సామజిక ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అతి చిన్నవయసులో ఉన్న వితంతు మహిళలు అవగాహన లేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లు మూఢ ఆచారాలను అరికట్టి ఆదర్శంగా నిలవాలని కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనకల్‌ సర్పంచ్‌ బొమ్మగాని ఊర్మిళ, రేబల్లె సర్పంచ్‌ గటికే మమత, భాగ్యలక్ష్మి, సుజాత, భాగ్య, సమత, కవిత, సరస్వతి, లలిత, రాజమణి, సంధ్య, కోమల, రాజక్క, అరుణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version