hospital eduta darna, హాస్పిటల్‌ ఎదుట ధర్నా

హాస్పిటల్‌ ఎదుట ధర్నా

పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద శ్రీకాంత్‌, మడికొండ ప్రశాంత్‌ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.

vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్‌ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్‌ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ramjan shubakankshalu telipina cp, రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్‌ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ప్రార్థనల్లో ముస్లిం పెద్దలు, చిన్నారులను అలింగనం చేసుకోని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం చిన్నారులకు పోలీస్‌ కమిషనర్‌ చాక్లెట్లు పంపిణీ చేశారు.

gananga ramjan vedukalu, ఘనంగా రంజాన్‌ వేడుకలు

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలకేంద్రంలో రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మండలకేంద్రంలోని స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ముస్లీంలు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో అధికసంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు అలాయ్‌బలాయ్‌ చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

kalushya nivaranaku krushi cheyali, కాలుష్య నివారణకు కృషి చేయాలి

కాలుష్య నివారణకు కృషి చేయాలి

ప్రజలందరూ కాలుష్య నివారణకు కృషి చేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్‌ విభాగం ఆటవీశాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ జెండా ఊపి ప్రారంభించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ పీల్చే గాలి కాలుష్యం కావడంతో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఇతర అరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ లాంటి ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని ప్రజారవాణా వ్యవస్థకు వినియోగించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం, కాల్చడాన్ని తగ్గించాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించేందుకు తన వంతు భాధ్యతగా కాలుష్య నివారణకు కషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ముమ్మరంగా మొక్కలను నాటేందుకు సిద్దపడాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

carlu dee, కార్లు ఢీ

కార్లు ఢీ

– ఒకరు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ బైపాస్‌ రోడ్డుపై (ఇందిరమ్మ కాలనీ వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మతిచెందారు. జనగామ సీఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్దీకరిస్తూ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, తద్వారా సంబంధిత రైల్వేశాఖ మంత్రి దష్టికి తీసుకొనివెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్మల, చాంద్‌పాషా, భగవాన్‌, గడప శివ, జీవన్‌, జాఫర్‌, అలీం, రైల్వే నాయకులు మోతిలాల్‌, బిఎంఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

lekinpu kendralanu parishilinchina collector, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత పరిశీలించారు. లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తొలుతగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

జనరల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన ….

జనరల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ బి.శ్రీనివాస్‌ జడ్పీటిసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. లెక్కింపు జరిగే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే దొంగల గ్యాంగ్‌ పారిపోయింది. అయితే చైతన్యపురి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పుటేజీ సంపాదించారు. ఈ పుటేజీ ఆధారంగా దొంగల వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ టివి పుటేజి ఆధారంగా కూపి లాగుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

కాజీపేట పట్టణంలో దొంగల ముఠా తిరుగుతున్నట్లు ప్రజలు కాలనీలల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలల్లో దొంగల ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ప్రజలు బయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కాజీపేట చైతన్యపురి కాలనీలో ఈ దొంగల ముఠా ఓ ఇంటలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తమై వారిని ఎవరు అని ప్రశ్నించేలోపే వారు అక్కడి నుండి పరారయినట్లు పోలీసులు తెలిపారు. 100 డయల్‌ చేయడంతో కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తన సిబ్బందితో వెళ్లి గాలించగా అప్పటికే దొంగలు పరారు అయ్చారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’ ప్రతినిధితో సీఐ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాజీపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100 డయల్‌ చేసి సమాచారమివ్వాలని అన్నారు. చైతన్యపురిలో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలముఠా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

dieo officelo padakagada…siggu…siggu, డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే సిగ్గుగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికి కార్యాలయంలో ఉంటున్నది ఎవరనేది అంతుచిక్కడంలేదని ఇంతలా దిగజారి కార్యాలయానికి తలవంపు తెస్తారని అనుకోలేదని ఉద్యోగులు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.

తలవంపులు తెస్తున్నా డిఐఈవోపై చర్యలు శూన్యం

విలువలను, హూందాతనాన్ని, ఉద్యోగుల నైతికతను, బాధ్యతను, గౌరవాన్ని, వృత్తిధర్మాన్ని మంటగలుపుతూ డిఐఈవో కార్యాలయ పరువును బజారుకీడుస్తున్న డిఐఈవో ఒంటెద్దుపోకడతో ఉగ్యోగలమంతా తలదించుకున్నంత పని అయిందని, కార్యాలయానికి వెళ్లాలంటేనే చాలా సిగ్గుగా ఉందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఓ వైపు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ, మరో వైపు నీతిమాలిన పనులు ఏకంగా కార్యాలయాన్నే అడ్డగా మార్చుకొని వ్యవహరిస్తున్నారా..? అనే కోణంలో ‘నేటిధాత్రి’లో కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిఐఈవోకు ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే ఆయన వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మండిపడుతున్న విద్యార్థి, ఉపాద్యాయ సంఘాలు

ప్రభుత్వ కార్యాలయమా…? పడక గదా..? అనే కథనం బయటికి రావడంతో జిల్లా వ్యాప్తంగా డిఐఈవో కార్యాలయం గురించి, లీలలపై, అవినీతి, అక్రమాలపై ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగ, ఉపాద్యాయ, లెక్చరర్ల సంఘాల నేతలు డిఐఈవోపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొన్ని ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయంపై కలెక్టర్‌కు, ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌కు కలిసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య పరిష్కారం కోసం పోయి ఉన్న ఆస్తిని పొగుట్టుకున్న ఉదందాలు సైతం ఉన్నాయని తెలిసింది.

గొడవ ఏదైనా సరే

గొడవ ఏదైనా సరే అందులో కలగజేసుకోవడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అలవాటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌ సమస్యలు, భూవివాదాలు, కుటుంబ గొడవలు తదితర విషయాల్లో ఈ సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు. కలగజేసుకుని పరిష్కారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని బాదితులను ఇబ్బందులకు గురిచేస్తుంటారట. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ప్రధానంగా భూవివాదాల్లో కలగజేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాయట. భూమిలో సగం తమకు అప్పగిస్తే లేదంటే మార్కెట్‌ రేటు ప్రకారం తమకు కమీషన్‌ చెల్లిస్తే సమస్య పరిష్కారం చేస్తామని నమ్మబలికి అందినకాడికి అందుకుపోవడం ఈ గ్యాంగ్‌లు చేస్తుంటాయట. కొన్ని సందర్భాల్లో భూవివాదాల్లో ఇరువర్గాలు వీక్‌ అని తెలిస్తే భూమిని తమ పేర చేసుకుని సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తారట.

పరిచయాల పేరుతో బురిడీ

సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే పరిచయాలతో బురిడీ కొట్టించడం తమకు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర గ్యాంగ్‌లు చాలా దగ్గర అని చెపుతూ సమస్యను తామే పరిష్కరిస్తామని చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్యేనట. నిజానికి ఇలాంటి గ్యాంగ్‌లకు కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరైన సమస్యలతో వీరి వద్దకు వస్తే ఫలానా గ్యాంగ్‌ దీన్ని సెటిల్‌ చేస్తుందని అక్కడకు వెళ్లండని సూచిస్తున్నట్లు తెలిసింది. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ఏది సెటిల్‌ చేసిన అది నిజమేనని కొంతమంది పోలీస్‌ అధికారులు నిర్థారిస్తూ ఆ సెటిల్‌మెంట్‌కు అదికార ముద్ర వేస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారిందంటే చాలు సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనే తచ్చాడుతూ ఉంటారట.

సంవత్సరాలపాటు సాగదీత

ఇరువర్గాలను తమ చేతిలో ఉంచుకుని సమస్యను పరిష్కారం ఏయకుండా సంవత్సరాలపాటు సాగదీయడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు బాగా అలవర్చుకున్నాయట. గ్యాంగ్‌ల సాగదీతకు జడుసుకున్న కొంతమంది ఇరువర్గాలు ఏకమై తమ సమస్యను తామే పరిష్కారం చేసుకున్న సందర్బాలు ఉన్నాయట. గ్యాంగ్‌ల సాగదీత పరిష్కారాల మూలంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయట. సమస్యను పరిష్కారం చేయాలంటే ఉదయం అల్పాహారంతో మొదలుకుని మందు, విందు వరకు అన్ని బాధితులే చూసుకోవాలట. ఈ ఖర్చు పెట్టలేక కొంతమంది బాదితులు అప్పులపాలైన సందర్బాలు ఉన్నాయి.

సెటిల్‌మెంట్లే ఉపాధి

ఇస్త్రీ పోల్డ్‌ నలగని చొక్క, చుట్టు మంది మార్బలం ఏర్పాటు చేసుకుని కాసింత బిల్డప్‌ కలగలుపుకుని సెటిల్‌మెంట్‌ గాండ్లు దర్శనమిస్తారట. సెటిల్‌మెంట్లనే ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వీరు కేవలం వీటిపైన ఆధారపడి బాధితులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు వెనకేసిన వారు ఉన్నారట. భూసమస్యల్లో తలదూర్చిన సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లైతే సమస్యను పరిష్కారం చేయకుండా ఎంతో కొంత నగదు ముట్టజెప్పి బాధితుల వద్ద నుంచి కారుచౌకగా భూములు దండుకున్నవారు ఉన్నారట. మొత్తానికి సెటిల్‌మెంట్‌ ఉపాధి చేసుకుని బాధితుల బలహీనతలు ఆసరా చేసుకుని జీవితాలను ఆగం చేసిన వారు ఉన్నారట.

jailashaka incharge igga b.saidaiah, జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ మే 30న పదవి విరమణ పొందడంతో ఇంచార్జి ఐజీగా బి.సైదయ్యను నియమిస్తూ జైళ్లశాఖ డీజీ ఎం.వినయ్‌కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సైదయ్య ప్రస్తుతం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి అవార్డు ఎంపిక అయిన ఇతనికి జైళ్ల శాఖలో మంచి గుర్తింపు ఉంది.

raitheraju ninadanne nijam chestunna modi, రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు నరేంద్ర మోడీ 5సంవత్సరాల స్వచ్చమైన పాలన అందించి మరోమారు ప్రజలమోదం పొంది భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి నిర్ణయంగా రైతులకు భరోసా కల్పిస్తూ గతంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంలోని 5ఎకరాల స్లాబును తీసివేసి ప్రతి ఒక్క రైతుకు కుడా ఈ పథకం వర్తించేలా చేస్తూ రైతులకు బరోసా కల్పించారన్నారు. అదేవిధంగా 60సంవత్సరాలు నిండిన ప్రతి రైతు నెలకు 3వేల రూపాయిల పెన్షన్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం కేవలం నరేంద్ర మోడీకే సాధ్యమైయిందని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతుల సంక్షేమం ఈ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో 60శాతం ఉన్న రైతులకు భరోసా కల్పిస్తూ నరేంద్ర మోడీ ఇలాంటి పధకం ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గండ్రతి యాదగిరి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారేపల్లి రామచంద్రరెడ్డి, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధానకార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్‌, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు మండల సురేష్‌, పాశికంటి రాజేంద్రప్రసాద్‌, గంకిది శ్రీనివాస్‌రెడ్డి, గురజాల వీరన్న, కందగట్ల సత్యనారాయణ, సారంగపాణి, జన్ను ఆరోగ్యం, నానునాయక్‌, దామెర సదానందం, కేసోజు వెంకట్‌, కల్లూరి పవన్‌, గూడెం రవితేజ, రాజేష్‌ఖన్నా, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్‌ రోవర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో 20సార్లు రక్తదానం చేసినట్లు పెద్దల స్ఫూర్తితో, ప్రజాసేవే ధ్యేయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విదేశాల్లో, దేశవ్యాప్తంగా పలు అభివద్ధి, యువజన కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా ప్రభుత్వం డాక్టరేట్‌ అందించిందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు డీఆర్డీఏ పిడి సంపత్‌రావు, ఏపిడి పరమేష్‌, డ్వామా ఏపిడి పారిజాతంలు అభినందించి సంబంధిత ధవీకరణ పత్రాన్ని అందించాలని, మరిన్ని రక్తదాన శిబిరాల్లో పాల్గొననున్నట్లు ఏపీఎం రాజ్‌కుమార్‌ తెలిపారు.

telangana rashtra avatharana dinostava vedukalu, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుసభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారుతెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

vithanthuvula manobavalanu gouravinchali, వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించాలని జయగిరి గ్రామ సర్పంచ్‌ బొల్లవేణి రాణి అన్నారు. ఆదివారం మండలంలోని జయగిరి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాణి హాజరై మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య నేడు అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈనెల 23వ తేదీన వితంతువుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఏలీమి రమేష్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వార్డుసభ్యులు వెంకటేష్‌, రాజు, బాలవికాస ప్రతినిధులు బాబూరావు, రాజ్‌కుమార్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు పిట్టల రాజు, కుమారస్వామి, కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.

vronu nirbandinchina gramastulu, విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామస్తులు విఆర్వోను నిర్భంధించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరసిస్తూ గ్రామ విఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ గ్రామస్తులతో మాట్లాడి అందరికీ పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి విఆర్వోను వదిలిపెట్టారు.

rajastanlo policelapia dadi avastavam, రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : వరంగల్‌ జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు వరంగల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లడం జరిగిందని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం గాలిస్తుండగా దొంగల ఆచూకి రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లా హెర్నియా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, అయినా పట్టువదలకుండా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ధైర్యసాహసాలతో ఎదురించి దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులను తీవ్రంగా గాయపరిచినట్లు, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

mla gari muddula alludu, ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

– వరంగల్‌ పశ్చిమలో ఆడింది ఆట…పాడింది పాట

– మామ కంటే ఎక్కువ అధికారాన్ని ఉపయోగించేది అల్లుడే

– ఒక్కసారి సర్పంచ్‌గా గెలిచి జనానికి చుక్కలు చూపించాడట…

– భూకబ్జాలు,పైసల వసూళ్ళలో ఇతగాడిదే ప్రధాన పాత్ర..?

– ఇద్దరు రియల్టర్ల మధ్య దూరి పంచాయితీ పరిష్కారం చేసే ప్రయత్నం

– అరవైలక్షలకు ఐదు ఇస్తాడని భాదితుడికి బెదిరింపులు

– పోలీసులు తాను చెప్పిందే వినాలని హుకుం, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన

(సోమవారం సంచికలో…)

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version