జేబులో కేయు అధికారులు…! 

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ జేబులో కేయు అధికారులు…!
”ఏమో సమ్మగా, సరీ సప్పుడు కాకుండా నంజుకుతిన్నారేమో…రహస్యంగా ముడుపులెన్ని తీసుకున్నారో… పర్మిషన్లు కాగితాల్లో చూపి సౌకర్యాలు లేకుండా కాలేజీ నిర్వహించుకోవటానికి హక్కులు ఇచ్చారేమో… కాసులకు కక్కుర్తిపడి సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం జేబులో నక్కినక్కి  ఉంటున్నారేమో…ఇది చలనం లేకుండా నిద్ర మత్తులో ఉంటూ చర్యలు చేపట్టటానికి వెనుకాడుతున్న కేయు అధికారుల వైఖరి పట్ల కలుగుతలున్న అనుమానాలు..”
 హన్మకొండ పొద్దుటూరు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అసౌకర్యాలతో, నిబంధనలకు విరుద్దంగా నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ పట్ల కేయు సిడిసి డైరెక్టర్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కమర్షిల్‌ కాంప్లెక్స్‌లో మహిళా కాలేజీని నిర్వహించుకోవటానికి కేయు అధికారులు పర్మిషన్‌ ఇవ్వటానికి కారణాలేంటనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దర్జాగా నిబంధనలను బేకాతర్‌ చేస్తూ కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్య వైఖరి సైతం కేయు అధికారుల అసమర్థతను తెలుపుతుందని పలువురు వాఖ్యానిస్తున్నారు.
విర్రవీగుతున్న కాలేజీ యాజమాన్యం…చోద్యం చూస్తున్న కేయు అధికారులు…
‘పార్కింగ్‌ స్థలం లేకున్న…కనీసం మంచినీటి సౌకర్యం లేకున్న…గ్రౌండ్‌ లేకున్న…ట్రాపిక్‌ నిబంధనల పర్మిషన్‌ లేకున్న, వీటితో పాటు విద్యాబోధనకు అనువైన పరిసరాలు లేకున్న యధేచ్ఛగా కాలేజీని మేం నిర్వహిస్తాం… మమ్మల్ని అడిగే వారే లేరు…పత్రికల్లో కథనాలు రాస్తే మాత్రం ఏం ఒరుగుతుంది…పర్మిషన్లు ఇచ్చే అధికారులే మా జేబుల్లోనే ఉన్నారనే విధంగా సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం విర్రవీగుతున్నట్లు  ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కాలేజీ యాజమాన్యం బేజులో కేయు అధికారులు బంధీగా ఉండటం మూలంగానే ఆడిందే ఆటగా పాడిందే పాటగా తమను ఎవరూ కదిలంచలేరనే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందనేది గమనార్హం.
అధికారుల నిర్లక్ష్యానికి ముడుపులే కారణమా…!..?
సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల పర్యవేక్షణ లేకపోవటానికి….కనీస మౌళిక సదుపాయాలు లేకున్న పట్టించుకోకపోవటానికి కారణం ముడుపులు ముట్టడమే కారణమా…అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేయు అధికారులు నిద్రమత్తులో ఉన్నారా…కాసులకు కక్కుర్తిపడి కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారా…అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా కేయు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి ఉంది.
                                                                            ( అనుమతులకు అధికారుల…వాటా…?
                                                                                                త్వరలో… )

ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఉద్యోగుల ఇష్టారాజ్యం

‘వైద్యారోగ్యశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, అధికారులు రింగన పురుగుల్లా వ్యవహరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారలు విధులకు డుమ్మాకొడుతూ పట్టణంలో తిష్టవేయటం పరిపాటిగా మారింది. శాఖ పరమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ సొంత పనుల్లో బిజిబిజి అవటం అధికారులకు, ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనేది గమనార్హం. అడిగే నాధుడు లేడనే రితిలో వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు కొరవడటంతో ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలకు కేంద్రంగా ఉన్న వెద్యారోగ్యశాఖలోని తంతు’.

జిల్లాల విభజనతో వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలకు సంబంధిచిన వైద్యారోగ్యశాఖ (డిఎంఅండ్‌హెచ్‌ఓ) ఒకే కార్యాలయంలో కొనసాగుతున్న విషయం విధితమే. అర్బన్‌ జిల్లాతో పాటు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 16 మండలాల్లో పిహెచ్‌సీలు, నర్సంపేట, పరకాల ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులు హన్మకొండ, వరంగల్‌ నగరాల నుంచే ఎక్కువగా అప్‌అండ్‌డౌన్‌ చేయటం బహిరంగరహస్యమే. అయితే డిఎం అండ్‌ హెచ్‌ఓ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అప్‌ అండ్‌ డౌన్‌ చేసే అధికారులు, ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టడం, సొంత పనుల పట్ల ఎక్కువగా దృస్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సరి చేయాల్సి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. డిఎం అండ్‌ హెచ్‌ఓ కార్యాలయానికి వెళ్లిన ఎవరికైనా అధికారులు, ఉద్యోగలు నిర్లక్ష్య వైఖరి, కార్యాలయ తీరు ఇటే తెలిసిపోతుందని పలువురు వాఖ్యానిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారలు సరిగా దృష్టి సారించకపోవటం, పర్యవేక్షణలు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతంలో అందాల్సిన వైద్య సేవలు కుంటుపడుతున్నాయనేది గమనార్హం. ఇప్పటికైనా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారుల విధులు నిర్వహించే అంశంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని మున్సిపల్‌ అధికారులు తేల్చి చెప్పారు. కానీ వెంచర్లలో కేటాయించిన గ్రీన్‌ల్యాండ్స్‌ మాత్రం మాయమైనట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ కోసం కేటాయించిన స్థలానికి హద్దులు వేస్తూ ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డులను ప్రదర్శిస్తూ ఉంటారని, అసలు ఆ బోర్డులను, హద్దులను అధికారులే ప్రదర్శించలేదా..? రియల్‌ వ్యాపారులే తొలగించారా..? అని పలువురు చర్చించుకుంటున్నారు. వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం కావడానికి అధికారుల నిర్లక్ష్యమా..?, మామూళ్ల మత్తులో అధికారులే వదిలేశారా..? అన్న ప్రశ్నలు పట్టణంలో వినిపిస్తున్నాయి. వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్‌ కోసం కేటాయించిన భూమికి చుట్టూ హద్దులు వేసి బోర్డులను ప్రదర్శించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రీన్‌ల్యాండ్‌లను కూడా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులే అమ్ముకున్నారని అనుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి గ్రీన్‌ల్యాండ్‌లను గుర్తించి ఆ భూముల్లో బోర్డులు ప్రదర్శన చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సునీల్‌ను వివరణ కోరగా వెంచర్లలో గ్రీన్‌లాండ్‌ల సమాచారం నాకు తెలియదని సమాధానం చెప్పారు.

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో సీట్లు కావాలని, ప్రైవేట్‌ పాఠశాలల్లో సీట్లు కావాలని, వైద్యం చేయించాలని, సింగరేణిలో క్వార్టర్‌ కేటాయించాలని ఇలా ఒకటి కాదు, రెండు కాదు వందలాది ఉత్తరాలు ఓఎస్డీనంటూ సంతకం చేస్తూ మరి పంపాడు. అంతేకాదు అనధికార, నకిలీ ఓఎస్డీనని ఏ మాత్రం సోయి లేకుండా సాధారణ పరిపాలన శాఖ (ఓఎస్డీ)కి సైతం లెటర్‌లు పంపడం కావల్సిన ప్రపోజల్స్‌, అలవెన్సులు, వేతనం తదితర అంశాలన్నింటిని తెలుపుతూ ఓఎస్డీ హోదాలో లెటర్లు పంపాడంటే ఇతగాడి ధైర్యాన్ని, ఆరోగ్య మంత్రి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతగాడు ఎవరో కాదు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో సరసాదేవి కుంభకోణంలో ఎ2గా ఉన్న జక్కని ప్రసాద్‌. సమైక్య రాష్ట్రంలో కోట్ల కుంభకోణానికి కారకుడైన ప్రసాద్‌ను ఆహ్వానించి, ఆదరించి అనధికార ఓఎస్డీగా ఈటెల పేషిలో కొనసాగిస్తున్నారంటే దీనివెనకాల ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పటికీ బేతాళ ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. ఈటెల రాజేందర్‌ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేషిలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఈ నకిలీ ఓఎస్డీ ప్రసాద్‌ చేతివాటం చూపడంలో సిద్ధహస్తుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈటెల పేషిలో సైతం ఇదే చేతివాటాన్ని చూపుతూ కన్సల్టెంట్‌గా చేరి ఓఎస్డీగా చెలామణి విడ్డూరంగా కనపడుతోంది.

ఆర్టీసీని తప్పుదారి పట్టించాడు..

టిఎస్‌ ఆర్టీసిలో ఉచితంగా ప్రయాణం చేయడానికి నకిలీ ఓఎస్డీ జక్కన ప్రసాద్‌ ఏకంగా బస్‌భవన్‌కు ఓ లేఖ పంపాడు. లేఖ పంపడం బాగానే ఉన్న తాను ఓఎస్డీనని ఆర్థికశాఖ మంత్రి ఈటెల వద్ద పనిచేస్తున్నానని కాంప్లీమెంటరీ పాస్‌ సంపాదించాడు. నిజానికి ఇతను ఓఎస్డీ కాదు ఈటెల ఆర్థిక మంత్రి కాదు. కానీ ఆర్టీసి అధికారులు సైతం చూసిచూడనట్లే చూసి ఓఎస్డీ ఆర్థికశాఖ అంటూ కాంప్లీమెంటరీ పాస్‌ జారీ చేశారు. అంతేకాదు ఈ నకిలీ ఓఎస్డీ పిఎలు కానివారికి సైతం ఈటెల వద్ద పనిచేసే డ్రైవర్లకు, ఇతరులకు అసెంబ్లీ పాస్‌లు ఇతర రాయితీలను ఓఎస్డీనంటూ లెటర్‌లు పంపి సాధించిపెడతాడు. ఇవన్నీ చూస్తుంటే ఇతగాడు ఎంతటి అసాద్యుడో ఈటెల పేషిలో ఏ మేరకు తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడో అర్థమైపోతుంది.

మంత్రి ఈటెలకు తెలిసే జరుగుతుందా…?

రోజు వందలకొద్ది లెటర్లు, వివిధ శాఖలకు రిఫరెన్స్‌లు పెడుతూ జక్కని ప్రసాద్‌ అనధికార ఓఎస్డీగా ఎలా కొనసాగుతున్నాడు. మధ్యాహ్నం 12గంటలకు పేషిలోకి వచ్చి 4గంటలకు వెళ్లిపోయే నకిలీ ఓఎస్డీ లక్షల్లో వేతనం దండుకుంటుండడం సాధారణ పరిపాలన శాఖనే తప్పుదారి పట్టిస్తూ తాను ఓఎస్డీనంటూ ఫోజులు కొడుతుండటం తెలంగాణ సచివాలయంలో చర్చకు దారితీస్తోంది. అయితే ఇదంతా మంత్రి ఈటెల రాజేందర్‌కు తెలియకుండానే జరుగుతుందా…? అనుకుంటే అలా కానే కాదు…తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, ప్రసాద్‌ జీతభత్యాల విషయంలో ఇతరత్రా సమస్యలపరంగా ఓఎస్డీనంటూ ఇప్పటివరకు వందలకొద్ది లేఖలు పంపాడు. ఈ నకిలీ ఓఎస్డీ ఇంత జరుగుతున్న ఈటెలకు తెలియకుండా ఎలా ఉంటుంది. ఏకంగా మంత్రి పేషిలోనే కన్సల్టెంట్‌గా చేరి ఓ వ్యక్తి ఓఎస్డీనంటూ అనుమతి లేకుండా ఎలా విధులు నిర్వహిస్తాడు అలా సాధ్యం కానే కాదు. అయితే ప్రభుత్వం నియమించకుండా, ఎలాంటి ఉత్తర్వులు లేకుండా జక్కన ప్రసాద్‌ అనధికార ఓఎస్డీగా కొనసాగుతున్నడంటే మంత్రి చొరవతోనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీఎం ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు ఓఎస్డీలు ఉండగా జక్కని ప్రసాద్‌ను ఈటెల అనధికార ఓఎస్డీగా ఎందుకు కొనసాగిస్తున్నాడనేదే ప్రశ్న. కొద్ది నెలలుగా ఈ ప్రశ్న మంత్రి పేషిలోని ఉద్యోగులందరినీ వేదిస్తున్నా సమాధానం మాత్రం దొరకడం లేదు. ఓఎస్డీ కాకున్న ఓఎస్డీనంటూ విధులు నిర్వహిస్తున్న జక్కని ప్రసాద్‌ను ఇదేంటని సాధారణ పరిపాలన శాఖ (జిఎడి), అధికారులు సైతం ప్రశ్నించలేదంటే ప్రసాద్‌ మహత్యం అలాంటిదన్న మాట.

కథనాలు నన్నేం చేస్తాయి…?

నకిలీ ఓఎస్డీగా చెలామణి అవుతూ మంత్రి ఈటెల పేషిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జక్కని ప్రసాద్‌ ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఓఎస్డీ బండారం బయటపడబోతుందని తెలియగానే ‘నేటిధాత్రి’ కథనం తననేం చేయదని కోట్ల కుంభకోణంలోనే తనను ఏం చేయలేకపోయారని…ఇదేంత…? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడట. తన అనుభవంలో ఎన్నో చేశానని ఈ కథనాలు తనకో లెక్క కాదని అంటున్నాడట.

ప్రసాదాన్ని కాపాడుతున్నదెవరూ…?

ఈటెల పేషిలో ఎలా పాతుకుపోయాడు…?

సీఎం ఆదేశాలు ఎందుకు బేఖాతరు అవుతున్నాయి…?

(రేపటి సంచికలో…)

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో జరిగింది. కార్యాలయ అధికారి తమ ఇద్దరు కూతుళ్లు కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేసినట్టుగా పేర్లు అదనంగా చేర్చి అక్రమంగా బిల్లులను తయారుచేసి క్యాంపు డబ్బులను తమ వ్యక్తిగత ఖాతాలోకి జమచేసుకున్నారు.

‘ఛీ’కొడుతున్న స్థానిక నిరుద్యోగులు

ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో దినసరి కూళీలుగా భాయ్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకొని వారితో పనిచేయించి పనికి గుర్తింపుగా రోజువారి వేతనంగా ఎన్నిరోజులు పనిచేస్తే అన్నిరోజులకు డబ్బులు కట్టించి చెలించారు. ఇందులో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేయకున్నా పనిచేసినట్టు ఓ అధికారి తమ ఇద్దరు కూతుళ్ల పేర్లను పెట్టి రూ.30వేల రూపాయాలను నొక్కేశాడని పలువురు విమర్శిస్తున్నారు. పైగా ఆ ఇద్దరు అమ్మాయిలు కరీంనగర్‌కు చెందినవారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్థానిక నిరుద్యోగులు హన్మకొండలో కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలిసినవారే లేరన్నట్టు అక్కడి నుండి వచ్చారా? ఎందుకు లేనివి ఉన్నట్టు రాసి ప్రభుత్వ సొమ్మును నొక్కేయడం అని కొందరంటుండగా, మరికొందరు క్యాంపుకే పెద్ద అదికారి అయిన ఆయన తమ కూతుళ్ల పేర్లను పెట్టుకోవడిన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

 

నిబంధనలు బేఖాతర్‌ 

నిబంధనలు బేఖాతర్‌
‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం
హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం ఫలితంగానే చర్యలు చేపట్టకుండా గుమ్మున ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఫైర్‌సేప్టీ, లైబ్రరీ, ల్యాబ్‌, తదితర సౌకర్యాల గురించి చెప్పనక్కరే లేదు. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహణకు ఎలా పర్మిషన్‌ ఇచ్చారో అధికారలకే తెలియాల్సి ఉంది. సిటీ మహిళా డిగ్రీ కళాశాల అసౌకర్యాలతో నిర్వహించబడుతుందని అధికారులకు తెలిసినా నిద్ర మత్తులో ఉండటం వీరి మధ్య రహస్యపు ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలను బలపరుస్తున్నాయనేది గమనార్హం. పిచ్చిగడ్డితో చదును లేనటుంటి అరకొర స్థలాన్ని గ్రౌండ్‌గా చూపిస్తే అధికారులు పర్మిషన్‌ ఇవ్వటం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పర్మిషన్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ అయినటువంటి ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లోనే ఉందా…? అధికారులకు మరో చోట సౌకర్యాలు చూపి కాగితాల్లో పర్మిషన్‌ తీసుకొని కాలేజీని కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారా అనే సందేహాలకు కలుగుతున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కాలేజీ నిర్వాహణ నిగ్గు తేల్చాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిద్రమత్తులో ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ యదేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్యం తీరు పట్ల సమగ్ర విచారణ జరిపి అధికారులు చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి ఉంది.
కదిలించే వారే లేరనే రితీలో కాలేజీ యాజమాన్యం….
”మాకు అందరూ తెలుసు…మమ్మల్ని ఎవరూ కదిలించ లేరు.. అధికారులు మా పక్షమే…అధికారుల ఆశీస్సులు మాకు ఉన్నాయి”. అనే  రితిలో సిటీ మహిళా డిగ్రీ కలేజీ నిర్వహకులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు చర్యలు చేపట్టకపోవటం ఇందుకు బలాన్ని చేకూర్చుతుంది. కాలేజీ అసౌకర్యాలకు నిలయంగా ఉందని, మహిళా కాలేజీ నిర్వహణకు సరిపడే విధంగా పరిసరాలు, సౌకర్యాలు లేవని అధికారులకు తెలియదా..? ఒకవేళ తెలిసినా యాజమాన్యంతో రహస్యపు ఒప్పందాల్లో భాగంగానే అధికాలు గుమ్మనకుండా ఉంటున్నారా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వండని ఓఎస్డీనంటూ లెటర్‌ పంపే వరకు వెళ్లింది. తన పేషిలో ఇంత జరుగుతున్న అసలు ఓఎస్డీ కానీ వ్యక్తి పదవివిరమణ పొందిన ఉద్యోగి ఇంత పెత్తనం కొనసాగిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్‌ దృష్టికి రాకపోవడం విడ్డూరంగా ఉంది. తవ్వుతున్న కొద్ది ఈ అవినీతి ప్రసాదం వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

ఎవరీ అవినీతి ‘ప్రసాద’ం

ఓఎస్డీ కాకున్న ఈయనగారికి ఎందుకీ అధికారం

(వివరాలు రేపటి సంచికలో…)

అధికారుల అండ…?

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…?

హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్‌ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్‌ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఉంటాలనే నిబంధనల ఉన్నప్పటికీ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న కాలేజీకి ఎకరం గ్రౌండ్‌ ఎక్కడుందో పర్మిషన్‌ ఇచ్చిన అధికారులకు, కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్యానికే తెలియాలని పలువురు వాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీసం 45 ఫీట్ల ఎత్తు కలిగిన భవనానికి ఖచ్చితంగా ఫైర్‌ సేప్టీ అవసరమని అధికారులు చెప్పుతున్నప్పటికీ అసలు ప్రొద్దులూరి కాంప్లెెక్స్‌ ఎత్తు ఎంత ఉందో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించే పర్మిషన్‌ ఇచ్చారా…? లేక గుడ్డిగా ఇచ్చారా..? అనేది మరో సారి పరిశీలించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహించుకునే విధంగా గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, నీటి వసతి ఎక్కడా కానరాకపోవటం గమనార్హం. మహిళా కాలేజీ నిర్వహణకు ఏ మాత్రం అనువుగా లేనటువంటి కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహించటానికి అధికారులు పర్మిషన్‌ ఇవ్వటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసౌకర్యాలతో యదేచ్ఛగా యాజమాన్యం కాలేజీని నిర్వహిస్తుంటే చర్యలు చేపట్టకపోవటంతో అధికారుల తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పంధించి, నిబంధనలకు విరుద్దంగా నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ నిర్వహణ తీరు పట్ల సమగ్ర విచారణ జరుపటంతో పాటు, తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

(రేపటి సంచికలో)

‘కూతురు’కు…ప్రేమతో….!

‘కూతురు’కు…ప్రేమతో….!

కూతురంటే ఏ తండ్రికి ప్రేమ ఉండదు..కూతుంటేనే ఇంటికి మహాలక్ష్మి..ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మికి కొదవుండదు..కూతురున్న ఇంట్లోకి లక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది..అంటు పెద్దలు చెప్పే మాటలు అనేకం విన్నాం. కూతురుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి నిజంగా నడిసొస్తుందా..! అనే అనుమామనం కల్గిన వాళ్లు కూడా లేకపోలేదు. అవును అక్షరాల పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని ఇంటర్మీడియట్‌ డిఐఈవోలో ఓ అధికారి నిరూపించాడు. వివరాల్లోకి వెళితే వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఓ అధికారి తమ కూతుళ్లకు పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేసినట్టు ఇద్దరి పేర్లతో బిలులు పెట్టేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని కార్యాలయంలో గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తున్నది.

నాన్నతో ఆఫీస్‌కు వస్తే చాలు పైసలు నొక్కేయచ్చు

నాన్న టీచర్‌ అయితే నాన్నతో బడికి వెళితే చదువుకోవచ్చు, స్నేహితులతో బయటకు వెళితే ఆడుకోవచ్చు. కాని ఇంటర్మీడియట్‌ డిఐఈవోలో మాత్రం మీ నాన్న అధికారి అయితే చాలు డబ్బులు దండిగా దండుకోవచ్చు. అవును ఇప్పుడు డిఐఈవోలోనే కాదు వరంగల్‌ ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇదే చర్చ. అధికారికి ఎలా సాధ్యమయ్యింది? అయినా సొంత కూతుళ్లను క్యాంపులో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పెట్టుకోవడమేంటి? అవినీతికి పాల్పడి ఆయన ఏది చెబితే అది నమ్మడానికి పై అధికారులు చెవిలో పూలు పెట్టుకున్నారా? ఆశకు హద్దు ఉండాలి..ఆత్యాశకు పోతే నవ్వులపాలు కాకతప్పదని తోటి ఉద్యోగులు అంటున్నారు.

0000000628 వారి లక్కీ నెంబర్‌…?

క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా అధికారి యొక్క ఇద్దరు కూతుర్లు పనిచేసినట్టు ఒక్కొక్కరి పేరు మీద రూ.15వేలు అనగా ఇద్దరికి కలిపి రూ.30వేలు డ్రా చేసుకున్నారని కార్యాలయంలో, క్యాంపు ఆపీస్‌లో చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే..! పేర్లు రెండు అకౌంట్‌ మాత్రం ఒకటే…(ఉదాహరణకు : 1. ఎంఎస్‌ రోహిణి, అకౌంట్‌ నెంబర్‌-0000000628, 2.ఎం. అనూష, అకౌంట్‌ నెంబర్‌-0000000628).

భూదందా @297 ఎకరాలు

భూదందా @297 ఎకరాలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ హావేలి జక్కలొద్ది గ్రామంలో కంటికి కనపడకుండా, అధికారులెవరు వెళ్లకుండా, ఏం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అసలు దృష్టే సారించకుండా అక్షరాల 297ఎకరాల 38గుంటల భూమి కబ్జా రాబంధుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం నడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మొదలుకుని అన్ని శాఖలకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరు కిమ్మనకుండా ఎవరి శాయశక్తులా వారు కబ్జారాయుళ్లకు సహకరిస్తుపోతున్నారు. నిఘా పెడుతున్నాం భూముల విషయంలో సర్కార్‌కు అన్ని నివేదికలు సమర్పిస్తున్నాం మేం అంతా పారదర్శకం అని చెప్పుకునే రెవెన్యూ ఇతర నిఘా సంస్థలు ఇప్పటి వరకు ఈ భూముల వ్యవహారంలో కాసింతైన శ్రద్ధ పెట్టలేదు. ఎకరాకు 50నుంచి 70లక్షల వరకు ధర పలుకుతున్న ఈ భూములు కబ్జాకోరులకు బంగారుబాతులా దొరికాయి. ఈ భూముల్లో కార్పొరేటర్‌ భర్త, ఖిలా వరంగల్‌ పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ కేడల జనార్థన్‌ అన్యాయంగా పాగా వేసి ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి భూములను ఏదో రకంగా లాక్కుని తన వశపరుచుకునేందుకే కేడల రెవెన్యూ అధికారుల సహయంతో తతంగాన్ని మొత్తం నడిపిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జక్కలొద్ది గ్రామంలోని 102 నుంచి 109, 120 నుండి 123, 126 నుండి 142, 143 నుండి 154 సర్వే నెంబర్లు గల భూములు మొత్తం 297 ఎకరాల 38గుంటల భూమికి అసలు పట్టాదారు మెహినోద్దీన్‌ ఖాద్రీ. ఆయనకు సంబంధించిన దాదాపు అన్ని భూములలో కేడల జనార్థన్‌ పాగా వేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని భూములలో ఇప్పటికే కబ్జాలో ఉన్న వారిని, టెనెంట్‌దారులను డిక్లరెంట్‌లను నయానో…భయానో లొంగదీసుకుని తనకున్న కబ్జా తెలివితేటలతో అప్పనంగా భూములను కొల్లగొడుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కుతూ అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ 297ఎకరాల 38గుంటల భూములకు సంబంధించి 15మంది టెనెన్సి అండ్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ యాక్ట్‌ 1950 (ఫైల్‌ నెంబర్‌ ఎఫ్‌ 4/20139/74 25-9-1975) ప్రకారం టెనెన్సి పట్టాలు పొంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్డీఓ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టెనెన్సిని రద్దు చేయాలంటూ తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కొంతమంది ల్యాండ్‌ ఆఫ్‌ రిఫామ్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన కేడల 9వ అప్పిలెంట్‌ అయిన బండి అయిలయ్యకు ఏవో మాటలు చెప్పి అతని కబ్జాలో ఉన్న భూమిని అప్పనంగా కొనుగోలు చేసి కేసులో ఇంప్లీడ్‌ అయ్యాడు. కేసును సాకుగా చూపి పట్టా సంపాదించి అక్రమంగా భూమిని అమ్మేసి రంగశాయిపేటకు చెందిన ఓ మహిళకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించాడు. భూములు టెనెంట్స్‌లకు చెందినవి అని తెలిసి కూడా భూములను అమ్మి కేడల సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంలో కేడల భారీగానే సొమ్ము వెనకాల వేస్తే భూమిని సాగు చేస్తూ కబ్జాలో ఉన్న వారు మాత్రం మోసపోయినట్లు సమాచారం. ఇక్కడ విచిత్రం ఏంటంటే భూమిపై హక్కు ఉన్న టెనెంట్స్‌ 2008 సంవత్సరంలో శ్రీవెంకటేశ్వరా డెవలపర్స్‌కు భూమిని రిజిస్టర్‌ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కేడల జనార్థన్‌ మూడవ సాక్షిగా సంతకం చేస్తాడు. ఈ భూమి చట్టపరంగా వారిదే అని తెలిసిన కేడల దొంగచాటున భూమిని వెరొకరికి విక్రయించాడన్న మాట. అంతే కాదు జక్కలొద్ది ప్రాంతంలో వెతకుతున్నా కొద్ది కేడల చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయి. ఇక్కడి 133, 136, 145, 152 సర్వే నెంబర్లలో టెనెంట్స్‌ పట్టా పొందిన కాయిరున్నీసా బేగం, మరో ఇద్దరితో 2008 సంవత్సరంలో సేల్‌ కం జిపిఎ చేయించుకున్న కేడల నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను పొందాడు (డాక్యుమెంట్‌ నెంబర్‌ 5/72/08) పైగా ఈ భూమి తనదేనంటూ కబ్జాలో ఉన్న అమాయకులపై కేసులు (ఓఎస్‌నెం.1141 ఆఫ్‌ 2012) వేసి ముప్పుతిప్పలు పెడుతున్నాడట. ఇలా కబ్జాలో ఉన్న వారిపై టెనెంట్స్‌పై తనకున్న రాజకీయ పలుకుబడితో కేసులు బనాయిస్తూ జక్కలొద్దిలో కేడల తన హవాను కొనసాగిస్తున్నాడు. ఎవరు ప్రశ్నించిన తనను ఎవరు ఏం చేయలేరనే కేడల తన పార్టీ అధిష్టానాన్ని సైతం దిక్కరిస్తూ అధినాయకత్వంపై తోచిన కామెంట్లు చేస్తుంటాడు. ఎవరు తననేం చేయలేరని ‘పిల్లి కల్లు మూసుకుని పాలు తాగినట్లు’ ప్రవర్తిస్తాడు. ఇంత జరుగుతున్న పార్టీ ఇతనిపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం తన శక్తి మేర సహకారం అందిస్తుండటంతో కేడల రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి.

రెవెన్యూ అధికారులను కలవనున్న కేడల బాధితులు

జక్కలొద్ది ప్రాంతంలో భూమి అసలు హక్కుదారులను, నిరుపేద రైతులను తన కబ్జా తెలివితో ముప్పుతిప్పలు పెడుతున్న కేడల భూకబ్జాలపై బాధితులు రెవెన్యూ అధికారులను కలవనున్నట్లు తెలిసింది. జిల్లా రెవెన్యూ అధికారుల ముందు తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకోనున్నట్లు బాధితులు తెలిపారు. అవసరమైతే తమ భూముల విషయంలో న్యాయం జరగడానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకుంటామని బాధితులు అంటున్నారు.

సంగతి చెప్తం

చూస్తానం…చూస్తానం

సంగతి చెప్తం

నిజాలు రాయడం తప్పేనట ఏం చేసిన మంత్రికి సహకరించాలట

తాన తందాన భజన గ్యాంగ్‌లో చేరిపోవాలట

మంత్రి ఎర్రబెల్లి ప్రైవేట్‌ పిఎల బరి తెగింపు

స్థాయి మరిచి ‘నేటిధాత్రి’పై వ్యాఖ్యలు

మంత్రి ఆదేశాలు ఉన్నాయి. త్వరలో వారి సంగతి చెప్తాం అంటూ చిల్లరమాటలు

కూటమి కట్టిన చదువుకున్న, చదువురాని ప్రైవేట్‌ పిఎలు

‘నేటిధాత్రి’ని తెలియకుండా దెబ్బకొడతామని ఫోజులు

పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఎర్రబెల్లి…?

రేపటి సంచికలో…

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు 

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు
హనుమకొండ పొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ యాజమాన్యం తీరే సపరేటుగా ఉంది. ఇరుకైన ప్రదేశంలో కాలేజీ నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ యాజమాన్యం విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తుంది. అన్ని రకాల వసతులున్నాయంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మబలికి అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తుంది. సౌకర్యాల గురించి ఎవరైనా మాట్లాడితే  మాకు అందరూ తెలుసు, ప్రజాప్రతినిధులు, అధికారులు మా పక్షమే ఉన్నారు అంటూ యాజమాన్యం దబాయిస్తుంది. పత్రిక కథనాలు రాస్తే వారి పై స్థాయి వారికి ఫిర్యాదు చేసి మేనేజ్‌ చేసుకొని అసలు నిజాలు రాసే విలేఖరులనే తప్పుపటే విధంగా యాజమాన్యం వ్యవహరించటం చర్చానీయాంగా మారింది. మరో వైపు సిటీ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహణ తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతుంటే కళాశాల యాజమాన్యం సక్రమంగానే ఉన్నాయంటూ విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తుంది. కొంతమంది విద్యార్థులు యాజమాన్యం ప్రలోభాలకు గురైతే మరికొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలల నిర్వహణ తీరును పరిశీలించి ప్రవేశాలు పొందడానికి  జంకుతుండటం గమనార్హం. ఫైర్‌ సేప్టీ లేకున్న, కనీసం మంచినీటి సౌకర్యం లేనటుంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించటానికి అధికారులు సైతం ఎలా పర్మిషన్‌ ఇచ్చారో వారికే తేలియాలని పలువురు వాఖ్యానిస్తున్నారు.  పార్కింగ్‌ స్థలం, గ్రౌండ్‌ లేకుండా ఇరుకైన  ప్రదేశమైన కాంప్లెక్స్‌లో కళాశాల నిర్వహిస్తుంటే అధికారులు గుమ్మనకుండా ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కళాశాలకు పర్మిషన్‌ ఏ పత్రిపాధికన ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  సరైన ల్యాబ్‌ సౌకర్యం, లైబ్రరీ, మంచినీటి వసతి, మూత్రశాలలు, టాయిలెట్లు  తదితర సౌకర్యాలు లేకుండా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లో కళాశాలను నిర్వహించటం విద్యావ్యాపారానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉందనేది గమనార్హం.  అధికారుల అండతోనే కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహణ తీరు పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
పర్మిషన్లు  కాగితాలకే పరిమితమా…!
హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటి మహిళా డిగ్రీ కాలేజీ’ పర్మిషన్లు అన్ని కాగితాలకే పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు లేనివి ఉన్నట్లుగా చూపించి పక్కదారి పట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంప్లెక్స్‌ మొత్తానికి సరిపడనటువంటి తక్కువ మోతాదు కల బోర్‌ మాత్రమే కాంప్లెక్స్‌లో ఉంది. దీనిని బట్టి కనీస నీటి వసతి లేదనేది స్సష్టమవుతుంది. ఇక కనీసం పార్కింగ్‌ స్ళలం లేదనేది కాంప్లెక్స్‌ తెలిసిన వారికేవరికైనా బోదపడే అంశమే. మరో వైపు కళాశాల నిర్వహణలో భాగంగా ఎకరం గ్రౌండ్‌ తప్పని సరి అనేది నిబంధన కానీ కాలేజీ నిర్వహించే కాంప్లెక్స్‌లో గ్రౌండ్‌ ఎక్కడుందో, పార్కింగ్‌ స్థలం ఎక్కడుందో పర్మిషన్‌ ఇచ్చిన అధికారులకు, కాలేజీ నిర్వహించే యాజమాన్యానికే తేలియాలి. ఏదిఏమైనప్పటికీ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాల్సి ఉంది.

జక్కలొద్దా…కేడలొద్దా..?

జక్కలొద్దా…కేడలొద్దా..?

అవును ఇది అక్షరాల నిజం. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని ఓ కార్పొరేటర్‌ భర్త నగరశివారు ప్రాంతంలోని జక్కలొద్ది ప్రాంతాన్ని తాను కష్టపడి చెమటోడ్చి సంపాదించినట్లు తెగ బిల్డప్‌ చేస్తున్నాడు. ఎక్కరిదో భూమి మోసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు తాత, ముత్తాతల కాలం నుంచి ఆరుగాలం శ్రమించి భూమిని సంపాదించినట్లు ఆయనగారు కొడుతున్న ఫోజులు చూస్తుంటే ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. భూముల గూర్చి ఇతగాడు చేసిన కబ్జాల గూర్చి ప్రస్తావిస్తే ఇతను అధిష్టానంపై విరుచుకుపడుతాడు. వారు చేయడం లేదా…? అని ఎదురు ప్రశ్నిస్తాడు. తిమ్మాపురం గ్రామశివారులో పేదదళితుడి భూమి ఆక్రమించిన ఇతడిని ‘నేటిధాత్రి’ ప్రశ్నించింది. అంతే అంత ఎత్తున లేచి నీతివాక్యాలు వల్లిస్తూ మధ్యమధ్యలో పరోక్షంగా హెచ్చరిస్తూ తాము ఒక గ్యాంగ్‌గా ఏర్పడి భూములు కబ్జా చేస్తున్నామని ఒప్పుకోకనే ఒప్పుకుంటూ, మరోవైపు ఎంతో కొంత చెల్లించి భూములు హస్తగతం చేసుకుంటున్నామని చెపుతూ అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశాడు. ఇది సరైంది కాదు కదా అని ప్రశ్నిస్తే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌తో పోల్చుకుంటూ వారు ఎక్కడ కబ్జాలు చేయడం లేదా అంటూ సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తాడు. మొన్నటి వరకు టిఆర్‌ఎస్‌లో కొనసాగి ఇటీవలే పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఓ సీనియర్‌ నేత అనుచరుడిగా చెప్పుకునే ఇతను ఆ సీనియర్‌ నేత భూముల వ్యవహారం తమకెందుకని గమ్మున ఉన్న కార్పొరేటర్‌ భర్త మాత్రం తన కబ్జా పంథాను ఎంతమాత్రం వీడడం లేదు. ఇటీవల జక్కలొద్ది ప్రాంతంలో ఓ దళితుడికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్‌ భర్త స్థానికులు భూమి ఎలా కబ్జా చేస్తారని నిలదీయడంతో ఆరులక్షల రూపాయల చెక్‌ అందజేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడట. ఇలా ఒకటి కాదు…రెండు కాదు…రెండువందల ఎకరాలకుపైగా భూమి ఇతని కబంధహస్తాల్లో చిక్కుకుని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సీలింగ్‌ భూములు, అసైన్డ్‌భూములు, దళితుల బూములు, ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి కేవలం తెల్లకాగితంపై నాలుగు ముక్కలు రాయించి ఎవరితో సంతకం చేయించి పహాణీలు సృష్టించిన ఘనత ఇతగాడికే దక్కుతుందట. తిమ్మాపురం జక్కలొద్ది ప్రాంతాలలో ఎవరినడిగిన ఈయన పేరు చెప్తారు. కొందరు భూమిని కోల్పోయి…వారి భూమిలోనే వారు పరాయిగా మారిపోయి ఆవేదనతో, ఆక్రోశంతో బండభూతులు అందుకుంటారు, శాపనార్థాలు పెడతారు. మనం కేవలం పలకరిస్తే చాలు అయ్యా…నా భూమి నాకు అప్పగిస్తారా…అతనితో మాట్లాడతారా…? సగం అప్పగించిన చాలు మాట్లాడండయ్యా…? అంటూ బ్రతిమిలాడుతారు. ఈ ప్రాంతంలో ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ కన్నెత్తి చూడదు సరికదా కబ్జాలోకి వెళ్లండి పహాణీలోకి ఎక్కిస్తాం…అంటూ ఉచిత సలహా ఇస్తారు అధికారులు. బలవంతుడితో ఢీకొన లేక, రెవెన్యూ, పోలీసుశాఖల సహకారం లేక రాత్రికి రాత్రే రికార్డులు 5 తారుమారు చేయించి తన పేరు వీలైతే బినామీ పేర్లు మరీ అవసరం అయితే తన కొడుకు పేరుతో రెవెన్యూ రికార్డులోకి ఎక్కి కబ్జా దర్పం ఒలకబోసే ఇతగాడిని తట్టుకోలేక భూమిని చూసి బతుకుతున్నారు తప్ప ఈ భూమి ఎప్పటికైనా తమ స్వంతం అవుతుందన్న ఆశను మాత్రం ఇక్కడి దళిత నిరుపేదలు ఎప్పుడో కొట్టేసుకున్నారు. విచిత్రం ఏంటంటే దళితుల భూములు కబ్జా అవుతుంటే తిరగబడి దళితులకు న్యాయం చేయాల్సిన దళిత నాయకులు కొంతమంది సైతం కార్పొరేటర్‌ భర్డకే సహకరిస్తుండటంతో దిక్కుతోచిన స్తితిలో ప్రస్తుతం దళితులున్నారు.

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్‌. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట. ఇంటి పక్కనే ఖాళీ జాగ కనపడటంతో తన ప్రొఫెసర్‌ తెలివినంతటిని ఉపయోగించి ఉన్న స్థలానికి ఖాళీ స్థలాన్ని జోడిస్తే విశాలమైన జాగ సొంతం అవుతుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఖాళీస్థలం యజమాని లబోదిబోమంటున్నారు. ప్రొఫెసర్‌ సార్‌ కబ్జా బుద్దితో తాము చుక్కలు చూస్తున్నామని, ఈ స్థలం నీది కాదు…మొర్రో అన్న ఎంత మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి సమీపంలోని ఎక్సైజ్‌కాలనీలో సర్వే నెంబర్‌ 298/1లో కోటిచింతల కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2018 నవంబర్‌ నెలలో నల్లా ఇమ్మాన్యువల్‌ అనే అతని వద్ద నుండి 346గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేయగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. భూమిని కొనుగోలు చేసిన నంబరులో భూమి వద్దకు వెళ్లి పనులు చేయించడానికి ఉపక్రమించాడు. అంత రిటైర్డు ప్రొఫెసర్‌ రూపంలో ఓ అడ్డుపుల్ల తగిలింది. ఈ భూమి తనదంటూ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పనిచేసి పదవివిరమణ పొందిన కె.కొండల్‌రెడ్డి నోటరీ పేపర్‌తో ఈ స్థలాన్ని తాను ఎప్పుడో కొనుగోలు చేశానని స్థలాన్ని కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బాధితుడికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతోనయిన పని అవుతుందనుకుంటే అదీ కాలేదు. కిరణ్‌కుమార్‌ను సవాల్‌చేస్తూ కొండల్‌రెడ్డి కోర్టుకెక్కాడు. కోర్టు అక్కడ కూడా బాధితుడికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రొఫెసర్‌ తీరును తప్పుపట్టించి అయిన ప్రొఫెసర్‌ సార్‌ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నయానో, భయానో బాధితుడిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. పైరవీకారులు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకుల పేరుతో తిరిగేవారితో సెటిల్‌మెంట్‌కు దిగాడు. అయిన బాధితుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రొఫెసర్‌ సార్‌ కొంతమంది సెటిల్‌మెంట్‌ రాయిళ్ల సూచనలతో అది 298/1 సర్వే నెంబర్‌కాదని 294 సర్వే నెంబర్‌ అని కొత్త పల్లవి అందుకున్నాడు. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌తో 298/1 సర్వేనెంబర్‌లో పక్కా గృహాన్ని నిర్మించుకున్న ప్రొఫెసర్‌ సాబ్‌ తన ప్రహారీగోడ పక్కస్థలాన్ని 294 సర్వే నెంబర్‌ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనే పక్కా కబ్జా బుద్ది బయటపడుతుందని బాధితుడు అంటున్నాడు. 298/1 సర్వే నెంబర్‌ ప్రొఫెసర్‌కు అతని స్థలాన్ని సంబంధించిన స్తలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తన స్థలం కూడా అదే సర్వే నెంబర్‌ కావడంతో ఇది నాది అంటున్నా ప్రొఫెసర్‌ను అప్పుడే రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించుకోలేదు…? ఇంటి స్థలం కాగితాలు పక్కాగా ఉండి..ఖాళీస్తలం కాగితాలు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తారని కేవలం నోటరితో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాటకం ఆడుతున్నాడని బాదితుడు కిరణ్‌కుమార్‌ ఆరోపించాడు. తన స్థలాన్ని అప్పనంగా స్వాధీనం చేసుకోవడానికే రిటైర్డు ప్రొఫెసర్‌ నోటరీతో తనను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని కోర్టు తనకు అనుకూల తీర్పు చెప్పిన, సర్వేయర్‌ 298/1 సర్వేనెంబర్‌ భూమి ఇదేనని తేల్చిన వినడం లేదని అన్నాడు.

పట్టింపులేని తహశీల్దార్‌…?

298/1 సర్వేనెంబర్‌లో 346గజాల స్థల విషయంలో ఇంత వివాదం నడుస్తున్న హన్మకొండ తహశీల్దార్‌ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సర్వే నెంబర్‌ విషయంలో ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి కిరికిరి పెడుతుండగా సర్వేయర్‌ అది 298/1 సర్వే నెంబర్‌ అని తేల్చిన చర్యలు తీసుకోవడంలో తహశీల్దార్‌ వెనుకాడుతున్నట్లు సమాచారం. పంచనామా నిర్వహించాలని కోరిన ప్రొఫెసర్‌ సహకరించడం లేదనే సాకుతో నెలలు గడుస్తున్న తహశీల్దార్‌ కనీసం స్పందించడం లేదట. తహశీల్దార్‌ ప్రొఫెసర్‌తో కుమ్మక్కై బాదితుడు ప్రశ్నిస్తున్నప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి నివేదిక సమర్పిస్తే స్థల వివాదం ముగుస్తుంది. కానీ తహశీల్దార్‌ అందుకు ఎంతమాత్రం పూనుకోవడం లేదని బాధితుడు కిరణ్‌కుమార్‌ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఉన్న తగదాను పరిష్కరించి, అది గొడవలకు దారితీయకుండా ఉండేందుకు పంచనామా నిర్వహించాలని స్థానిక పోలీస్‌ అధికారి తహశీల్దార్‌ను కోరిన నిర్లక్ష్యధోరణి తప్ప తహశీల్దార్‌ సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి పక్షాన ఉండేందుకు అతను యత్నిస్తున్నట్లు సమాచారం. ఇకనైన తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్‌ పంచనామాకు సహకరించడం లేదనే సాకులు చెప్పవద్దని బాధితుడు కిరణ్‌కుమార్‌ కోరుతున్నాడు.

లోటస్‌ కాలనీలో మరో ఇద్దరు ప్రొఫెసర్ల భూబాగోతం

త్వరలో…

బొందలగడ్డకు ఎసరు…?

బొందలగడ్డకు ఎసరు…?

వరంగల్‌ నగర శివారు ప్రాంతమైన పైడిపల్లి గ్రామ బొందల గడ్డకు ఎసరోస్తోంది. యధేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేయటానికి సిద్దపడుతున్నారు. చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని మట్టిని, ప్రభుత్వ భూముల్లోని మొరాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారు. పనిలో పనిగా స్మశాన వాటికలోనూ వెంచర్‌ వేయటానికి మొరాన్ని తరలించేందుకు సిద్దపడటం, స్మశానంలోని గోరీని ద్వంసం చేయటం చర్చానీయాంశంగా మారింది. మట్టి, మొరం దందాతో పాటు స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు ‘తిలాపాపం తలా పడికెడు’ అన్న చందంగా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే జరుగుతుందనేది బహిరంగ రహస్యంగా మారింది. రియల్‌ వ్యాపారులు యధేచ్ఛగా మట్టి, మొరం తవ్వకాలు చేస్తూ , స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు సిద్దపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదుపకపోవటానికి కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై ప్రభుత్వ భూముల్లోని మొరం, చెరువుల్లోని మట్టితో వ్యాపారం చేస్తున్నారని, చివరికి స్మశానాలను కూడా వదలటం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అయితే స్మశానవాటికను వెంచర్‌ గా మాచ్చేందుకు అందులోని గోరీని ద్వంసం చేసిన ఆనవాల్లు కనిపిస్తున్నప్పటికీ పైడిపల్లి గ్రామ శివారులో మట్టి, మొరం దందాపై తమకేమీ తెలియదన్నట్లుగా 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ వాఖ్యానిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొట్టడం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపతమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరముంది.

ఆచార్యా…ఇదేం రీతి…!

ఆచార్యా…ఇదేం రీతి…!

ప్రొఫెసర్‌ కబ్జా బుద్ది

ఇంటి పక్క స్థలంపై కన్నేసిన రిటైర్డు ప్రొఫెసర్‌

తన స్థలంలో కలుపుకోవాలని అత్యాశ

నోటరి డాక్యుమెంట్‌ సృష్టించి స్థల యజమానికి చుక్కలు చూపిస్తున్నాడు

కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా లెక్కచేయని వైనం

సర్వే నెంబర్‌ విషయంలో కిరికిరి…లెక్క తేలుద్దాం రమ్మంటే ససేమిరా…

సర్వేయర్‌ వస్తే సహకరించడు…పంచనామాకు ఒప్పుకోడు

ప్రొఫెసర్‌ తీరుతో పరేషాన్‌ అవుతున్న స్థల యజమాని…లక్షలు పోసి కొన్న స్థల వివాదంతో దిక్కుతోచక దిగాలు

కబ్జాకథలు

సోమవారం నుంచి…

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

ఆయనో ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంట్రాక్టర్‌గా పేరుగాంచి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సహజవనరులను దర్జాగా నమిలి వేస్తూ కోట్లు కూడబెట్టాడు. ఈయనగారు చేస్తున్న దందా ప్రస్తుత తరాలను, భవిష్యత్‌ తరాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎంత పెద్ద గుట్టలనైనా అవలీలగా మింగి వేస్తాడు. అనుమతుల సంగతి దేవుడెరుగు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక పనులు చకచక జరిగిపోతాయి. కోట్లాది రూపాయలు జమ అయిపోతుంటాయి. ఇది ఎవరు ఇచ్చిన హక్కో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, మేథావులు, సహజవనరుల రక్షణ ప్రేమికులు నెత్తి, నోరు కొట్టుకున్న ఆ ఎమ్మెల్యే మాత్రం వ్యాపారాన్ని వదలడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనికిమాలిన పనే కాకుండా ఇలాంటి పనులు ఎవరు చేసిన తన నియోజకవర్గంలో సహకరించే స్థాయిలో ఈ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మట్టి మాఫియాకు కింగ్‌లా వ్యవహరించే ఓ మట్టి కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిషన్‌ కాకతీయ పేరుతో ఏ చెరువు పని జరిగిన ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించడం ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నాడా. మిషన్‌ కాకతీయ పని అప్పగిస్తే పని జరిగితే పర్వా లేదు. కానీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న పొగరుతో ఈ కాంట్రాక్టర్‌ ఇష్టారీతిన వ్యవహారిస్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్‌ ఆ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలో మిషన్‌ కాకతీయ పనులు చేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ మిషన్‌ కాకతీయ మంజూరు అయ్యిందా..లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ విషయమై తహశీల్దార్‌ను వివరణ అడిగితే సమాధానం దాటవేస్తారు ఏమో ఉండవచ్చు అంటారు. మట్టి బయటకు తరలిస్తున్నారని ఎఇని అడిగితే లోడ్‌ చేయడం చూడడం వరకే మా పని మట్టి ఎక్కడికి వెళ్తుందో మాకెందుకు అని అంటారు.

ఇటుకబట్టీలకు సరఫరా లక్షల్లో దందా

ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ చెరువులో మిషన్‌ కాకతీయ పనులు జరుగుతుంటే ఇందులో తోచిన మట్టి రైతులకు సరఫరా చేయాలి, లేదంటే చెరువు చుట్టూ కట్ట కోసం వినియోగించాలి కానీ అలా జరగడం లేదు. తోడిన మట్టంతా లారీల కొద్ది వరంగల్‌ నగర శివారుకు తరలుతోంది. నక్కలపెల్లి, గొర్రెకుంట శివారు గీసుగొండ కెనాల్‌ పక్కన నిర్వహిస్తున్న ఇటుకబట్టీలకు మట్టిని ఈ కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క నక్కలపెల్లి ఇటుకబట్టీకే 75లక్షలకుపైగా మట్టిని సరఫరా చేసినట్లు తెలిసింది. కోటి ఒక లక్ష రూపాయల మిషన్‌ కాకతీయ పని అని చెప్తున్న ఈ కాంట్రాక్టర్‌ ఇటుక బట్టీలకు మట్టి సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు వెనకేస్తున్నట్లు తెలిసింది. అక్రమంగానే మట్టి దందా నిర్వహిస్తున్న ఇతగాడికి ఎమ్మెల్యే చల్లని చూపు ఉన్నట్లు తెలిసింది. ఈ మట్టి దందా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేసుకోవడానికి ఎమ్మెల్యేకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్లు ఆ కాంట్రాక్టర్‌ ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాంట్రాక్టర్‌ ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఊకల్‌ చెరువులో మట్టిని తవ్వి దండిగానే దండుకున్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే ఇక్కడ పనులు ఆపినట్లు తెలిసింది.

మట్టి మాఫియాకు ఇతనే కింగ్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్రమంగా మట్టిదందా నడుపుతున్న వారిలో ఇతగాడు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ ఏటా వేసవికాలంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంవత్సరం ఇప్పటికే ఇతగాడి టార్గెట్‌ 2కోట్లు దాటినట్లు తెలియవచ్చింది. మొత్తానికి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న అందరికి సహకరిస్తుండగా ఉత్తిపున్యానికి మట్టిని తవ్వుతూ కోట్ల రూపాయలు వెనకేస్తున్న ఈ మట్టి మాపియా కింగ్‌కు సహకరిస్తుండడం నియోజకవర్గంలో విమర్శలకు దారితీస్తోంది. ఇకనైన ఎమ్మెల్యే వ్యవహారశైలిలో మార్పు రావాలని జనం కోరుకుంటున్నారు. అడ్డగోలుగా మట్టిని తవ్వుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న కాంట్రాక్టర్‌కు ఎందుకు సహకరిస్తున్నాడో అతనికే తెలియాలని అంటున్నారు.

మంత్రి చుట్టూ భజన బృందం

మంత్రి చుట్టూ భజన బృందం

ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం. ఈ కథనం రాయడం మంత్రి దయాకర్‌రావుకు అంతగా నచ్చలేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఏకైక మంత్రిని తాను చేస్తున్న పనులను ప్రశ్నిస్తారా…? ఆ పత్రికకు ఎంత ధైర్యం అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఈ మంటను తగ్గించుకోవడం కోసం తాను పిలవగానే ఎస్‌ బాస్‌ అంటూ వాలిపోయే కొంతమంది పెయిడ్‌ జర్నలిస్టులను పిలిపించి తన బాధను వెళ్లగక్కాడట. మంత్రి బాధ బాగానే ఉన్న, కథనం కావాల్సినంత వైరల్‌గా మారి ఎర్రబెల్లి పీఎల వ్యవహారం రాష్ట్రమంతా ప్రచారమైన కొంతమంది కబోదులకు అది మాత్రం కనపడటం లేదు. మంత్రి బాధను మొత్తం విన్న కొంతమంది జర్నలిస్టుల కథనాలను ‘గంజిలో ఈగ’లా తీసిపారేసారట. మీరెంటి…?, మీ హోదా ఏంటీ…?, మీరు ధర్మప్రభువులు, దాన, దయగుణం కలవారంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సిన తెగ పొగిడేసి ‘నేటిధాత్రి’ సంగతి మేం చూస్తాం అంటూ భరోసా ఇచ్చారట. ‘తాను దుర సందు లేదు..మెడకో డోలు అన్నట్లు’ చేసే దందాలు, వసూళ్ల పర్వాల విషయం…వీరు పనిచేస్తున్న యజమానులకు తెలిసిపోవద్దంటూ బతిలాడి, బామాలి నూరు పట్టుకుని వేలాడుతున్న ప్రబుద్దులు ‘నేటిధాత్రి’కి నీతులు వల్లించే స్థాయికి ఎదిగారట. ఎంత మాత్రం ఆత్మగౌరవం లేకుండా జర్నలిజం విలువలను బజారుకీడ్చి అక్రమార్కులు, రాజకీయ నాయకుల దగ్గర అక్షరాలను తాకట్టు పెట్టిన వీరికి ‘నేటిధాత్రి’ కథనాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదో అర్థం కావడం లేదు. జర్నలిజం వీరి ఇంటి సొత్తు అయినట్లు ‘నేటిధాత్రి’ ఉనికిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిదో తెలియాలి. మా సంస్థను మేం కాపాడుకుంటూ ఉన్నంత జర్నలిజాన్ని బతికిస్తూ నిఖార్సయిన వార్తలతో ముందుకు వెళుతున్న మాపై వీరికి ఎందుకు ఇంత కళ్లు కుడుతున్నాయో అర్థం కాదు. సొల్లు వాగుడు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రెస్‌నోట్లు, గిట్టుబాటు వార్తలు మాత్రమే రాయడం చేతనైనా వీరు అవి కూడా ఘోస్ట్‌రైటర్‌తో రాయించుకుని మా వార్తలను జబ్బలు చరుచుకునే వీరికి ‘నేటిధాత్రి’ని శంకించే హక్కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేస్తున్నాం. ‘ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కాడు..ఏదో కాయ కాసింది’ అని ఇంట్లో సభ్యుల పేర్లు చెప్పుకుని లబ్ధి పొందే ఇద్దరు జర్నలిస్టులు తామే జర్నలిజం, తామే పై నంచి ఊడిపడ్డాం. మాకే సర్వాధికారులు ఉన్నట్లు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్చకు అడ్డు తగిలే విధంగా, ఏ పత్రికలో, ఏ చానల్‌లో మంత్రికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయో గుర్తించి మధ్యవర్తిత్వం వహించినట్లు నటించి, తాము చెప్పి కథనాలు రాకుండా చేస్తున్నామని మంత్రి వద్ద నమ్మబలికి లబ్ధిపొందుతున్న విషయం జర్నలిస్టులకు తెలిసిందే. ఇటీవల పెద్దపత్రిక మాది అంటూ బోర్డు తగిలేసుకుని ఊరేగె ఓ జర్నలిస్టు ‘నేటిధాత్రి’తో మాట్లాడాడు. మన జిల్లా మంత్రిగారు అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ తాను అక్షరాలను వేలం గట్టి లెక్కగట్టి మరీ అమ్మేస్తున్నాం. మీరు వేలం పెట్టండి, అమ్మకానికి సిద్ధం కండి అంటూ రాయబారిగా వచ్చి బేరసారాలు నడిపే ప్రయత్నం చేశాడు. అది ఎంత మాత్రం కుదరకపోవటంతో ‘నేటిధత్రి’ని పట్టించుకోవద్దని మంత్రికి ఉచిత లచ్చాడట. అణచివేయబడ్డ వారు, సామాజికంగా వెనుకబడిన వారు అంటూ డైలాగులు తెగ వల్లించే ఈ జర్నిలిసు ఏ సామాజికవర్గానికి లబ్ధి చేస్తున్నాడో కాస్త గురెరాలి. ప్రజల పొట్ట కొట్టి, అధికారం ఉంది కదా అంటూ దోపిడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలు స్వప్రయోజనాల కోసం వృతా చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదో ఆ జర్నలిస్టు సమాధానం చెప్పాలి. నీతులు వల్లిస్తూ గోతులు తొవ్వే అతగాడికి ‘నేటిధాత్రి’ని కామెంట్‌ చేస్తే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పత్రిక ఏదైనా జనం కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఉంటుందని, కథనం ఏమైన జనం నిజానిజాలు గ్రహించి కీలెరిగి వాత పెడతారనే కనీస అవగాహన ఉండాలి. జర్నలిజం అనగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు లబ్ధి పొందడాలు, కాసులు సంపాదించి ఊరేగడం కాదని గుర్తుంచుకోవాలి. వసూళ్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించడానికి ఇతం జర్నలిస్టులపై దుమ్మేత్తిపోసే నీతి, బాహ్యమైన పనులు చెల్లవనీ ‘నేటిధాత్రి’ హెచ్చరిస్తుంది. నిజం ఎప్పటికైన గెలుస్తుంది. జర్నలిజం జనం పక్షానే ఉండగానే తీరుతుంది. మేం రాసే కథనాలపై అనుమాలు ఉంటే మంత్రైనా ఎంతటివారైన వారికి ‘నేటిధాత్రి’ సమాధానమిస్తుంది. కథనాలపై అభ్యంతరం ఉంటే వారికి సంబంధించిన వివరాలను ‘నేటిధాత్రి’ జర్నలిజం విలువలను గుర్తించి తప్పక ప్రచురిస్తుంది. ఏకపక్షంగా ఎప్పుడు వ్యవహరించదు. ఎవరిపై కథనం వచ్చిన వారు ‘నేటిధాత్రి’తో మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జర్నలిస్టుల పెత్తనం మా కథనాలపై చూపిస్తే సహించమని చెప్తున్నాం. మా ఉనికిని ప్రశ్నించవద్దని చెప్తున్నాం. మా పత్రికకు సంబంధించిన ప్రతినిధి మీడియా సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా మంత్రి దగ్గర భేష్‌ అనిపించుకునేందుకు సభ్యత మరచి కామెంట్లు చేయకూడదని అంటున్నాం. అలా చేస్తే ధీటుగా సమాధానం చెప్పడం మాకు తెలసని చెప్తున్నాం. వ్యక్తులు లేనప్పుడు వారి గురించి ప్రస్తావించడం సంస్కారం కాదని కుసంస్కార స్థాయికి దిగజారిన వారిని కోరుతున్నాం. పాతకాలపు మెదళ్లతో తిరుగుతూ ఎంతమాత్రం అప్‌డేట్‌ కాకుండా ఉండే మీకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ కంటే ‘వెబ్‌ జర్నలిజం’ అత్యంత వేగంగా దూసుకపోతుందని, వసూళ్లు తప్ప సమాజంంలో వస్తున్న మార్పులపై ఎంత మాత్రం అధ్యాయనం చేయలేని మీకు చెబుతున్నాం.

 

ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం

వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని సుబేదారి స ర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య అన్నారు. శుక్రవారం ‘నేటిధాత్రి’ క్రైం ప్రతినిధితో ఇంటర్వూలో పై విదంగా స్పందించారు.

‘నేటిధాత్రి’ : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి?

సీఐ, సదయ్య : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉన్నాయి. నిత్యం పెట్రోలింగ్‌ ద్వారా ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగానే పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.

‘నేటిధాత్రి’ : సీసీ కెమెరాల పట్ల ప్రజల మద్దతు ఎలా లభిస్తున్నది?

సీఐ సదయ్య : నగరంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతున్నది. ప్రతి గల్లీలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం. లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు నిర్మించుకుంటున్న ప్రజలు అలాగే ప్రతి వాడకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను తగ్గించడమే కాకుండా దొంగల బారి నుండి కూడా కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయి.

‘నేటిధాత్రి’ : రాత్రి వేళలో పెట్రోలింగ్‌ ఎలా ఉంటున్నది?

సీఐ సదయ్య : సుబేదారి పరిధిలో రెవిన్యూకాలనీ, జూలైవాడ, పోస్టల్‌కాలని, ప్రకాశ్‌రెడ్డిపేట, బ్యాంక్‌కాలని, టీచర్స్‌కాలని, వడ్డేపెల్లి, వికాస్‌నగర్‌, స్నేహనగర్‌, రాంనగర్‌, అంబేద్కర్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో రాత్రివేళలో ఇంటర్‌సెప్టర్‌ వెహికల్‌ ద్వారా పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.

‘నేటిధాత్రి’ : ప్రజలకు మీరిచ్చే సలహా?

సీఐ సదయ్య : ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులకు ఏదైనా సమాచారం అందించాలన్నా, ప్రజలు తమ సమస్యలను పోలీసులకు 100 డయల్‌ ద్వారా సమాచారం అందించవచ్చు. పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. పోలీసులంటే ప్రజలకు నిత్యసేవకులు, పోలీసులున్నదే ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజలు కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు.అక్కడ ఫీజుల వివరాలు తెలుసుకున్న వారంతా వామ్మో..? ఇంత ఫీజా..? అని గుండెలు బాదుకుంటున్నారు.

అసలు పేర్లు మార్చి మాయచేస్తున్న ‘మోసగాడు’

హన్మకొండలో ఓ ప్రైవేటు స్కూల్‌ దందా అంతా ఇంతా కాదు..దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న పాలసీని వీరు అక్షరాల నిజంచేస్తున్నారు. ఒక స్కూల్‌ యజమాని పాతస్కూళ్లను కొనేసి అసులుపేరును మాయంచేసి, అనుమతిలేకున్నా ఒకే పేరుతో పాతస్కూళ్ల బోర్డులను కమ్మి ఈ స్కూల్‌ కూడా ‘మా’ స్కూలే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసంచేస్తున్నారు. అసలు విషయం తెలియక విద్యార్థులను ‘ఆ’ స్కూలే అనుకొని ఫీజులు భారమైనా అందులో చేర్చుతున్నారు. కొందరేమో తప్పదు కాబట్టి చేర్పిస్తున్నామని, మరికొందరేమో అసలు విషయం తెలుసుకొని పలానా స్కూల్‌ వీరు చెప్పిన స్కూల్‌ కాదుకదా..? అని ఆలోచిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా అసలు ‘షాని’కెళ్లడమే తప్పు లేనిదానికి, కానిదానికి ఎందుకు వెళ్లాలి అంటూ నగరంలో తల్లిదండ్రులు గుసగుసలాడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version