ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఖర్చుల డబ్బులను ఇవ్వాలని కోరుతూ బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాక రాజు ఎంపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బహిరంగ లేఖను రాసారు .ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహబూబాబాద్‌ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మహిళలతో రోడ్‌షోను నిర్వహించారని తెలిపారు .కోలాటం మహిళలకు ఒక్కరికి వంద రూపాయల చొప్పున 550 మందికి 55000 అలాగే మంచినీటి ప్యాకెట్ల కోసం 800రూపాయలు ఖర్చు అయ్యాయని ,అందుకు పార్లమెంటు అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ , నర్సంపేట ఎన్నికల ఇంచార్జి బోడా వీరన్న ముప్పైనాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా 26300 రూపాయలను ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ రాజు ఆరోపించారు.

వీరన్నను ఎన్నికల ఖర్చుల మిగతా డబ్బులు ఇవ్వమని అడిగితే గతంలోనే ఇచ్చారంటూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఈ విషయంపై అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ కు వివరించి తెలుపగా గతంలోనే మొత్తం డబ్బులను వీరన్నకు ఇచ్చామని తెలిపినట్లు ఆయన తెలిపారు. కోలాటం సంబంధించిన మహిళలు ప్రతిరోజూ తమ ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారని, దీంతో దిక్కులేని స్థితిలో మనస్తాపానికి గురైతున్నట్లు రాజు వివరించారు. వెంటనే డబ్బులను జిల్లా పార్టీ అధిస్థానం ఇప్పించాలని కందగట్ల రాజు కోరారు.

ఇక్కడ బిజెపి ఉందా…చెప్పుతో కొడతా : దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

 దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్‌ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి అభ్యర్థి కోడెపాక స్వరూప ఓటర్లకు బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, శాయంపేట జడ్పీటిసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర జ్యోతి మండలకేంద్రంలో స్వరూప వద్దకు వెళ్లి ఇక్కడ ఇంకా బిజెపి ఉందా…బిజెపి ఎక్కడిది…బిజెపికి ఓటు వేయాలని అడుగుతున్నావా…చెప్పుతో కొడతా…అంటూ దళిత మహిళ అయిన స్వరూపను ఇష్టం వచ్చినట్లు తిట్టిందని బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప తెలిపారు.

ఈ సందర్భంగా కోడెపాక స్వరూప మాట్లాడుతూ శుక్రవారం పోలింగ్‌ కేంద్రం వద్ద తాను ఓటర్లకు పువ్వుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గండ్ర జ్యోతి తన వద్దకు వచ్చి దళిత మహిళనైన నన్ను చెప్పుతో కొడతానని ఇష్టంవచ్చినట్లు తిట్టిందని ఆరోపించింది. గతంలో తాను ఉపసర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని కూడా మరచి నన్ను చెప్పుతో కొడతానని అనడం టిఆర్‌ఎస్‌ పార్టీ దౌర్జన్యానికి అగ్రకుల అహాంకారానికి గండ్ర జ్యోతి వ్యవహారించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-2 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా : ఐనవోలు మండల టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గజ్జెల శ్రీరాములు

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా

పార్టీల్లో నాయకులుగా ఉండడం పదవులు ఆశించడం ఎలాగోలా ఎదో ఒక పదవి తెచ్చుకొవడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధరణంగా చూస్తునే ఉంటాం. మరికొంతమందైతే ధనబలాన్ని,బంధుత్వబలాన్ని ఉపయోగించుకుని నేరుగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తులను చూస్తూనే ఉంటాం. కాని ఎలాంటి పదవులు లేకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీస ఆదరణ లేని సమయంలో పార్టీలోకి వచ్చి ప్రజల ఆకాంక్షను నేరవేర్చే ఉద్యమంలో తనవంతు పాత ఉండాలనే సదుద్దేశ్యంతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ కార్యమ్రాల్లో పాలు పంచుకుంటూనే పార్టీని క్రమంగా ముందుకు తీసుకెళ్ళడంలో అహర్నిశలు కష్టపడ్డాడు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న విధానంతో నానాటికి కార్యకర్తలు పెరుగుతూ వచ్చారు. పార్టీ కొరకు,ప్రజల ఆకాంక్ష కొరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా వెచ్చించకుండా దొరికిన ప్రతి క్షణాన్ని పార్టీ నిర్మాణానికి,ఉద్యమ ఒరవడికే కేటాయించారు. పార్టీ నిర్మాణం కోరకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను 18 సంవత్సరాల కాలంపాటు మండలపార్టీ అధ్యక్షుడిగా కోనసాగించాయి. రాష్ట్రంలో తెలుగుదేశం,కాంగ్రేస్‌ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏనాడు ఉద్యమస్ఫూర్తిని వీడలేదు.తాను భాగస్వామ్యం అయిన ఉద్యమ ఫలితం రాష్ట్రం సిద్దించినా,తాను కార్యకర్తగా పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏనాడు పదవుల కోరకు పాకులాడని సహనం ఆయన సోంతం.అందుకే ఆయనను ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ,స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ల నిర్ణయం మేరకు జెడ్పీటీసి సభ్యుడిగా పోటి చేస్తున్నారు.ఆయనే మండలంలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల శ్రీరాములు.ప్రస్తుత ఎన్నికల ప్రచారం,తన అభ్యర్ధిత్వంపై గ్రామాల్లో ప్రజల నుండి వస్తున్న ఆదరణ తదితర అంశాలను గురించి ఆయన పంచకున్న విశేషాలు నేటిధాత్రిలో ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామాల్లో ప్రచారం ఎలా జరుగతుంది.?

జడ్పీటిసి అభ్యర్ధి: గ్రామాల్లో ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ అభ్యర్ధుల ప్రచారంతో పాటు జడ్పీటీసి అభ్యర్ధిగా నేను కూడా ఒక ప్రణాలికతో ప్రచారంలో ముందకు సాగడం జరుగుంది. ఇప్పటికే స్వయంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అధే విధంగా స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌,నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావులతో మరోమారు గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించాం.

ప్రతినిధి: ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.?

జడ్పీటీసి అభ్యర్ధి: ప్రజల చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల్లో ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పాల్సి వచ్చేది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గురించి ప్రతి వ్యక్తి ఈ రోజు చర్చించుకుంటున్నారంటే ఫ్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల చెంతకు చేరాయి. ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అందుకే వారు ఈ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను వ్యక్తిగతంగా కంటే పార్టీ అభ్యర్ధులుగా ఆదరిస్తున్న తీరు హర్షనీయం.

ప్రతినిధి: పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఏఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నారు?

జడ్పీటీసి అభ్యర్ధి: పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్ధుల ఎంపికలో స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కోరకున్న అభ్యర్ధులకు అభ్యర్ధిత్వం ఇవ్వడానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.అధే విధంగా గ్రామాల్లో పార్టీ విధేయులకు,పార్టీ కోరకు పని చేస్తూ సేవ చేయగలగే వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపికను ప్రజలు గమనించారు.కాబట్టే ఇప్పటికే మండలంలో ఉన్న ఐనవోలు 1 ఎంపిటిసి,వనమాల కనపర్తి అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధే విధంగా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయం

ప్రతినిధి:మీకు జెడ్పీటీసి అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం?

జడ్పీటీసి అభ్యర్ధి: అధికారం కోసం మాత్రమే కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే స్ధానికంగా పార్టీ కోరకు,రాష్ట్రం కోరకు పని చేసిన గులాబీ సైనికులు చాలామంది ఉన్నారు. ఇంతకాలం పార్టీలో ఇచ్చిన బాధ్యతలు నిర్వహించిన తీరు,ఉద్యమ నేపథ్యం ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని తనకు అవకాశం ఇచ్చారు.ఇచ్చిన అభ్యర్ధిత్వం ప్రజలు ఆశిర్వదించి జెడ్పీటీసిగా ఎన్నుకుంటే ఈ తరుణంలో మరింత భాద్యత పెరుగుతుందనే అనుకుంటున్నా. ఎందేకంటే మండలంలో ఉన్న ఉద్యమకారులను,పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సి బాధ్యత నాపై ఉంది.బహూశా రానున్న రోజుల్లో ఉద్యమకారులకు మంచి రోజులు వస్తాన్నాయనే ఒక సూచనను ఇవ్వడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారని భావిస్తున్నా.ఎది ఏమైనా తనపై నమ్మకంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుకుని తన విజయాన్ని స్థానిక శాససభ్యులు ఆరూరి రమేష్‌కు కానుకగా ఇస్తా. అధే విధంగా తన అభ్యర్ధిత్వానికి సహకరించిన నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు,అంతేకాకుండా తన ప్రచార కార్యక్రమాల్లో సహకరిస్తున మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సమ్మయ్య,మండల పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవిందర్‌, మార్నేని యువసేన బాధ్యులు డబ్బా శ్రీనులకు ఋణపడి ఉంటా.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-1 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాల సమగ్ర అభివద్ధి జరుగుతుందని బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి జనగామ కిష్టయ్య, ఎల్కతుర్తి గ్రామ ఎంపిటిసి అభ్యర్థి బొజ్జ హరీష్‌, దామెర గ్రామ ఎంపిటిసి అభ్యర్థి పర్వీన బేగంకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గ్రామాలు అభివద్ధి చెందాలనే సంకల్పంతో అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఎక్కడ అవినీతి ఉండకూడదనే దఢ నిశ్చయంతో ప్రధాని నరేంద్రమోడీ వేలకోట్ల రూపాయలు తెలంగాణకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చిన అభివద్ధి శూన్యం అని అన్నారు. నేడు గ్రామాల అభివద్ధి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని, నరేంద్రమోడీ ద్వారా నిధులను తీసుకువచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందని, ప్రజలందరూ కోరుకునేది ఒక్కటే జడ్పీటీసీ అభ్యర్థిగా, ఎంపిటిసి అభ్యర్థిగా బిజెపికి ఓటువేసి గెలిపించి గ్రామాల అభివద్ధికి తోడ్పడాలని రావు పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమూర్తి శివకుమార్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ పాశికంటి రాజేంద్రప్రసాద్‌, మండల అధ్యక్షుడు వర్ధన్‌, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి అశోక్‌, మండల నాయకులు చిరంజీవి, ఎర్రగొల్ల రాజు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో ముందుకు సాగనివ్వని పాలకుల దగ్గర ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించి ప్రజలు కోరకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అముల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ చేసిన అభివృద్ధి చూసి పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని శాసనసభ్యుడు అరూరి రమేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మండలంలోని చెన్నారం,ఉప్పరపల్లి,నల్లబెల్లి,ల్యాబర్తి,కొత్తపల్లి గ్రామల్లో జెడ్పీటీసి అభ్యర్ధి మార్గం భిక్షపతితో కలిసి ఆయా గ్రామాల ఎంపిటిసి అభ్యర్ధులతో ప్రచారం నిర్వహించారు. ఈసంధర్భంగా ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయా గ్రామాల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు దివించాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో ముందు నుండి ఉద్యమించి పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఇంత వరకు నిలిచిన నాయకుడు మార్గం భిక్షపతిని జెడ్పీటిసి అభ్యర్ధిగా ప్రజలపై నమ్మకంతోనే మీ ముందుకు పంపిందని అన్నారు. అదే విధంగా పార్టీ నిర్ణయాలు,ప్రజలు కోరకున్న వ్యక్తులకే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్ధులుగా ఖరారు చేసినట్లు అరూరి తెలిపారు. మండలంలో 11 స్థానాలకు గాను ఇప్పటికే 2 స్థానాలు ఎకగ్రీవం ఆయ్యాయని మిగతా 9 స్థానాలకు 9 స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మార్నేని రవిందర్‌రావు,జెడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి,మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,పార్టీ ఎన్నికల ఇంచార్జీలు,పార్టీ ముఖ్యనాయకులు,ప్రజలు పాల్గోన్నారు.

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పరిషత్‌ ఎన్నికల ప్రచారం మండలంలో జోరుగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి మార్గం బిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థిని అన్నమనేని ఉమాదేవి గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి మార్నేనీ రవిందర్‌రావు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ నిధులతో గ్రామాలలో అభివద్ధి పనులుచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌ నాయకత్వంలో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, గ్రామ ఇంచార్జ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, అధ్యక్షులు మున్నురు సొము, చీకొండ యాకయ్య, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నర్సింగరావు, మాజీ ఎంపిటిసిలు నిరంజన్‌, మండల నాయకులు తుమ్మల యాకయ్య, హరిప్రాసాద్‌, సుభాష్‌, గ్రామ ముఖ్యనాయకులు కోంరయ్య, సారంగం, ఉపసర్పంచ్‌ కళింగరావు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఉపాధి పనులు చేసి ప్రచారం

ఇల్లంద గ్రామంలో చెరువు గట్టు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలిల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి జడ్పిటిసి మార్గం భిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థి పిట్టల జ్యోతిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సాంబయ్య, మాజి సర్పంచ్‌ తూళ్ళ కుమారస్వామి, అధ్యక్షుడు ఎల్లస్వామి, ఇంచార్జులు, మోహన్‌రావు, పూజారి రఘు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌, అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదష్టకరమైన సంఘటనలుగా సిఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సిఎం విజ్ఞప్తి చేశారు.

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎ.అశోక్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల పేపర్ల వాల్యువేషన్‌, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ ఏడాది 9.74లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారని, వారిలో 3.28లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని, మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. వారి అనుమానాలు నివత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ-వెరిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ-వెరిఫికేషన్‌ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ-వెరిఫికేషన్‌ చేయాలి. రీ- వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్‌, జెఇఇ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియట్‌తోపాటు ఎంసెట్‌ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంటర్మీయట్‌ విద్యార్థుల డాటా ప్రాసెస్‌, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ-ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోడ్‌ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. ‘ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామనే బాధతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదష్టకరం. ఇంటర్మీడియట్‌ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? : విజయశాంతి

ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రధాన పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. తమిళనాడుకు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడు అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీ తరపున ప్రచారం చేసి, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను అక్కడి ప్రజలకు వివరించి ఉండొచ్చు కాదా అని అన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి ఆ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పే విషయంపై క్లారిటీ వచ్చేదని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు తాను మద్దతు తెలపడంతోపాటూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను జేడీఎస్‌ కాపీ కొట్టడం వల్లే కుమారస్వామి సీఎం అయ్యారని కేసీఆర్‌ ప్రచారం చేసుకున్నారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నుండి కుమారస్వామిని గెలిపించానని చెప్పుకున్న కేసీఆర్‌, పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక వైపు ఎందుకు ఒకసారి కూడా చూడలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని ఎద్దేవా చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి, కొందరు ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానని హడావుడి చేసిన కేసీఆర్‌ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. గతంలో తాను కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే, దాని అర్ధం కేసీఆర్‌ మాట ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు, మనిషి మాత్రం మోడీ నేతత్వంలోని బీజేపీ వైపు ఉన్నారనే విషయంపై తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందని అన్నారు. కొన్ని విషయాలను ఎంత దాచాలన్నా దాగవని తెలిపారు.

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

నేటిధాత్రి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ సీన్‌నే రిపీట్‌ చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ముఖాముఖి ఏకి పారేసిన చంద్రబాబు దేశ రాజధానిలోను అదే సీన్‌ను కొనసాగించారు. సిట్టింగ్‌ ఎంపీలు, మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఆయన వైఎస్సార్‌సీపీ, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని కౌంటింగ్‌ కాకముందే బాబు కొత్త పల్లవి అందుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన ఈ కామెంట్లపై ఏపీలో రకరకాల విమర్శలు వినవస్తున్నాయి. ఓటమికి కావల్సిన సాకులను బాబు ముందస్తుగానే వెతుక్కుంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రం రావణకాష్టం

ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు చంద్రబాబు ఆరోపించారు. శని, ఆదివారాలు ఢీల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి కారణం ఎవరు అని ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15మంది టిడిపి ప్రతినిధుల బందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అధికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైఎస్సార్‌సీపీ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

మోడీ సూచనలతో ఈసీ ఏకపక్ష వైఖరి

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓటువేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోడీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదన్నారు.

తెల్లవారు వరకు పోలింగ్‌..ఇదేం ప్రజాస్వామ్యం?

సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదని, తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరిగిందంటే ఇదేం..ప్రజాస్వామ్యం..ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందంటూ సీఎం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హత్య జరిగినా..మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వేలసంఖ్యలో ఈవీఎంలు ఫెయిల్‌ కావడానికి కారణమేంటని నిలదీశారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని సీఎం గుర్తు చేశారు.

ఆ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులా?

పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని, తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేపర్‌ బ్యాలెట్‌లపై అందరికీ అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయన్నారు. బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16గంటల సమయం పడుతుందని, మరి వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరురోజుల సమయం ఎందుకు అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

 

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?

నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…? అక్కడ జగన్‌ వాహా కొనసాగుతుందా…? గురువారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఆంద్రప్రజలు జగన్‌ వైపే మొగ్గుచూపారా…? ప్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలు కానుందా…? ఇలాంటి అనేకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్నాయిట. మెజార్టీ ప్రజలు జగన్‌నే సమర్థించారని సంకేతాలు వెలువడుతున్నాయట. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఇక్కడ జోరుగానే కొనసాగుతుంది. రెండోసారి అధికార పీఠం ఎక్కేందుకు చంద్రబాబు తన సర్వశక్తులు ధారపోసి విజయం బాటన కొనసాగేందుకు ప్రయత్నించిన ఈసారి జగన్‌కే ఎపీ ప్రజలు పట్టం కట్టనున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

బాబుకు ముందే తెలుసా…?

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఆధారంగా తాము ఓటమి బాటపట్టనున్నామని అర్థమయిపోయిందని తెలిసింది. అయితే దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈసితో గొడవకు దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఈసి పక్షపాంతంగా వ్యవహరిస్తుందని ఎన్నికల కార్యాలయం ముందు ధర్నాకు దిగడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు నేరుగా వార్నింగ్‌లు ఇవ్వడం ఇవన్ని ఓటమిని ఒప్పుకున్నట్లు సంకేతాలేనని అంటున్నారు. దీనికి తోడు ఓట్ల లెక్కింపు విషయంలో సైతం అనుసరించాల్సిన విషయాలు, వివిప్యాట్‌ స్లిప్పుల విషయంలో సైతం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ టూర్‌ పెట్టుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేంద్ర ఎన్నికలకమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం…వింటే సరేసరి లేదంటే అక్కడ ధర్నా చేస్తాం అంటూ బాబు మరోసారి సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు నిజంగానే ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఎపీలో కొనసాగుతుంది.

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తోందా…?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం కోల్పోనున్నాడు. జగన్‌ అధికారంలోకి వస్తాడని తెలంగాణ సీఎం కేసిఆర్‌ ముందే తెల్చేశారు. చంద్రబాబుకు తాము రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని ప్రకటించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే బాబు ఓడిపోవడం, జగన్‌ అధికారంలోకి రావడమేనని ప్రస్తుతం ఆంధ్రా ప్రజలకు అర్థమయ్యిందట. బాబు అధికారం కోల్పోతే కేసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ విజయవంతం అయినట్లేనని ప్రజలు భావిస్తున్నారట. మొత్తానికి కేసిఆర్‌ జగన్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ పాఠాలు చెప్పి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేలా సహకరించారని తెలంగాణ కేసిఆర్‌ సక్సెస్‌ కావడమే కాకుండా ఎపీలో జగన్‌ను సైతం తానే విజయం బాట పట్టించాడని, అనుకున్న రీతిలో జరిగితే ఇద్దరికి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికసంఖ్యలో ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సైతం టిఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలు కీలకం కానున్నాయనే తెలుస్తుంది. కేంద్రంలో ఒకవేళ హంగ్‌ చాన్స్‌ ఉంటే వీరు కీలకం కావడంతోపాటు, ఇటీవల మోడ శత్రువునైనా కలుపుకుంటామని అనడంతో వీరు ఎన్డీయే వైపు మొగ్గుచూపుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తానికి ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుపు గుర్రం ఎక్కబోతుందనే భయం బాబులో కనపడుతుందని టిడిపిలో సైతం చర్చజరుగుతోందట.

ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ – పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది

ఓటు ‘పడిపోయింది’

కౌంట్‌ ‘డౌన్‌’

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం బాగానే పడిపోయింది. ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు కనిపించలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలన్ని దాదాపు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించిన ఆశించిన మేరకు పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఓటర్లను చైతన్యం చేసి వాహనాల్లో తరలించేందుకుగాను, వాహనం సౌకర్యం కల్పించేందుకుగాను అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతోపాటు గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండి చదువు, ఉద్యోగం నిమిత్తం నగరాల్లో ఉంటున్న వారు సైతం ఓటుహక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు రాలేదు. దీంతో కొన్ని గ్రామాల్లో ఉన్న ఓట్లలో 50శాతం కూడా నమోదు కాలేదు. కారణంగా మొత్తంగా పోలింగ్‌ శాతం 60దాటకుండా పోయింది.

ఆసక్తి చూపని హైదరాబాదీలు

ఓటు వేయడానికి భాగ్యనగరవాసులు ఈసారి అంతగా ఆసక్తి కనబర్చనట్లే కనపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోనే అత్యత్పంగా పోలింగ్‌ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో 39.49, సికింద్రాబాద్‌లో 39.20శాతం నమోదు అయ్యింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పార్లమెంట్‌ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపనట్లు కనపడుతోంది.

మెదక్‌లో అత్యధికం

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా శాతాలు పరిశీలిస్తే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 68.60శాతం పోలింగ్‌ అత్యధికంగా నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లో ఓటు వేయడానికి ఓటర్లు కాసింత ఆసక్తి చూపినట్లే కనపడింది.

నిజామాబాద్‌లో 54.20శాతం

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 54.20శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ నుంచి కేసీఆర్‌ తనయ కవిత బరిలో నిలువగా రైతులు అత్యధిక సంఖ్యలో నామినేషన్‌ వేశారు. దీంతో ఈ స్థానంలో పోలింగ్‌ శాతంపై ఆసక్తి ఏర్పడింది.

నగదు పంపిణీ కారణమేనా…?

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు నగదు పంపిణీ చేయకపోవడం పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణంగా కొంతమంది చెపుతున్నారు. అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం అధికంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఈ ప్రవాహం అధికంగా లేకపోవడంతో కొంతమంది ఓటర్లు ఓట్లు వేయడానికి నిరాసక్తత ప్రదర్శించారని కొందరు అంటున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఓటుకు వంద ఇవ్వడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణవ్యాప్తంగా పోలింగ్‌ శాతం వివరాలు

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5గంటల సమయానికి అత్యధికంగా మెదక్‌, కరీంనగర్‌లో పోలింగ్‌ శాతం నమోదు కాగా.. హైదరాబాద్‌ జంట నగరాల్లో అత్పల్పంగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌ 39.49

మల్కాజ్‌గిరి 42.75

మెదక్‌ 68

మహబూబ్‌నగర్‌ 65

నాగర్‌కర్నూల్‌ 57.12

పెద్దపల్లి 59.24

సికింద్రాబాద్‌ 39.20

వరంగల్‌ 59.17

నల్గొండ 66.11

ఆదిలాబాద్‌ 66.76

ఖమ్మం 67.96

కరీంనగర్‌ 68

చేవెళ్ల 53.08

భువనగిరి 68.25

మహబూబాబాద్‌ 59.90

నిజామాబాద్‌ 54.20

 

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది

– పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

– శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి…

నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ బరిలో ఉండగా, నర్సంపేట నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వస్తాయని భావించినట్లు సమాచారం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేయగా ఆయనకు 1476ఓట్లు (0.78శాతం) మాత్రమే నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ పార్టీ రెండవస్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మూడవస్థానంలో ఉండగా, ఎడ్ల అశోక్‌రెడ్డికి నాల్గవ స్థానం లభించింది. దీనికి కారణం అభ్యర్థి ఎడ్ల అశోక్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కలుపుకోకపోవడమే కారణమని పలువురు నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలకు ముందు నర్సంపేట పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా 1500మంది కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలపగా ఓటింగ్‌ శాతం మాత్రం ఎందుకు తగ్గిందని నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్‌శాతం పెరిగేనా అని పలువురు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పట్టిపట్టనట్లుగా ఉంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ ఓటింగ్‌ శాతం పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించేనా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా ..

ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.

నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో

వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో పాల్గొని కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందఠంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ముందు సమన్వయం లేకపోవడం వలనే ప్రచారాలు కూడా చేసుకోలేక పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం బలవంతంగా సీటు కేటాయించాలని పత్రికల ప్రకటనలు బలరామ్‌నాయక్‌ చెసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారని, ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపు ఖాయమని అన్నారు.ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం కషి చేయాలని సూచించారు .

పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద బిడ్డగా ఉంటానని తెలిపారు. ఆడబిడ్డగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు .నర్సంపేట నియోజకవర్గ అభివద్ధి కోసం నర్సంపేట కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాల్టీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పొన్నం మొగిలి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి సానబోయిన రాజకుమార్‌, మనోహర రెడ్డి, సంజీవరెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఆకుల శ్రీనివాస్‌, బానోతు సారంగపాణి, అజయ్‌ కుమార్‌, రాయిడి రవీందర్‌రెడ్డిలతోపాటు అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.

 

కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం

– ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి

– కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు

– ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌

– ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు

– దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…?

– గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…?

– త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం…

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని భూమిని అన్యాయంగా కబ్జాచేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ, అదే స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న ఓ కబ్జాకోరు నేటిధాత్రి కార్యాలయంపై దాడి చేసేందుకు తన కబ్జాగ్యాంగ్‌ను ఉసిగొల్పాడు. బరితెగించి సామాన్యుని భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ నీచపు పనిని సామాన్యుడి తరపున ‘నేటిధాత్రి’ ప్రశ్నించినందుకు దాడి చేసుందుకు రెక్కి నిర్వహించారు. గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఐదు మోటారు సైకిళ్లపై మోటాదర్కార్లు నేటిధాత్రి కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసిఉండడంతో పక్కనే ట్రాన్స్‌ఫోర్టులో పనిచేసే ఓ హమాలీ కార్మికుడిని ఎప్పుడు వస్తారు…; ఎప్పుడు వెళ్తారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

ఇంత ధైర్యం ఎక్కడిది

కాసేపు బిల్డర్‌నంటూ బిల్డప్‌ కాదు, కాదు పైనాన్సర్‌ను అంటూ బిల్డప్‌ ఇచ్చే హనుమంతరావు అనే వ్యక్తి ‘నేటిధాత్రి’ కార్యాలయానికి సైతం ఫోన్‌చేసి బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో రమ్మని అనడంతో తగ్గిన సదరు బిల్డర్‌ అలియాస్‌ కబ్జాకోరు. గురువారం రాత్రి దాడి చేసేందుకు తెగించాడు. అయితే అతనికి ఇంత ధైర్యం ఎక్కడిది…? కబ్జా వెనకాల ఉండి అంతా నడిపిస్తూ గ్రేటర్‌ వరంగల్‌లో కబ్జా కథలన్నింటికి సూత్రధారి అయిన ఎమ్మెల్యే తమ్ముడి అండ చూసుకునే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. వీరు కబ్జా చేసే దగ్గర బాధితులను బెదిరించేందుకు ఉపయోగించుకునే చిల్లర రౌడీమూకలను ‘నేటిధాత్రి’ కార్యాలయం పైకి ఎమ్మెల్యే తమ్ముడే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కబ్జాలు8 చేయడానికే ఈ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంటూ బలవంతంగా బాధితులను బెదిరించి దాడులతో లొంగదీసుకుని భూములను కబ్జా చేసేందుకు ఈ ముఠాను ఎమ్మెల్యే తమ్ముడు పెంచి పోషిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈ గ్యాంగ్‌ గతంలో అనేకమందిని బెదిరించి దాడులకు దిగి భూములను కబ్జా చేశారని విశ్వసనీయ సమాచారం. బాధితులను బెదిరించినట్లే ‘నేటిధాత్రి’ని బెదిరించాలని చూశౄరు.

బెదిరింపులకు లొంగుతామా…?

జనం పొట్టగొట్టి, పాపాలు మూటగట్టుకుని సంపదను పోగేయాలనుకుంటున్న వారి బెదిరింపులకు ‘నేటిధాత్రి’ ఎప్పుడు లొంగదని గుర్తుంచుకోవాలని సామాన్యులను బెదిరించి భూములు కబ్జా పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి కోట్లు కూడబెట్టి ప్రజాప్రతినిధిని అంటూ నిసిగ్గుగా చెప్పుకుంటూ తిరుగుతున్న గోముఖ వ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యయుతంగా అక్షరాలతో గట్టి సమాధానమే చెప్తాం.

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు? కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు

– వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న కొందరు అక్రమ ఎర్నలిస్టులు

– ఇక నెక్ట్స్‌ తమ అవినీతి బయటపడుతుందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు

– తనపై వార్తకథనం వస్తే దాడికి సిద్దంగా ఉండాలంటూ తన ఉద్యోగులకు సూచించిన ఓ సీనియర్‌ ఎర్నలిస్టు…?

– అంతా తాను చూసుకుంటానని అభయహస్తం

– కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : వరుస కథనాలతో కబ్జాయిస్టులు, అక్రమ ఎర్నలిస్టుల వెన్నులో వణుక పుట్టిస్తున్న ‘నేటిధాత్రి’ని బెదిరింపులతో లొంగదీసుకోవచ్చని భావిస్తున్నారు. కొంతమంది తెలివి తక్కువ పిరికి మనుషులు, అవినీతిపరుల కథనాలు అన్ని ప్రచురితం అవుతున్నాయి. ఇక తరువాయి తమపైన వార్త వస్తుందంటూ గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులు. జర్నలిజం ముసుగు కప్పుకుని తమ చుట్టూ ఉండే భజనపరులకు, అక్షరం ముక్కరాని వారికి గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్లు ఇప్పించి సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలకు గ్రేటర్‌ నగరంతో మొదలుకుని వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తం తిప్పుతూ సామాన్యులను బెదిరిస్తున్న వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయట. మీడియా పేరుతో కేవలం పోలీస్‌స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో తిష్ట వేసి అవినీతి దందాలతో తమ బినామీల ద్వారా అక్రమార్జనకు పాల్పడుతూ సీనియర్‌ జర్నలిస్టులుగా చెప్పుకునే కొంతమంది యూనియన్ల పేరుతో మేథావుల్లా ఫోజులు కొట్టేవారు, తమపై ఎప్పుడు కథనం వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారట. అక్రమాలతో తమకు అసలే సంబంధం లేదని తాము ‘పత్తి ఇత్తులం’ అని చెప్పుకునే వీరు తమపై కథనం వస్తుందని ముందుగానే ఊహించుకోవడం అక్రమార్కులుగా వీరికి, వీరే గుర్తించుకున్నారని స్పష్టం అవుతుంది.

జర్నలిజం ముసుగులో వార్తలు రాయడం తప్ప అన్ని పనులు వెలగబెట్టే ఈ స్వయం ప్రకటిత మేథావుల వల్ల ఒక్క గ్రేటర్‌ నగరంలోనే మూడువందలకుపైగా చదువులేని వారు తమ పేరు తాము రాయలేని వారు, జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు ప్రముఖ జర్నలిస్టులుగా ఫోజులు కొడుతున్నారట. వీరికి ఈ స్వయం ప్రకటిత మేథావులు తెరవెనుక సహకరిస్తూ అఇడిటేషన్లు సైతం ఇప్పించారంటే ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం అవుతుంది. నోరు విప్పితే నీతులు, జర్నలిస్టుల అభివృద్ధి పోలీసు పరిచయాలు అంటూ సుద్దపూసలా నీతులు వల్లించే ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఐతే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తికి, అక్రమ బిడీ వ్యాపారం చేసే వ్యక్తికి, ప్లెక్సీ ప్రింటింగ్‌, ప్రెస్‌ నడుపుతున్న వ్యక్తులకు అక్రిడిటేషన్‌ ఇప్పించి రోజు సాయంత్రం కాగానే వారితో నగరంలోని ఓ బార్‌షాప్‌లో తాగి తందానలాడుతాడట. దురదృష్టం ఏంటంటే అరకొర తెలివితేటలు గల ఇతగాడు తానే ప్రముఖ జర్నలిస్టుగా ఫోజులు కొట్టడం, అధికారులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి కావాల్సింది దండుకోవడం ఇతగాడికి అలవాటుగా మారిపోయిందట.

గ్రేటర్‌ వరంగల్‌లో పెట్రోల్‌బంక్‌లు మొదలుకుని బార్‌షాపులు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు వద్ద నుంచి నెలవారి మాముళ్లు దండుకునే ఇతగాడు మీరు ఎలాగైన వ్యాపారం చేస్కోండి నీను ఉన్నా అని అభయహస్తం అందించాడట. దీంతో నాణ్యత సరిగా లేకున్నా, కల్తీ జరిగినా వినియోగదారులు నిలదీస్తే, మిగతా జర్నలిస్టులు ఇదేంటని జనంపక్షాన ప్రశ్నించిన, ఈయన గారికే ఫోన్‌ వస్తుందట. సెటిల్‌మెంట్‌ జరిగిపోతుందట. ఓ సీనియర్‌ జర్నలిస్టుకు పెట్రోల్‌బంక్‌ మోసం విషయంలో ఇతగాడి నుంచి స్వీయ అనుభవం కలిగిందట. జర్నలిజం తప్ప, ఆ ముసుగులో అన్ని శాఖల బాధ్యతలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహిస్తూ సెటిల్‌మెంట్‌ దందాల్లో ఆరితేరిన ఇతగాడిపై అధికారులు, ఏ మాత్రం చర్యలు తీసుకోరు. వీరి ఆగడాలు నగరంలో శృతిమించుతున్న ఇంటెలిజెన్స్‌ మొదలుకుని ఏ నిఘాసంస్థ అధికారులు వారి శాఖకు కనీసం విషయాన్ని కూడా చెప్పరు. కారణం ఇతగాడి జర్నలిజం ముసుగు.

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి

– కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

– అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు

– మున్సిపల్‌ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్‌ గిరి

– భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే

– ఎవరి డివిజన్‌లో వారిదే రాజ్యం

– ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్‌ గిరి నడుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్‌లలో వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. ఎన్నికల వేళ కాళ్లవేళ్ల పడి గెలిపించాలని అందరిని వేడుకున్న కార్పొరేటర్లు ఇప్పుడు ఓట్లేసిన జనాన్నే ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు అయితే ఏకంగా తాము ఎన్నికల్లో ఖర్చుపెట్టామని ఇప్పుడు సంపాదించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. ఓట మల్లన్న…బోడ మల్లన్న సామెతను బాగా ఒంట బట్టించుకున్న కొందరు కార్పొరేటర్లు డివిజన్‌లలో తమ రాజ్యాన్ని నడుపుతున్నారట. తమకు తెలియకుండా ఎంతమాత్రం అభివృద్ధి పనులు జరగరాదని, డివిజన్‌లో ఉన్న ప్రజలు సైతం నిర్మాణాలతో సహ ఎలాంటి పనులైన చేయరాదని అలా చేయాలంటే తమకు కావాల్సింది ముట్టజెప్పాల్సిందేనని తెల్చి చెపుతున్నారట. గతంలో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుత కార్పొరేటర్లు డివిజన్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారని, ఇంటి నిర్మాణం, గొడవలు, వ్యక్తిగత విషయాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ తదితర విషయాలలో తల దూర్చుతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు గ్రేటర్‌ వరంగల్‌ వ్యాప్తంగా వినబడుతున్నాయి.

ప్రతి పనికో రేటు…?

డివిజన్‌లలో కార్పొరేటర్లు ప్రతి పనికో రేటు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. జనన, మరణ ధృవీకరణ పత్రం మొదలుకుని ఇంటి నిర్మాణ అనుమతుల వరకు వీరి జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా ఉన్న వారు, లేని వారు అనే తారతమ్యాలు లేకుండా డివిజన్‌లో ప్రజలకు కార్పొరేటర్‌తో పని పడింది అంటే చాలు తమకు కావాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో డివిజన్‌ ప్రజలు స్థానిక కార్పొరేటర్ల పేరు చెపితేనే వామ్మో…అంటున్నారు.

అధికార్లు సహకరిస్తే సరీ…!

‘కార్పొరేటర్‌ గిరి’తో డివిజన్‌లలో అధికారులకు వేధింపులు ఎక్కువైనట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్‌లలో ఇంటి నిర్మాణ పనుల అనుమతి విషయాలలో కార్పొరేటర్లు చేతివాటానికి అలవాటుపడ్డారట. డివిజన్‌లో ఎవరు నిర్మాణ పనులు మొదలుపెట్టిన పిల్లర్‌కు ఇంత అని నగదు ముట్టజెప్పాలట. నిబంధనల ప్రకారం అన్ని ఉన్న కార్పొరేటర్‌కు సమర్పించేది సమర్పించాలి లేదంటే భవన యజమాని, అధికారులపై కార్పొరేటర్లు కేకలు వేస్తారు. వాటా ముట్టజెప్పందే నిర్మాణాన్ని కొనసాగనిచ్చేది లేదని తెల్చి చెబుతారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్పిన కార్పొరేటర్లు వినరు. ఏది ఏమైనా తమకు నగదు ముట్టజెప్పాల్సిందేనని నానా ఇబ్బందులకు గురిచేస్తారట. ఇటీవల హన్మకొండలోని ఓ డివిజన్‌లో ఓ కార్పొరేటర్‌ అధికారిపై ఇలాంటి ప్రతాపాన్నే చూపాడట. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారి దగ్గర నుంచి అధికారే నగదు వసూలు చేసి అప్పగించాలని ఆదేశించాడట. ఆ అధికారి ససేమిరా అనడంతో ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఆ అధికారిని సరెండర్‌ చేయాలని నిర్ణయించి, సమావేశంలో తీర్మాణం చేయించి పనికినిచ్చాడట.

ఆ అధికారితో సహా మొత్తం ఐదుగురు ఇటీవలే గ్రేటర్‌ పాలకమండలి సరెండర్‌ చేస్తూ తీర్మాణం చేసింది. అధికారులు తమకు సహకరిస్తే సరి లేదంటే బదిలీలు, సరెండర్‌లు కార్పొరేటర్లు అనుసరిస్తున్న అవినీతి విధానాలతో సక్రమంగా, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని భూకబ్జాలు, అక్రమ వసూలును అడ్డుకున్నందుకే ఐఎఎస్‌ అధికారి గౌతమ్‌ను కార్పొరేటర్లు, ఇతరులు కలసి బదిలీ చేయించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కొంతమంది కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. డివిజన్‌లు వీరి రాజ్యం అయినట్లు, ప్రజలను దోచుకునేందుకు వీరికి ఎవరో లైసెన్స్‌ ఇచ్చినట్లు ఇష్టారీతిన వ్యవహారిస్తూ అటు అధికారులను, ఇటు డివిజన్‌ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న కార్పొరేటర్‌లకు రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పి ప్రజలదే అంతిమ విజయం అని నిరూపిస్తామని కార్పొరేటర్‌గిరికి పులిస్టాప్‌ పెడతామని పలువురు ప్రజలు అంటున్నారు.

…………………………………..

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

ఒక ‘లక్ష్య’ం ముగ్గురి భవితవ్యం

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి

మరోమారు కుడా చైర్మన్‌ కొరకు మర్రి

అధినాయకత్వం భరోసా,సముచితస్థానం కొరకు మార్నేని

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

వర్ధన్నపేట,నేటిధాత్రి: ఒక ఎన్నిక లక్ష్యం నెరవేర్చి అధినాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ ముగ్గురు ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో శాయశక్తులా పని చేస్తున్నారు. నిర్ధేశిత లక్ష్యంను అధిగమించి తమ కార్యదక్షతను చూపెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక ఎన్నిక ముగ్గురి భవిష్యత్తుగా మారమేంటి అనుకుంటున్నారా. అవును ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.వారిలో ఒకరు రాష్ట్రంలో వరుసగా రెండోమారు శాససభ్యునిగా రెండవ అతిపెద్ద మెజారిటి సాధించిన అరూరి రమేష్‌, మరోకరు కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు ,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు .అందరు ప్రస్తుతం పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంకా వారి భవితవ్యం ఎంటనుకుంటున్నారా.ఉంది దాని కోరకు ప్రస్తుతం వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్‌లు,వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల సంధర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ భాద్యతలు నిర్వహిస్తున్న కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు పాటుపడుతున్నారు.

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి రమేష్‌…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండవమారు శాసనసభ్యునిగా ఉన్న అరూరి రమేష్‌ మంత్రివర్గంలో స్థానం కోరకు మంత్రివర్గ విస్తరణకు ముందు విశ్వప్రయత్నాలు చేశారు. స్థానిక ప్రజల్లో కూడా ఈ విషయమై విస్తరణకు ముందు మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా జరిగింది.వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజారిటి సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అధినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరిని రాజకీయ గురువుగా అరూరి రమేష్‌ భావిస్తారు. కాబట్టి తనకు మంత్రి పదవి వచ్చితీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ మారు అత్యధిక మెజారిటితో విజయం ఇస్తే రానున్న ప్రభుత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మంత్రి ఉంటాడనే అంశాన్ని కూడా ప్రచారంలో ప్రధానంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఎన్నికల అనంతరం జరగబోయే విస్తరణలో అవకాశం చేజారకుండా ఉండేందుకు గతంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పోటి చేసిన కడియం శ్రీహరి,పసునూరి దయాకర్‌ల కంటే అధికంగా మెజారిటి వచ్చే విధంగా చూడాలని తద్వారా అధిష్టానం దృష్టిని ఆకర్షించి అవకాశం పొందాలనే లక్ష్యంతో అరూరి రమేష్‌ ముందుకు వెళుతున్నారు.నిర్దేశిత లక్ష ఓట్ల మెజారిటి సాధించి శాసనసభ్యుని నుండి మంత్రిగా మారాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోమారు ‘కూడా’ చేజిక్కించుకోవాలని…

ప్రస్తుతం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా ఉన్న మర్రి యాదవరెడ్డి పదవి కాలం మరో 8 నెలల సమయంతో ముగిసిపోతుంది.ఈ నెపథ్యంలో తనను మరోమారు కుడా కు చేర్మన్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అందు కోరకే ఆయన కూడా ప్రస్తుత పార్టమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన ఇంచార్జీ బాధ్యతలను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించి తన విధేయతను నిరుపించేందుకు పాటుపడుతున్నారు. అయితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నప్పటికి అర్బన్‌తో సహా,రూరల్‌ ప్రాంతం కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో భాగమై ఉండడం స్థానిక పార్టీ శ్రేణులు,కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.అయినప్పటికి స్థానిక ఎమ్మెల్యే అరూరి,మర్రి మిత్రుడు అయిన స్థానిక ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు కలుపుకుపోతూ వారి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎది ఎమైనా సాదించాల్పి లక్ష్యం చేరుకుని మరోమారు కుడా చైర్మన్‌గా కోనసాగాలన్నదే మర్రి యాదవరెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నది.

భవిష్యత్తుపై భరోసా కోరకు మార్నేని రవిందర్‌రావు…

గత రెండు ప్రభుత్వాల్లో పని చేసిన అమాత్యులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి .ప్రస్తుత గ్రామీణ,ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శిష్యుడిగా,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు.ఉద్యమ కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వనంతో ప్రస్తుత మండల కేంద్రం ఐనవోలులో బహిరంగసభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి స్థానికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం కోరకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉంది. అయితే తన రాజకీయ జీవితంలో స్థానికంగా ప్రజాక్షేత్రంలో అన్ని పదవులను చేపట్టి సేవ చేశారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా గాని జిల్లాలో గాని పార్టీ అధినాయకత్వం తప్పకుండా రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితుల్లో ఆ అవకాశం చేజారింది.అనంతరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్‌గా పిలువబడే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ చైర్మన్‌గా అవకాశం ఇస్తారని అధిష్టానం నుండి స్పష్టమైన హామి ఇచ్చినట్లు మార్నేని అనుచరులు బహిరంగంగానే చెప్పుకున్నారు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన తప్పనిసరి మార్కెట్‌ చైర్మన్‌లను రిజర్వేషన్ల ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. దాంతో చైర్మన్‌ పదవికి రిజర్వేషన్‌ కలిసి రాలేదు. అయితే అప్పటికే వర్ధన్నపేట ఎంపిపిగా ఉన్న మార్నేని నామినేటెడ్‌ పదవుల్లో అయినా అవకాశం ఇస్తారని ఆశించారు. కాని అది కూడా జరగలేదు. దాంతో ఎంపిపిగా కొనసాగారు. సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి అభ్యర్ధి ఎంపిక విషయంలో అనుహ్యంగా మార్నేని రవిందర్‌రావు పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. అధినాయకత్వం దృష్టిలో సమర్ధనాయకుడిగా,సీనియర్‌గా ఉన్నప్పటికి సామాజికకోణంలో మరోమారు అవకాశం చేజారింది.అయితే పార్టీ కార్యక్రమాల్లో,వచ్చిన ప్రతి ఎన్నికలను అనుకూల ఫలితాల కోరకు పాటుపడిన మార్నేని ఎంపిపిగా ఇంకో నెల రోజులు మాత్రమె కొనసాగుతారు.ఈ నెపథ్యంలో రాష్ట్రస్థాయిలో కాకపోయినా కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అయినా అవకాశం వస్తుందని అశించినప్పటికి రిజర్వేషన్‌ రూపంలో మరోమారు రవిందర్‌రావు,వారి అనుచరుల ఆశలను నీరుగార్చింది.దింతో పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికి భవిష్యత్తుపై నిలినీడలు కమ్ముకొవడం పట్ల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.తన భవిష్యత్తు గురించి సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసిన సంధర్భంగా తన భవిష్యత్తును గురించి మార్నేని ప్రస్తావించారని అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని రానున్న అవకాశాల్లో ప్రథమ స్థానంలో ఉంచి అవకాశం ఇస్తానని హామి ఇచ్చినట్లు చర్చ నడుస్తుంది.ఏది ఎమైనా స్థానికంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడికి భవిష్యత్తు భరోసా లేకపోవడం పట్ల స్థానిక ప్రజల్లో కొంత అసహనం ఉంది.ఇప్పటికైన తన భవిష్యత్తుపై భరోసా ఇచ్చి తనకు సముచితస్ధానం కల్పించాలనే లక్ష్యంతో మార్నేని రవిందర్‌రావు ఈ ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

ప్రధాని కావాలని లేదు

– వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని కేసిఆర్‌ అన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్‌, బిజెపి పార్టీలపై విరుచుకుపడ్డ ఆయన కేంద్రంలో చేతకాని వారే పాలిస్తున్నారని, ఈ దేశానికి అంతగా మంచిది కాదని, దేశంలో కాంగ్రెస్‌, బిజెపి లేని కూటమి రావాలని ఆయన ఆశించారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు గోల్‌మాల్‌ గోవిందంలాగా తయారయ్యాయని ప్రధానమంత్రిపై కేసిఆర్‌ విమర్శలు చేశారు.

చిన్నచిన్న సమస్యలు సైతం కేంద్రం దగ్గర పరిష్కారం కాకుండా ఉన్నాయని, గడ్డివాము దగ్గర కుక్కలాగా వారు సమస్యలను పరిష్కరించారు..మనవి పరిష్కరించుకోనివ్వరు అని అన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ అనవసరంగా పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. వరంగల్‌ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన ఉందని, పార్లమెంట్‌ ఎన్నికల తీర్పులో సైతం అగ్రభాగంలోనే ఉండాలన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తయారైందని, అనేక సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు పూర్తి దశకు వచ్చాయని, త్వరలోనే కాళేశ్వరం నుంచి సైతం బటన్‌ నొక్కితే నీళ్లు వచ్చేలా నిర్మాణం పూర్తవుతుందన్నారు.

ప్రధాని మోడీ గుజరాత్‌ రాష్ట్రంలో సైతం 24గంటల కరెంట్‌ అమలులో లేదని, తెలంగాణ రాష్ట్రం ఆ ఘనత సాధించిందన్నారు. ఎన్నికలు వస్తే గెలువాల్సింది పార్టీలు కాదని, ప్రజల అభిమతం గెలవాలని కేసిఆర్‌ అన్నారు. కేంద్రం తెలంగాణకు 35వేల కోట్లు ఇచ్చామని ప్రగాల్బాలు పలుకుతోందని, కేంద్రం మనల్ని సాకడం లేదని, కేంద్రాన్నే మనం సాకుతున్నామన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన కేసిఆర్‌ పసునూరి వివాదరహితుడని, నియోజకవర్గానికి కావాల్సిన పనులను చేయించుకునే సత్తా కలవాడన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో దేవాదుల, ఇతర ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా అంతా సస్యశ్యామలం కానుందన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులు తదితర అవసరాల కోసం కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య కేంద్రంలో పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version