చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోమంగళ వారం రోజున వరంగల్, ఖమ్మం,నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆభ్యర్ధి కొసం భారతీయ జనతా పార్టీ బలపరిచిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బిజెపి చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది అనంతరం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ
గత 40 సంవత్సరాలుగా ప్రజా జీవితానికి అంకితమై ఎన్నో ఒడిదుడుకులు ఏర్పరచుకొని విద్యార్థి దశ నుండి విద్యార్థి సమస్యల కోసం పోరాటం చేయడం జరిగిందని తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించారని ఒకే పార్టీని నమ్ముకుని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిలో ప్రేమేందర్ రెడ్డని ఆయన తన 40 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో సమస్యలు పరిష్కరించరని మేధావులు ఒకసారి ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించి ఈ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ సాద సదానందం యువ మెర్చ మండలాధ్యక్షుడు మైద శ్రీకాంత్ కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు రాయని శ్రీనివాస్ ఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కింసార పు ప్రభాకర్ చింతల రాజేందర్ లటికే స్వామి తదితరులు పాల్గొన్నారు.