# ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు వినతి పత్రం.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నర్సంపేట బస్ డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఏఐఎఫ్డీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ డివిజన్ లోని పాలు గ్రామాలకు పల్లె వెలుగు బస్సు బంద్ చేయడంతో పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు.నల్లబెల్లి మండలంలో ముంచింపుల, రంగాపురం,నందిగామ,రేలకుంట, ధర్మరపల్లి ,లెంకపల్లి బుచ్చిరెడ్డి పల్లె గ్రామాలకు, చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండా, గొల్లభామతండా, గొల్లపల్లి శంకర తండా, జల్లితండాలకు అలాగే నెక్కొండ మండల లో సూరిపెల్లి, చిన్నకోల్పోలు, పంతులుతండా, లింగగిరి శివారుతండాలకు బస్సు సౌకర్యాలు లేక కాళీ నడకన వస్తు పాఠశాలలకు కాలేజీలకు వెళ్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నర్సంపేట డిపో మేనేజర్ స్పందించి నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలలో బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి మార్త నాగరాజు కల్లపెళ్లి రాకేష్, సాంబారి అజయ్, కె అజిత్, విజయ్, గౌతమ్, రాకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.