యాక్సిడెంట్లు చేసి పోయే డ్రైవర్లే బీఆరఎస్ కు కావాలా?

వలసవాదులకు వందనం.. అవకాశవాదులకు అందలం!

సెకండ్ క్యాడర్ లేదా! జీవన్ రెడ్డి అవసరమా!?

ఆనాటి నుంచి ఇవే వ్యూహాత్మక తప్పిదాలు

`సంజయ్ కండువా మార్చుకుంటే, గులాబీ జెండా ఎగరేసే వాళ్ళు లేరా!

`జీవన్ రెడ్డి తెలంగాణా వాది కాదు..ఒక్కనాడు జై తెలంగాణా అన్నది లేదు!

`కరీంనగర్ నుంచి కెసిఆర్ కు పోటీగా ఆనాడు ఎవరూ దైర్యం చెయలేదు!

`మంత్రిగా వున్న జీవన్ రెడ్డి పోటీ చేశారు.

`బీఆరఎస్ చేతిలో పలుసార్లు ఓడిన జీవన్ రెడ్డి దిక్కయ్యరా!

`జీవన్ రెడ్డి రాజకీయం కాంగ్రెస్ లో మొదలు కాలేదు.

`అవకాశవాద రాజకీయం కోసం ఆనాడు పార్టీ మారాడు.

`ఇప్పుడు అదే పని చేస్తున్నాడు.

`తన వారసత్వ రాజకీయం కోసమే కండువా కప్పుకుంటున్నాడు.

`జీవన్ రెడ్డి వల్ల ఇబ్బందులు పడ్డ తెలంగాణా వాదులు ఎంతో మంది వున్నారు.

`కేసులు ఎదుర్కొన్న బిఆరఎస్ నాయకులు అనేకమంది వున్నారు.

`పాతికేళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న నాయకులు జగిత్యాల లో ఒక్కరు లేరా!

`సంజయ్ స్థానం భర్తీ చేసే శక్తి బిఆరఎస్ లో ఎవరికీ లేదా.

`తుమ్మలను తెచ్చిపెడితే ఖమ్మం ఖతమైంది?

`పువ్వాడను తెచ్చుకుంటే ఒక్క సీటు రాకుండా పోయింది.

`కడియంను నెత్తిన పెట్టుకుంటే వరంగల్ తుడిచిపెట్టుకు పోయింది.

`దానం తీసుకుంటే మొదటికే మోసమొచ్చింది.

`పార్టీని నమ్ముకొని వున్న వాళ్లకు జెండా మోసుడే మిగిలింది.

`ఆఖరుకు ఎమ్మెల్సీ ఎన్నికకు రాకేష్ రెడ్డి నీ తెచ్చుకుంటే రంబోలా అయ్యింది.

`జగిత్యాల కావాలని కవిత ఎన్నోసార్లు అడిగింది.

`ఏడేళ్ల పాటు జగిత్యాల అభివృద్ధి కోసం కవిత పాటు పడింది.

`కవితను కాదని సంజయ్ కి టికెట్ ఇస్తే కండువా మారింది.

`ఆఖరుకు కవిత బైటకు వెళ్లి పార్టీ పెడుతోంది.

`రిపేర్లు చేసే జనతా గ్యారేజ్ తప్ప కొత్త కార్లు బిఆరఎస్ లో తయారుకావా?

`కొత్త కార్లు తయారు చేసే శక్తి బిఆరఎస్ కు లేదా?

`షెడ్డుకు పోయిన కార్లు రిపేరు చేసి రోడ్డెక్కిస్తారా!

హైదరాబాద్, నేటిధాత్రి:

కోరి కోరి తెచ్చుకున్న వాళ్లెంతో మంది కొంప ముంచిపోయారు. నమ్మకంగా పనిచేసిన వాళ్లు పదవులు పోగొట్టుకొని కూడా పార్టీకి సేవ చేస్తున్నారు. నమ్మి అందలమెక్కిస్తే, నట్టెట ముంచి పోయిన వారున్నారు. గాలి వాటం నాయకులకు పదవులు పంచారు. జెండా మోసినోళ్లు ఇంకా పార్టీలో బోయిలుగా మిగిపోయిన వాళ్లు ఎంతో మంది వున్నారు. పార్టీలోకి వచ్చిన పదవులు పొందిన, పనికి రాని వాళ్లకోసం వాళ్లు పల్లకిలు మోస్తూనే వున్నారు. అవకాశవాదులను అందలమెక్కించారు. వలస వాదులకు జేజేలు కొట్టే బానిసలుగా మారి కార్యకర్తలుగానే మిగిలిపోయిన వాళ్లున్నారు. తిట్టిన నోర్లుకు తీపి చేశారు. పొగిడిన నోళ్లకు చేదు చెక్కర మిగిల్చారు. ఇది ఇప్ప్పుడు బిరఎస్ నాయకుల్లో, కార్యకర్తలో, పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారుల్లో వున్న అసహనానికి నిదర్శనం. పైకి చెప్పలేక, తమ బాధనలు చెప్ప్పుకోలేక మధనపడుతున్న వాళ్లు ఎంతో మంది వున్నారు. ఆది నుంచి జెండా మోసిన వాళ్లు వచ్చే వాళ్లను చూస్తున్నారు. పోయే వాళ్లను చూస్తున్నారు. మధ్యలో వచ్చి పదువులు అనుభవించిన వారిని చూస్తున్నారు. మధ్యలో వచ్చి పెత్తనం చేసిన వాళ్లను చూస్తున్నారు. ఆఖరుకు వచ్చిన వాళ్లు ఊడిగం చేయించుకుంటే చేసిన వాళ్లున్నారు. పార్టీ కోసం అన్నీ దిగమింగుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతో మంది వున్నారు. పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి, కుర్చీల్లో కూర్చొని, ప్రభుత్వం పోగానే వెళ్లిపోయిన వాళ్లను చూస్తున్నారు. పార్టీ ఓడిపోతుందని తెలిసి వెళ్లిన వాళ్లను చూస్తున్నారు. ఆఖరుకు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడ కూడా మోసం చేసిన వెళ్లిన వాళ్లను ఆ కళ్లతో కరుడు గట్టిన కార్యకర్తలు చూస్తూనే వున్నారు. కార్యకర్తలు మాత్రం అక్కడే నిలకడగా వున్నారు. పార్టీ మాకేం చేసిందని కాకుండా, మేమే పార్టీకి చేస్తున్నామనే భావనతోనే జెండా మోస్తున్నారు. అలాంటి వారిలో ద్వితీయ శ్రేణినాయకులు ఎంతో మంది వున్నారు. వారు తమకు జీవిత చరమాంకం వరకైనా అవకాశం రాదా? అని ఎదురుచూస్తున్న వాళ్లు కూడా వున్నారు. కొత్తనీరు వచ్చింది. కాని అవకాశవాద నీరు వస్తూనే వుంది. పోతూనే వుంది. అసలైన నీరు పార్టీని పట్టుకొని వుంది. గత రెండేళ్ల కాలంగా పార్టీకోసం ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. వారిని కాదని ఇంకా వలసవాదులను పార్టీలోకి తెచ్చుకోవడంతో మారి మనసు ఘోషిస్తోంది. మేమేం పాపం చేశామని వారి మనసు కన్నీరు పెడుతోంది. బిఆరఎస్ పార్టీ అనేది తెలంగాణ కోసం ఉద్యమ కారులనే తయారు చేసింది. తెలంగాణ భావనను మేలు కొలిపింది. తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని వున్న ఆశలకు రెక్కలు తొగింది. వీరులను చేసింది. పోరాట యోధులను చేసింది. తెలంగాణ సాదనలో మమేకమయ్యేలా చేసింది. కాని పార్టీ కార్యర్తలను తయారు చేయలేదా? యువతరాన్ని తీసుకురాలేదా? ఉద్యమ కాలం నుంచి పార్టీకోసం పనిచేస్తున్న నాయకులు ఎన్నికలకు పనికిరారా? అసంబ్లీలో అడుగుపెట్టే అర్హత వారికి లేదా? ఇప్పటికీ రాజకీయం షెడ్డుకుపోయిన జీవన్‌రెడ్డి లాంటి వారే పార్టీ కావాలా? అని అనేక మంది కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండేళ్లకాలంలో పార్టీ ఎంతో బలంగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినా, తర్వాత కాలంలో ఎంతో పుంజుకున్నది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిఆరఎస్ తన సత్తా చాటింది. ఇవే స్దానిక సంస్ధల ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరిగితే బిఆరఎస్ ప్రభంజనమే సష్టించేది. అలా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది వున్నారు. వారిని ప్రోత్సహిస్తే తెలంగాణలో మరే పార్టీకి చోటుండదు. బిఆరఎస్ పార్టీకి తిరుగుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్ అనే నాయకుడు అందర్నీ నమ్ముతాడు. ఆ బలహీనతే అనేకు వ్యూహాత్మక తప్పిదాలకు దారి తీస్తుందని చెప్పక తప్పదు. మరో వైపు నమ్మాల్సిన సమయంలో ఎవరినీ నమ్మరు? నమ్మకూడని సమయంలో అందర్నీ నమ్ముతారనే అపవాదు కేసిఆర్ మీద వుంది. ఎందుకంటే 2004 ఎన్నికల్లో ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసిన సంగతి తెలిసింది. వారిలో కొంత మంది మంత్రులు కూడా అయ్యారు. వారిలో ఒక్క హరీష్‌రావు తప్ప ఆ నాటి నాయకులు ఎవరైనా పార్టీలో వున్నారా? ఏరి కోరి ఎమ్మెల్యేలను చేస్తే ఆ సమయంలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ కండువా కప్ప్పుకున్న వాళ్లున్నారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డిని ఎమ్మెల్యేలను చేస్తే వైఎస్ వల్ల తెలంగాణకే అన్యాయం చేసి, కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత సమైక్య రాష్ట్రమే మేలని అన్నారు. ఇప్పటికీ ఆయన సమైక్య రాష్ట్ర జపమే చేస్తున్నాడు. తెలంగాణ ఇంత అభివద్ది జరిగినా ఉమ్మడి రాగమే అందుకుంటారు. అలా తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వారిని ఎంచుకున్నట్లైంది. ఆ అనుభవం ఆదిలోనే కేసిఆర్‌కు ఎదురైంది. అయినా ఆయన ఆ దారి మానుకోలేదు. జడ్పీచైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి సంతోష్‌రెడ్డి అనే నిజామాబాద్ జిల్లా నాయకుడిని మంత్రిని చేస్తే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఒకప్ప్పుడు ఎంపిగా పనిచేసిన నాయకుడు విజయరామారావును తెచ్చి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలను చేసి, మంత్రిని చేస్తే ఓడిపోయారు. బిఆరఎస్‌కు దూరమయ్యారు. బండారు శారారాణి, మందాడి సత్యనారాయణ , దుగ్యాల శ్రీనివాసరావు ఇలా చాలా మంది వున్నారు. 2014 ఎన్నికల సమయంలో రాజకీయం అయిపోయిందనుకున్న తుమ్మల నాగేశ్వరరావు ఆసుపత్రిలో వుంటే పరామర్శించి వచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రిని చేశారు. పాలేరు ఉప ఎన్నికలో నిలబెట్టి మళ్లీ ఎమ్మెల్యేను చేశారు. ఆ నియోజకవర్గంలో తొలి ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. తొలి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేశారు. అయినా తుమ్మల ఓడిపోయారు. కాని ఏమైంది? తనను అన్యాయం జరిగిందని వెళ్లిపోయారు. పదిహేనేళ్ల క్రితమే రాజకీయంగా తెరమరుగు కావాల్సిన నాయకుడికి భవిష్యత్తు ఇచ్చారు. అదే సమయంలో ఏ బిఆరఎస్ నాయకుడిని తయారు చేసినా ఖమ్మంను కంచుకోట చేసేవారు. తర్వాత కూడా అదే తప్ప్పు మళ్లీ చేశారు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డిని తీసుకున్నారు. మంత్రిని చేశారు. కాని ప్రభుత్వం పోగానే పార్టీ మారిపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్యెలేగా మొదటి సారి గెలిచి, అధికార పార్టీకన్నా తెలంగాణ ఉద్యమమే మిన్న అని రాజీనామా చేసిన రాజయ్య వచ్చారు. ఉద్యమానికి అండగా నిలిచారు. తొలి ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఏమైందో తెలియదు. కాని ఆయనను తప్పించారు. తెలంగాణ డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత చేరిన కడియం శ్రీహరిని ఎంపిచేశారు. ఎమ్మెల్సీని చేసి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. తర్వాత రాజయ్యను పక్కన పెట్టి కడియంను నమ్మారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆఖరు ఎంపి ఎన్నికల్లో ఆయన కూతురుకు కూడా బిఫామ్ ఇచ్చారు. అయినా ఆయన పార్టీని కాదనుకొని వెళ్లారు. ఇప్ప్పుడు మళ్లీ రాజయ్యే పార్టీని కాపాడుతున్నాడు. తెలంగాణ వద్దే వద్దు. తెలంగాణ ఇచ్చేది వుంటే హైదరాబాద్‌ను యూటిని చేయాలిన శ్రీ కష్ణకమిటీకి నివేదిక ఇచ్చిన ఏకైక వ్యక్తి దానం నాగేందర్. తెలంగాణ వాదులను తరిమిన చరిత్ర కూడా వుందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉద్యమ కాలంలో వినిపించిన ఏకైక పేరు గోవర్ధన్‌రెడ్డి. ఆయన చేసినంత ఉద్యమం మరే నాయకుడు హైదరాబాద్‌లో చేయలేదు. కాని ఆయనకు ఏం మిగిలింది. ఇప్పటికీ ఎదురుచూపులే దిక్కయ్యాయి. కాని దానం నాగేందర్ పార్టీలో చేరారు. రెండు సార్లు మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ప్రభుత్వం పోగానే మళ్లీ కాంగ్రెస్ కండువా అందరికంటే ముందే కప్ప్పుకున్నారు. అయినా కేసిఆర్‌లో మార్పు రావడం లేదన్న మాటలే పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా నుంచి జీవన్ రెడ్డిని ఆహ్వనించారు. ఆయన తెలంగాణ వాది కాదు. జై తెలంగాణ అని ఉద్యమ కాలంలో ఎన్నడూ అన్నది లేదు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయి, నాదేండ్ల వర్గానికి వెళ్లి, నెల రోజుల మంత్రి పదవి పొందారు. నమ్మిన ఎన్టీఆర్‌కు ఆయన వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ పార్టీలో అడిగిన ప్రతీసారి టికెట్ ఇచ్చారు. అందుకే ఇంత కాలం ఆయనపార్టీలో వున్నారు. ఆఖరుకు తన పెత్తనం నడవడం లేదని బైటకు వస్తున్నారు. కారెక్కుతున్నారు. అది కూడా తన కోడలుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కదన్న ఉద్దేశ్యంతోనే వస్తున్నారు. అంతే కాని బిఆరఎస్ అంటే ప్రేమతో కాదు. కేసిఆర్ అంటే అభిమానంతో కాదు. కేవలం అవకాశవాద రాజకీయాల కోసమే ఆయన వస్తున్నారు. ఇదే జగిత్యాల టికెట్ కోసం కవిత నిజామాబాద్ ఎంపిగా వున్న కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అటు నిజామాబాద్, ఇటు జగిత్యాల అభివద్దికోసం పనిచేశారు. ఆ ప్రగతి స్పుంయ్ ఖాతాలో పడింది. టికెట్ ఆయనకే వచ్చింది. కవితకు నిరాశే మిగిలింది. ఒక రకంగా అన్యాయం కూడా జరిగింది. జగిత్యాల కవితకు ఇస్తే ఆనాడే గెలిచేది. వరుస గెలుపులు చూసేది. పార్టీకి కొండంత అండగా నిలిచేది. ఆమె డిల్లీకి వెళ్లేది కాదు. లేనిపోని కేసుల్లో ఇరుక్కునేది కాదు. రాష్ట్రంలో బిఆరఎస్‌కు బలమైన మహిళా నేత అయ్యేవారు. గత ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయేది కాదు. ఇప్పటికైనా సరే అవకాశ వాదులను అక్కున చేర్చుకోకండి. వలస వాదులను మీరే ఎదురెల్లి ఎదుర్కొకండి. బిఆరఎస్‌లో ఎంతో మంది నాయకులున్నారు. బిఆరఎస్ అంటేనే కార్యకర్తలను తయారు చేసే కార్మాగారం. అంతే కాని షెడ్డుకు పోయిన కార్లను రిపేర్ చేసే జనతా గ్యారెజీని చేయకండి. పనికికాని నాయకులను తెచ్చి, అసలైన కార్యకర్తలకు అన్యాయంచేయకండి

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version