హరీష్ రావు తండ్రి దశదిన కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన దశదిన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ దుగ్గొండి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీష్ రావును హైదరాబాదులోకలిసి సంతాపం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి,సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ శాన బోయిన రాజ్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ తోటకూరి రాజు, భూంపల్లి రజనీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు పిండి కుమారస్వామి,బానోతు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
