కేతకీలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం…..

కేతకీలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం…..

◆-: దేవుళ్లకు నంది స్వాగతం

◆-: ధ్వజారోహణంతో మొదలైన ఉత్సవాలు..

◆-: ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్డీవో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ
ఆవరణలో పుట్టకు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి లోని పార్వతీ సమేత శ్రీ కేతకి సంగ మేశ్వరస్వామికి అభిషేకం, కుంకుమార్చన చేసి శిఖర పూజ నిర్వహించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు విచ్చేసి జయప్రదం చేయాలని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు.

 

 

 

అష్టతీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర దేవాలయంలో మహాశివ రాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు, అర్చకులు లోక కల్యాణార్థం ఆలయంలో బ్రహ్మోత్సవ శివసంకల్పం నిర్వ హించారు.

 

దేశం శాంతి, సౌభా గ్యాలతో విలసిల్లాలని, ప్రజలం దరూ ఆయురారోగ్య ఐశ్వర్యా లతో ఉండాలని కాంక్షిస్తూ వేద పండితులు మహాసంకల్పం చేశారు. కేతకి వనంలో సేకరిం చిన పుట్టమట్టిని ఆలయానికి తీసుకొచ్చి నవ ధాన్యాలను పుట్టమట్టిలో వేసి అంకురార్పణ చేశారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన వస్త్రంపై నంది చిత్రప టాన్ని దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప, ప్రధాన అర్చకులు బసయ్య స్వామి, అంజయ్య స్వాములు ఆవిష్కరించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. విఘ్నేశ్వర పూజ, స్వామివారికి రుద్రా భిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిం చారు. అనంతరం ఉదయం 11:49 గంటలకు కేతకి సంగమేశ్వర స్వామి ప్రధాన ఆలయ శిఖర పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహా రాష్ట్రల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక స్నానపు గదులు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ఆర్డీవో దేవుజా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హనుమంతరావు పాటిల్, ధర్మకర్తలు మల్లయ్యస్వామి, నవాజ్ రెడ్డి, సంగమేశ్వర్ పాటిల్, గాలప్ప పాటిల్, నాగేశ్వర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version