ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలలొ ఈసారి అబ్బాయిలది పై చేయి

*సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసిన ఆచార్య మల్లారెడ్డి.*
కేయూ క్యాంపస్
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ బీకాం ,బీఎస్సీ
విద్యార్థుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. గత నెలలో నిర్వహించిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి విడుదల చేశారు. ఇందులో బిఏ, బీకాం ,బీఎస్సీ , బిఏ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ మొదటి సెమిస్టర్ లో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 1220 , పరీక్షకు హాజరైన విద్యార్థులు 1172 , 39.59 శాతం పాస్ అయినారు. మూడవ సెమిస్టర్ బీఏ ,బీకాం, బీఎస్సీ, బిఏ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు1050 , పరీక్షకు హాజరైన విద్యార్థులు1006 , పరీక్ష పాసైన విద్యార్థులు 423, అనగా 42శాతం పాస్ అయినారు. ఐదవ సెమిస్టర్ లో బిఏ, బీకాం ,బీఎస్సీ లో అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఫిబ్రవరి 12వ తేదీ వరకు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫలితాలలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధిస్తున్నారు, కానీ ఈసారి ఎక్కువ మంది అబ్బాయిలు పాస్ అయినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. స్పోర్ట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మరియు అధునాతనమైన లైబ్రరీ సదుపాయంతో పాటు 112 మంది సుదీర్ఘమైన బోధన అనుభవం డాక్టరేట్ కలిగిన అధ్యాపకులతో పాటు 70 మంది నాన్ టీచింగ్ సదుపాయం కలిగిన ఈ కళాశాలను విద్యార్థులు సద్వినియోగ పరుచుకొని తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజు, సహాయక రిజిస్టర్ సరళ దేవి, పరీక్షలు విభాగం అధికారులు డాక్టర్ గిరిప్రసాద్, కళాశాల పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version