బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఓర్మాక్స్ నివేదిక ఎలా ఉందంటే…
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది. అప్పుడే ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది. అప్పుడే ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో బాక్సాఫీసుకు రూ.5,723 కోట్లు వసూళ్లు దక్కాయి. ఈ విషయం గురించి చెబుతూ శనివారం ఓర్మాక్స్ మీడియా (Ormax media) ‘ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్: జనవరి-జూన్ 2025’ (The India Box Office Report) పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.
‘జనవరి-జూన్ నెలల్లో విడుదలైన సినిమాల బాక్సాఫీసు రాబడి రూ.5,723 కోట్లుగా ఉంది. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం బాక్సాఫీసు దగ్గర వసూళ్లు 14 శాతం పెరిగాయి. ఇందులో భాగంగా 17 సినిమాలు రూ.100కోట్ల మార్క్‌ను దాటాయి’’ అని తెలిపింది.