రాధాకృష్ణ కు బొజ్జా తారకం వ్యాసాల పుస్తకం బహుకరణ
డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తులసి రామ్
తిరుపతి(నేటిధాత్రి)
నేడు రైల్వేలో పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎం రాధాకృష్ణకు రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తులసీరామ్ బొజ్జా తారకం రాసినటువంటి వ్యాసాల పుస్తకమును బహుకరించారు . తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయుల అభినందన సభలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత దేశ అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ క్రమశిక్షణ నిబద్ధత గల వెత్తి నేడు పదవి విరమణ పొందిన రాధాకృష్ణ అని తాను చిన్నప్పటి నుంచే సుపరిచితుదు మరియు విద్యార్థి దశ నుంచే తన క్రమశిక్షణ పట్టుదలతో నేడు రైల్వేలో ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందడం సంతోషంగా ఉందని కొనియాడుతూ రైలు లో వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న సమయంలో మనం ఎంత సంతోషంగా సాఫీగా కూర్చొని, పడుకొని ప్రయాణిస్తున్నామంటే అందుకు రైల్వేలో పనిచేసే చిన్నపాటి కార్మికులే కారణమని గ్యాంగ్ మ్యాన్ లో ట్రాక్మెన్లు నైట్ పెట్రోలింగ్ చేసే ఉద్యోగులు కారణమని గుర్తు చేశారనిఅన్నారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత బొజ్జా తారకం రాసినటువంటి వ్యాసాలను చదవడంలో సమాజ శ్రేయస్సు కోసం సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాని అన్నారు .
