ప్రజా సేవ కోసం 34వ డివిజన్ అభ్యర్థిగా దీవించండి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో మీ ముందుకు
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా
సింహం ల మీ ముందుకు వస్తున్న ముస్కె రవికిరణ్ యాదవ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ తెలంగాణ జాగృతి బలపరుస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ముస్కె రవికిరణ్ యాదవ్ సింహం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రజలకు కల్పించే మౌలిక వసతులు
ప్రతి వీధిలో సీసీ రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం,శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు,పాత లైట్ల మరమ్మతులు చేపించడం.
పేదల సంక్షేమ కొరకు
అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టడం.డబల్ బెడ్ రూమ్, ఇండ్ల స్థలాల కోసం నిరంతర పోరాటం,వృద్ధులు, వికలాంగుల కొరకు పెన్షన్ సదుపాయం కల్పించడం.
విద్య,యువత
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు స్టడీ సర్కిల్స్, లైబ్రరీలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కల్పించడం.
మహిళల అభివృద్ధి కోసం
మహిళల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు,స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం,మహిళ సంఘాలకు ప్రోత్సాహం కల్పించి అన్ని విధాల అండగా ఉంటామని వారు తెలిపారు.34వ డివిజన్ లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సేవ చేసే నాయకుడికి తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు.a
