భూపాలపల్లి నేటిధాత్రి
బిజెపి పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ.పేదల కోసం దేశం కోసం పని చేసే పార్టీ బిజెపి పార్టీ నిర్మాణ సమయం నుండి ఎన్ని అభివృధి కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం ఒక్క విశ్వ గురువు గా బోధించే స్థాయి కి బిజెపి పార్టీ కృషి చేసింది ఇలానే అనేక అంశాలను అభివృద్ధి లో ముందు ఉంచుతూ ఎంతో మంది కి అండగా నిలుస్తూ ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిషిదర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నం యుగదీశ్వర్ శ్యామల మధుసూదన్ రెడ్డి జిల్లా, మండల నాయకులు పాల్గొనడం జరిగింది .