*కమ్యూనిస్టులు బలపడితేనే కార్మిక హక్కులు ప్రజా సంక్షేమం మిగులుతుంది*
* దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో సిఐటియు*
**తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విధానాలు దేశానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయని బిజెపిని దాని విధానాలను కూకటివేళ్లతోటి బెకిలించివేయాలని అప్పుడు మాత్రమే దేశంలో కార్మిక హక్కులు ప్రజా సంక్షేమం రాజ్యాంగ విలువలు రక్షించబడతాయని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పేర్కొన్నారు దేశంలో కమ్యూనిస్టులు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఉన్న రోజుల్లోనే కార్మికులకు దేశ ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు కమ్యూనిస్టులు బలహీనపడటంతో పాలక ప్రభుత్వాలు ముఖ్యంగా కార్పొరేటు మతోన్మాద విధానాలను అత్యంత దూకుడుగా అమలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను రద్దు చేస్తుందని విమర్శించారు లేబర్ కోడ్ లు ఆధునిక సమాజంలో నయా బానిస విధానం అమలు చేయటానికి లేబర్ కోడులు పునాదులుగా నిలుస్తాయని సిఐటియు విమర్శించింది రద్దు చేయాలని రైతులు పండించే పంటలకు పార్లమెంటులో గిట్టుబాటు ధరల చట్టం చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది 178 రూపాయల ఫ్లోర్ లెవెల్ కనీస వేతనంతో కార్మికులు ఎలా బతకగలరని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు ప్రశ్నించింది నరేంద్ర మోడీ 5 సంవత్సరాల కాలంలో తన ఒక్కడి ఆహారం కోసం 110 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని కోట్లాదిమంది కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు కేంద్ర బిజెపి ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 83 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో దేశాన్ని పరిపాలించిన పాలక పార్టీలు ఈ విషయంతో సిగ్గుపడాలని సిఐటియు పేర్కొన్నది కనీస వేతనం 26,000 చట్టబద్ధమైన సౌకర్యాల అమలు కార్మికుల ప్రాథమిక అవసరాలని సిఐటియు పేర్కొన్నది దేశ సమస్యలను పక్కదారి పట్టించడంలో బిజెపి మతాన్ని కులాన్ని భావోద్వేగపూరితంగా రెచ్చగొడుతున్నాయని విమర్శించారు దేశ ఆర్థిక ప్రగతికి రైతులు కార్మికులు ఇరుసు లాంటి వాళ్ళని ఆర్థిక రంగాన్ని వ్యవసాయ పారిశ్రామిక రంగాలను సేవా రంగాలను కార్పొరేట్ అధిపతులకు దోచిపెట్టడం వెనక కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తుందని సిఐటియు విమర్శించింది దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది మహిళా స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆటో అమాలి తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాన్ని చేయాలని సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోవటం లేదని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజానకొలమైన ప్రజాప్రతినిధులను గణనీయమైన సంఖ్యలో కమ్యూనిస్టులను పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత కార్మిక వర్గం పై ఉందని సిఐటియు పేర్కొన్నది అనంతరం కరకగూడెం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతోపాటు వినతీ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఐకెపి ఆటో రంగం యూనియన్ల కార్మికులు పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిల్ భవాని మంగ సుజాత వెంకన్న పాపారావు సాంబమూర్తి సావిత్రి భద్రకాల వివిధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు